శ్రీ శ్రీ శ్రీ పిళ్ళా in Samanvaya Drusti at TeluguPeople.com - Telugu Community Portal. Social Networking, Chat, Blogs, Classifieds, Videos, Photos, Galleries, Bollywood, Movies, Hyderabad, Visakhapatnam, Tirupati, Vijayawada, Guntur, Warangal, Kakinada, Kadapa, Kurnool, Rajahmundry and lot more...
TeluguPeople
  are the trend-setters

Active Blogs | Popular Blogs | Recent Blogs

Pilla Anjani RaviShanker's Blogs >> Samanvaya Drusti

శ్రీ శ్రీ శ్రీ పిళ్ళా

సమన్వయ దృష్టి
శ్రీ శ్రీ శ్రీ పిళ్ళా అంజనీ రవిశంకర్ గారు, సమన్వయ దృష్టి వ్యవస్థాపకులు, భాగవత్సాక్షత్కార సంపన్నులు, భగవత్ సేవకులు అనకాపల్లి నుండి వారికి కలిగిన సాక్షాత్కార ప్రభావమును సాటి మనుష్యులు అందరికీ, స్పష్టము చేయ దలచి వ్రాయు లేఖార్ధములు. ఈ అద్భుతమైన ప్రభావము భూమి పైకి యావత్తు మానవ జాతిని, సమస్త జీవ రాసులని, పంచభూతాలను పరిరక్షించడానికి వచ్చినది. కుల, మతములకు అతీతముగా, మనల్ని అందరిని తల్లి తండ్రి గురువు వల్లే పరి రక్షించడానికి సంసిద్దముగా ఉన్నది, మనము సాటి మనిషిని, మాటని ఉన్నది ఉన్నట్లు తీసుకొనవలెను. వీలు అయినంత నిజాయితీగా ఒకరికి ఒకరు సహకరించుకొనవలెను.
నాకు ఊహ తెలిసిన దగ్గరనుండి సంగీతము అనగా సినిమా పాటలు వినడం వలన మంచి చైతన్యమును పొందినాను. అదే విదముగా, సాటి మనుష్యుల కష్టములకు, సుఖములకు త్వరగా స్పందిస్తాను. ప్రతీది నాది గా భావిస్తాను, మనసుతో ఇట్టే పరకాయ ప్రవేశము చేసుకొని, పరిస్తితుల్ని మనసుతో తీసుకొంటాను. ముఖ్యముగా అబ్యుదయము చైతన్యము కలిగించే పాటలు మీద ఎక్కువగా ఆలోచిస్తాను, ఈ వాళ సమాజము నన్ను అ విధముగా ఆలోచించేటట్లు చేసినది అని స్పష్టము చేయుచున్నాను. నన్ను కాలము ఒక పద్దతి ప్రకారము ఈ విదముగా నా మనసుని తీర్చిదిద్దినది, ఇందులో కష్టము, సుఖము కలసి ఉన్నవి, నన్ను కష్ట సుఖములకు అతీతము అయిన మనిషిగా, మాట మాత్రముగా నిలిపినది, మరింత సాధనతో నిరంతర కృషితో ముందుకు వస్తున్నాను.
ఇక్కడ, నాకు పాత పాటలలో మంచి ప్రేరణ ఇచ్చిన పాటలు కొన్ని ప్రస్థావిస్తాను గ్రహించగలరు. ఇంకా నాకు ఇష్టము అయిన పాటలు చాలా ఉన్నాయి, నన్ను ఆలోచింప చేసి, చైతన్యమును నిలిపినవి. ఈ పాటలు ఎవరు వ్రాసినారు అను విషయములో ఖచ్చితముగా నాకు సమాచారము లేదు. ఎవరు రచించినా, భగవంతుని ప్రేరణ తో రచిస్తారు అని, నాకు స్పష్టము అయినది. ఈ సదర్భముగా ఆ యా పాటలు రచించిన కవి ఈశ్వరులు అందరికీ పేరు పేరునా, నా నమస్కారములు, తెలియ చేసుకోనుచున్నాను.
రుద్రవీణ సినిమాలోని పాటలు గ్రహించగలరు.
వంటరిగా దిగులు బరువు మోయబోకు నేస్తం
మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం
కష్టము వస్తేనే కదా గుండె బలం తెలిసేది
దుఃఖానికి తల వంచితే తెలివికి ఇంక విలువ ఏది
మంచి అయినా చెడ్డ అయినా పంచుకోను నే లేనా
అ మాత్రము అత్మియతకు అయినా పనికి రానా ఎవ్వరితో ఏమాత్రం పంచుకోను వీలులేని
అంతటి ఏకాంతము అయినా చింతలు లేమిటి అండీ
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది ....4
గుండెలలో సుడులు తెరిగే కలత కధలు
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది ......3
కోకిలల కుటుంబములో చెడ బుట్టిన కాకిని అని
అయినా వాళ్ళు వెలి వేస్తే అయినా నేను ఏకాకిని ...2
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది ....2
పాత బాట మారాలి అని చెప్పడమే నా నేరం
గూడు విడిచి పోమ్మనది నన్ను కన్న మమకారం
వసంతాల అందం విరబూసే ఆనందం తేటి తేనే పాట పంచ వన్నెల విరి తోట ...2
బ్రతుకు పుస్తకములో ఇది ఒకటేనా పుట
మనిషి నడచు దారుల్లో లేదా ఏ ముళ్ళ బాటా...2
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది ....2
ఏటి పొడుగునా వసంతం ఒకటేనా కాలం
ఏది మరి మిగతా కాలాలకి తాళం
నిటూర్పుల వడగాలుల శృతిలో ఒకడు
కంటినీటి కుంభ వృష్టి జడి లో ఇంకొకడు
మంచు వంచెనకు మోడై గోడు పెట్టువాడు ఒకడు
వీరు గొంతు లోని కేక వెనుక వున్నది ఏ రాగం
అనుక్షణం వెంటాడే ఆవేదన ఏ రాగం
అని అడిగిన నా ప్రశ్నకు అలిగేనంత కోకిల
కళ్ళు ఉన్న కభోదిగా చెవులు ఉన్న భదిరుడిగా
నూతిలోని కప్పలా బ్రతకమన్న శాశనం
కాదు అన్నందుకు అక్కడ కరువు ఆయను నా స్థానం
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది ....3
అసహాయతలో దడ దడ లాడే హృదయ మృదంగ ద్వానం
నాడుల నడకల తడ బడే సాగే ఆర్తుల ఆరని శోకం
ఎడారి బ్రతుకున నిత్యం చస్తూ సాగే బాదల బిడారు
దిక్కూ మొక్కూ తెలియని దీనుల యదార్ధ జీవన స్వరాలూ
నిలువునా నన్ను కమ్ము తున్నాయి శాంతితో నన్ను నిలవకున్నాయి
ఈ తీగలు సవరించాలి ఈ అపశ్రుతి సరిచేయాలి
జన రీతిని వద్దు అనుకొంటూ నాకు నేనే పెద్ద అనుకొంటూ కలలో జీవించాను నేను కలవరింత కోరను నేను
నేను సైతం విశ్వవీణ కు తాంత్రి ని మూర్చానలు పోతాను
నేను సైతం భువన గోషకు వెర్రి గొంతుక ఇచ్చి మ్రోస్తాను
నేను సైతం ప్రపంచాగ్యపు తెల్లా రేఖ అయి పల్లవిస్తాను
నేను సైతం నేను సైతం బ్రతుకు పాటకు గొంతు కలిపెను...2
సకల జగతిని శాశ్వతముగా వసంతం వరియించుదాక ప్రతీమనిషికి జీవనంలో నందనం వికసించుదాకా
పాత పాటను పాడ లేను కొత్త బాటను వీడి పోను --2
నేను సైతం నేను సైతం ... 3
ఊ ఊ
నేను సైతం నేను సైతం ... 3

