నీ వీధి గుమ్మాన్ని నే in My Pen at TeluguPeople.com - Telugu Community Portal. Social Networking, Chat, Blogs, Classifieds, Videos, Photos, Galleries, Bollywood, Movies, Hyderabad, Visakhapatnam, Tirupati, Vijayawada, Guntur, Warangal, Kakinada, Kadapa, Kurnool, Rajahmundry and lot more...
TeluguPeople
  are the trend-setters

Active Blogs | Popular Blogs | Recent Blogs

Krishna Goutami's Blogs >> My Pen

నీ వీధి గుమ్మాన్ని నే

ఏమిటన్నా నీ గొప్పతనం.
కమ్మని పాటలా సాగితేనే పయనం.
కన్నీరు కార్చే కళ్ళని చెమ్మగిల్లనివ్వక పొతేనే నీకు అర్దం.
నువ్వు రాముడివని, క్రిష్ణుడివని. రాధవని ..రాకుమారివని ..అన్ని కధలు చెప్పిన మనిషే
ఇప్పుడు నువ్వు చెప్పే కబుర్లు వినాలని అన్ని పనులు మానుకుని ఎదురు చూస్తుంది.
నిన్ను చదివించడానికి, బడిలో చేర్పించడానికి . నిన్ను ఆడించడానికి,ఇంకొకరిపై ఆధార పడకుండా చెయ్యడానికి.. నీ ప్రతీ అవసరానికి ఒక్కో రూపాయి కూర్చి పోగుచేసిన మనిషి. ఇప్పుడు నువ్వు పంపే డాలర్ ని ఏం చేయ్యలో తెలియక, అలాగే దాచుకుంది. అది నువ్వు అవసరాన్ని తీరుస్తుదంటూ గొప్పలు పోతే , కాదు, కేవలం నిన్ను గుర్తు తెచ్చే, నువ్వు పక్కనే ఉన్నటనిపించే కాగితం అని చెప్పలేకపోయింది.
నువ్వు తింటేనే కాని ఆకలి గుర్తు కూడా రాని ఆమె మనసే , ఇప్పుడు తిన్నావా అని నువ్వు వారానికోసారి అడుగుతుంటే అదేదో ఉపకారంలా మురిసిపోయి అందరికీ చెప్పుకుంటుంది.
బయట పడలేదు కదా అని తేలిక చేసావు నువ్వు. మరి ఆమేమో బయట పడలేక లోన దాచుకోలేక దిక్కులు చూస్తూ కూర్చుంది.

ఏమిటన్నా నీ గొప్పతనం ..నీ కన్నా నేనే నయం కదా.
నీ వీధి గుమ్మానైనా , వచ్చి పొయేది ఎవరయినా, అందర్నీ పలకరిస్తాను.
నన్ను తగిలి గాయపడొద్దని , జాగ్రత్తగా వెళ్ళమని చెప్తాను.ఆమెకు తోడుగా నేను కూడా ఎదురు చూస్తూ ఉంటాను.
వీధి గుమ్మాన్నే నేను. అయినా ఎన్నో చూసాను.
నువ్వు ఒక్క నిముషం అని చెప్పి ఆ విషయాన్ని మర్చిపోతే, మరల తిరిగి చూస్తావని అదే పనిగా పడిన ఆరాటాన్ని.
పదే పదే అయ్యో మర్చిపొయా అంటే పొనీలెమ్మన్న మంచితనాన్ని.
నువ్వు తట్టకపొయినా నన్ను తెరిచే ఉంచిన ఆమె పిచ్చితనాన్ని .

ఎప్పుడో పండక్కి ఒక్కసారే నన్ను కడిగి పసుపు రాసి బొట్టు పెట్టింది.
మరి నీకు ఎన్ని సంవత్సరాలో లాల పోసింది.
నీ ఇంటి వీధి గుమ్మం నేను. అందుకే ఆమెకు కాపలా కాసాను.
ఎవరొచ్చినా నువ్వేనేమో అని ఆమె పరిగెట్టకుండా చూసుకున్నాను.
నీ కన్నా నేనే మేలయ్యాను.

పొతే పొనీ.. కన్ను మూసి తెరిచే లోపు మాయం అయ్యే క్షణాన్ని.. కదలదేమో అన్నంత భారంగా మార్చే ఙ్నాపకం మరిచిపొతెనే మంచిది కదా.
ప్రయోగాలకి తావు లేదు. అయినా… నీలోని మానవత్వాన్ని నువ్వు ఎదిగే దాకానే నిలిపి ఉంచే మానవ సంబంధం దూరం అయితేనే మేలు కదా.



 

Asharam Sohni
great thought provoking and meaning full , keep it up, have a niceday.


Posted at: 1, Jul 2010 2:05 AM

Ramachandra Rao Nidadavolu
Good, thought provoking...

Posted at: 27, Jun 2010 2:56 PM
 



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.