Active Blogs | Popular Blogs | Recent Blogs జీవితం చాల అందంగా కనపడుతుంది. ప్రతి మనిషి లాగే నాలోనూ ఉన్న రెండవ భాగం చాల అద్బుతంగా ఉంది. స్వార్ధం , పిరికితనం, పక్క మనిషి గురించి పట్టని నిర్లక్ష్యాల నడుమ కూడా ఒక అందమైన లోకం కనపడుతుంది.
వేసవి కి చల్లని నీరు లా ..చలికి వణికే చిగురాకు కి తోడు గా .. నా చూపు ని కాపాడే రెప్ప లా నీ స్నేహం దొరికినప్పుడు సంతోషం వేసింది..
అన్ని సమస్యల్ని ఎదుర్కొమ్మని చెప్పే నాకు సమస్య వచ్చినప్పుడు ఎదురు వెళ్ళమని , కదలకండా నిలుచోమ్మని చెప్పే అక్కని చూసి ..చాల్లే ఇక దూరం అయిపోయే స్నేహం కాదిది అనిపిస్తుంది.
చల్లని మబ్బుల మధ్య వీచిన చిరుగాలిలా, రోజంతా అలసిన శరీరానికి అమ్మ వళ్ళో పట్టే కమ్మని నిద్ర మరుసటి రోజు కష్టపడటానికి భయపడక్కర్లేదు అని గుర్తు చేస్తుంది.
ఏదో దారి వెతుక్కుంటూ వెళ్లి ఏది కనపడక వెనుదిరిగిన వేళ పోనిలెమ్మని చెప్పే ధైర్యం చాలదా, ఓడిపోకుండా ఉండటానికి అనిపిస్తుంది.
నేను ఏదో చూసి ఆశ పడితే .. ఎందుకు అని అడగకుండా అడిగింది అడగంది అన్నీతెచ్చి పెట్టె మీ ప్రేమ బయటి ప్రపంచపు స్వార్దాన్ని భరింప చేస్తుంది.
నా మోము చింతతో చిన్నబోయినప్పుడు అన్నీ పనులు మానుకుని నా పక్కన కూర్చునే మీ అభిమానం .. నా లోని పిరికితనాన్ని సైతం భయపెట్టేలా ఉంది.
ఎందరో వచ్చి ఎటో వెళ్ళిపోయినా .. ఎక్కడా ఆగకుండా నన్ను మీతో పాటు తీసుకెళ్ళిన మీ నిజాయితి నేనూ వంటరిని కాదు అని చెప్తోంది.
అందంగా ఉంది. అన్ని సమస్యల మధ్య.. అందరి అలక్ష్యాల మధ్య .. ఇంకా సజీవంగానే ఉంది.
జీవితం ఇంకా ఆనందంగానే ఉంది.
 Krishna Goutami | ivi adaa leka magaa anna thedatho rasinavi kavu. bhavalaki linga bedham undadhu ani naa abiprayam.
Posted at: 15, Jun 2010 0:24 AM |  Buddha Chinna Bhaskara Rao | ee bhavalu adavariki veruga magavariki veruga untayi... intakoo meeru adaaa ? magaa?
Posted at: 14, Jun 2010 3:17 PM |
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|