ఈ పాట వలె, నా మనసు కూడా చాల సందర్బాలలో రగిలినది. ఈ పాట నాకు చాలా దైర్యమును ఇచ్చినది. ఇంకా ఇతర అనేక పాటలు, అన్ని రకాల పాటల ప్రేరణతో, ఇతర చిన్నపటినుండి మంచి, చెడు పరిస్తితులు నన్ను మెల్ల గా కాల స్వరూపుడుగా నిలిపినవి. అనగా నేను 1999 మే లో ఒకసారి మరియు 2003 జనవరి 1 వ తారికున రెండవ సారి కాల స్వరూపమును వ్యక్తపరచినాను. అందులో 1999 నుండి దాదాపు 2008-9 వరకు వచ్చిన సినిమా పాటలు, రాజకీయ సంఘటనలు, టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్, కొన్ని సినిమాలోని సంభాషణలు, నిజజీవితము లో ఆయా వ్యక్తులు సంభాషణలు వ్యవహారములు ముందే గంటా గంటనర సమయములో భగవంతుడు నా ద్వార వ్యక్త పరచినాడు. ఇది అక్షర సత్యము.
ఇప్పుడే మరొక పాత పాట గ్రహించగలరు
చుట్టూ పక్కల చూడ రా చిన్న వాడ చుక్కలో చూపు చిక్కు కొన్న వాడ .....2
కళ్ళ ముందు కటిక నిజం కాన లేని గుడ్డి జపం సాధించదు ఏ పరమార్ధం బ్రతుకును కానియ్యకు వ్యర్ధం..2
చుట్టూ పక్కల చూడ రా చిన్న వాడ చుక్కలో చూపు చిక్కు కొన్న వాడ
స్వర్గాలను అందుకొనాలని వడి గా గుడి మెట్లు ఎక్కేవు
సాటి మనిషి వేదన చూస్తూ జాలి లేని శిలవు అయినావు
కరుణను మరిపించేద చదువు సంస్కారము అంటే
గుండె బండగా మార్చేదా సంప్రదాయము అంటే....2
చుట్టూ పక్కల చూడ రా చిన్న వాడ చుక్కలో చూపు చిక్కు కొన్న వాడ
నువ్వు తేనే ప్రతి ఒక్క మెతుకు ఈ సంఘం పండించింది
గర్వించే ఈ నీ బతుకు ఈ సమాజమే మలచింది రూణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతున్నావా
తెప్ప తగలబెటేస్థావ యేరు దాటగానే ...2
చుట్టూ ప్రక్కల చూడరా చిన్న వాడ చుక్కలో చూపు చిక్కు కొన్న వాడ
కళ్ళ ముందు కటిక నిజం కాన లేని గుడ్డి జపం సాధించదు ఏ పరమార్ధం బ్రతుకును కానియ్యకు వ్యర్ధం..2
చుట్టూ పక్కల చూడ రా చిన్న వాడ చుక్కలో చూపు చిక్కు కొన్న వాడ

