Active Blogs | Popular Blogs | Recent Blogs అన్నీ నిముషాలై అడిగింది ఉదయం ,
చిన్ని చినుకై ఉండేది నీ హృదయం, ఏది ఎటు వెళ్ళింది అని నీ పయనం .
కొమ్మల్లో కోయిల గానం కాదది . ఊయల్లో ఆడిన పాప వైనం కాదది.
అది నిన్ను ఆలోచించమని చెప్పే నా మది. అది ఊగే నీ ఆలోచనల్ని ఆగమని చెప్పింది.
ఒక చిన్న అబద్దం కథ గా మారింది. ఒక చిన్న మాట పాటగా మారింది.
ఒక చిన్న నవ్వు పలకరింపు గా మారింది. అన్నీ కలిసి నీ స్నేహం గా మారింది.
ఎక్కడ్నుంచి వచ్చిందో మరి కరిగిపోయిన ఒక కల, ఆశ్చర్యంగా ఉంది నాకు. మళ్ళీ తేనుందా అది చెదిరిపోయిన ఒక అలని ? అన్ని దారుల్ని మౌనం గా దాటుతున్న ఈ నేలని ?
పలికే చిలక్కమ్మా, నువ్వైనా చెప్పవమ్మా. గాలికి ఎగురుతావు కానీ గదిని దాటలేవు ఎందుకు .
దాయి దాయి అంటావు కాని ఆ చందమామ కిందకు రాదు అని తెలుసుకోవు . తలపైకెత్తి ఎదురు చూస్తూనే ఉంటావు.
చిరు చినుకుగా మారిన మబ్బు నేల చేరే లోపే ఆవిరైపోతుంటే ఆపలేక దిక్కులు చూస్తూంటావు.
నేను కూడా అలాగే చూస్తున్నాను. తెలియని కారణాల కోసం వెతుకుతున్నాను.
 kumar swamy | kaaranaalaki kaaranam maman kaadu, manalni manam veytukkovadamlo mahadaanandam vundi. chilakammakeym telusu jilibili palukulu tappa. atlaa ankovadam daani tappa? adi daani amaayakatwam tappa! choostoo vuntey choopistaaru, cheystoo vuntey choodostaaru. yeduru debbalalo yedigey avakaasam vundi, chaatuna daagey vaallaki choodadaaniki aakaasam vundi. chinuku aaviraindaney chinta yela? antamaatranikey pattuk koorchoovala tala? kala ani teylisina kalata yela? seeta kannu kaligivuntey pola?
Posted at: 17, Jun 2010 6:08 AM |
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|