Active Blogs | Popular Blogs | Recent Blogs కదలలేని కళ్ళలో కలవైనావు. అడగలేని గొంతులో పిలుపైనావు.
అడుగైన వేయలేని రాయిలో నడకైనావు. ఆద మరిచిన హృదయానికి మెలకువైనావు.
అదిగో అప్పుడొచ్చింది ఒక ఊహ .
నీవొక రాముడివని చెప్పింది. నీవొక దేవుడివని చెప్పింది.
చేతులెత్తి మొక్కే లోపే మరో చిత్రం కనిపించింది.
నీ కళ్ళలోని అనుమానాన్ని చూపింది. వేకువ జామున వెలిగే సూరీడు సాక్షిగా, మరవని నీ స్నేహం సాక్షిగా, నువ్వు వదిలి వెళ్ళిన నీ ప్రమాణం సాక్షిగా .. నువ్వొక అబద్దం అని చెప్పింది.
నా రచనల్లో దాగున్న నీ రూపం నిజం కాదని తెలిసిపోయింది. అయినా రాస్తూ ఉన్నా, ఎక్కడైనా నా రాతలకి ప్రాణం వచ్చి నువ్వు నిలబడతావేమో అని.
ఒక్కసారైనా .. ఒక్క రోజు కోసం అయినా నా ఊహ నిజం అవ్వాలని.
స్త్రీని వర్ణించి ..ప్రేమించి.. వదిలేసి వెళ్ళిపోతే తను కనపడక ఆవేదన చెందావని.
అమ్మగా..ప్రేమగా..నేస్తంగా .. అన్నింటా ఆడదాన్ని నింపావని.
నీ రచనలకి జవాబు ఇస్తున్నా.
ప్రతి మనిషికి తన ఊహను నిజం చేసుకునే శక్తి ఉంటే బాగుంటుంది..
నీలోని నీలి నీడని, నీలోని స్వార్దాన్ని,నువ్వు ఒప్పుకోలేని నీ అహాన్ని, అన్నింటినీ తీసేసి..ఒక తెల్లని పువ్వులాంటి నిన్ను తయారుచేస్తే బాగుంటుంది.
ఇది జరగదు అని తెలిసీ రాస్తున్నా..నా కల్పనకి ప్రాణం వచ్చి నువ్వు పుట్టాలని
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|