పైన పాటలో చుట్టూ పక్కల చూడరా చిన్న వాడ అనగా మనసుకు చిన్నవాడు అని అర్ధము, భగవంతుడి అనుభవము ముందు మనము అందరము చిన్న పిల్లలమే అని గ్రహించగలరు. మనసు ముందు ఉన్నవి గ్రహించండి, మనసును చంపుకొని బ్రతకవద్దు అని అర్ధము, స్వర్గాలను అందుకొనాలని వడిగా గుడి మెట్లు ఎక్కేవు సాటి మనిషి వేదన చూసి జాలి లేని శిలవు అయినావు. అనగా నేను ఇక్కడ అనకాపల్లి లో మరల ప్రార్దించి స్పష్టము చేయుటకు ముందుకు రావడానికి ప్రయత్నము చేసినా మనుష్యులు స్వార్ధముతో నన్ను నా మనసుని అర్ధము చేసుకోనకుండా అజ్ఞానముగా ప్రవర్తించుచున్నారు. ఏదో నేను తేలికగా గొప్ప వాడిని అయిపోయి నాను అనుకోనుచున్నారే తప్ప, సాటి మనిషి మనసు యెక్క గొప్పతనము, మనస్సు పెట్టి చూడ లేక పోవుచున్నారు. నన్ను ప్రత్యక్షముగా, పరోక్షముగా గమనిస్తున్నవారు అందరు మరింత అప్రమత్తము చెందగలరు. కాగితము పై రాయడానికి, ప్రతీదానికి అర్ధము మరింతగా, నాణ్యముగా చెప్పా డానికి నాకు, ఆయా పండితుల సహకారము అవసరము, నన్ను మనసు పెట్టి శ్రద్దగా గ్రహించవలెను అప్పుడే నాలోని గొప్పతనమును జాగ్రత్తగా గ్రహిచగలరు అని స్పష్టము చేయుచున్నాను . నమస్కారములు .

వివరముల కొరకు, సూచనలు సలహాలు ఇచ్చుటకు, ప్రశ్నలు అడుగుటకు నా emails :
ravisanker@ymail .com



 
Be first to comment on this Blog Post!
 



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2026 TeluguPeople.com, All Rights Reserved.