అధ్యాత్మిక సంపదయే శ్ in manasuloo maata at TeluguPeople.com - Telugu Community Portal. Social Networking, Chat, Blogs, Classifieds, Videos, Photos, Galleries, Bollywood, Movies, Hyderabad, Visakhapatnam, Tirupati, Vijayawada, Guntur, Warangal, Kakinada, Kadapa, Kurnool, Rajahmundry and lot more...
TeluguPeople
  are the trend-setters

Active Blogs | Popular Blogs | Recent Blogs

Pratap Cherukuri Pratap's Blogs >> manasuloo maata

అధ్యాత్మిక సంపదయే శ్

ప్రపంచ దేశాలన్నింటిలో కెల్లా భారత దేశం అధ్యాత్మిక సంపదలలో సుస్సంపన్నం. వేద భూమిగా కీర్తి గాంచిన మన దేశం ధర్మ శాస్త్రాలకు నిలయం. ఆరవై నాలుగు కళలకు పుట్టిల్లు. ఫరమ నిష్టా గరిష్టులు, తపోనిష్టులైన మహర్షులెందరో వెలిసి అనితర సాధ్యమైన తప:శక్తిని సాధించి తద్వారా మనకు ఒక చక్కని సంస్కృతీ, సాంప్రదాయాలను ఏర్పాటు చేసారు.వేద శాస్త్రములను అర్ధం చేసుకోలేని వారి కోసం ఉపనిషత్తులను, పురాణేతిహాసాలను రచించి తిరుగు లేని అధ్యాత్మిక సంపదను మనకందించారు. ఆవి మనకు శిరోధార్యం, సదా అనుసరణీయం. వాటిని శ్రద్ధగా చదివి, ఆకళింపు చేసుకొని ఆచరించిన వారి జీవితం లో ఎల్లప్పుడూ ఆనందమే. అశాంతి, అలజడులు మచ్చుకైనా కనిపించవన్నది యుగ యుగాలుగా నిరూపింపబడిన సత్యం.

చరిత్రను పరికిస్తే ఎందరో పరాయి దేశస్థులు, మతస్థుల మన దేశంపై దండెత్తి విలువైన రాజ్య సంపదను దోచుకుపోయారు కాని మన అతి విలువైన అధ్యాత్మిక సంపదను మాత్రం ఏం చేయలేకపోయారు. ఆవి ఈనాటికి వివిధ రూపాలలో గుప్తమై వున్నాయి. జిజ్ఞాస కలిగిన వారు శ్రద్ధతో, పట్టుదలతో యత్నిస్తే మనకు లభ్యం అవితాయి. మన జీవిత విధానాన్నే మార్చేస్తాయి. మన మహర్షుల తాపసిక విధానమే మన దేశాన్ని ఇంతకాలం కాపాడుతూ వచ్చింది. విషపు విదేశీ సంస్కృతి అతి వేగం గా చొచ్చుకొస్తున్న ప్రస్తుత తరుణంలో మన సంస్కృతి, సంప్రదాయలను కాపాడుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా వుంది. విదేశీ సంస్కృతిని అవలంబిస్తే అధోగతి పాలు కావడం తధ్యం.

ప్రపంచ విజేత అయిన అలెగ్జాండర్ ఒక సారి తన జైత్ర యాత్ర లో భాగంగా భారత దేశం వచ్చాడు. ఒక రాజ్యంపై దండయాత్ర కోసం వెళ్తుండగా ఒక అడవిలో ఒక చెట్టు కింద తపో నిష్టలో వున్న ఒక మహర్షిని చూసాడు. ఆతను ఆశించినట్లు ఆ మహర్షి కళ్ళు తెరవలేదు. భగవధ్యానంలో మునిగి చుట్టూ ఏం జరుగుతున్నదీ పట్టించుకోవడం లేదు.అందుకు అలెగ్జాండర్ కు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రపంచాన్నే గెలిచి విశ్వ విజేతగా నిలిచిన తనకు ఒక సాధారణ వ్యక్తి తలవంచి అభివందనం చేయకపోవడమా ? పైగా తనను గమనించనట్లు కళ్ళు మూసుకొని కూర్చోని తన పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రకటించడమా ? అవమానంతో రంకెలు వెస్తూ ఖడ్గం తీసి అమాంతం ఆ తపస్వి తల నరకబోయాడు.అప్పుడు కళ్ళు చెరిచిన ఆ మహర్షి అతనిని చూసి బిగ్గరగా నవ్వాడు. ఆయన ప్రవర్తన చూసిన అలెగ్జాండర్ కు మరింత కోపం హెచ్చయ్యింది. “ఎందుకలా నవ్వుతున్నావు? మరణమంటే నీకు భయం లేదా ?”అ ని ప్రశ్నించాడు.

అందుకూ ఆ మహర్షి ఒక్క క్షణం తపోనిష్టలోనికి వెళ్ళి అనంతరం ఎంతో మృదుస్వరంతో శాంతంగా “ నాయనా, నువ్వు ఖడ్గం తీసి నన్ను చంపాలనుకున్నావు.నువ్వు నా శరీరాన్ని మాత్రమే ఖండ ఖండాలుగా నరకగలవు, శరీరం అనిత్యం, ఏనాటికైనా నశించేది కాబట్టి అది నీకు సాధ్యం, కాని నువ్వు నన్నేమీ చెయ్యలేవు, నాకు మరణం రాదు ఎందుకంటే నేను నిత్య సత్య ఆత్మ స్వరూపుడిని. ఆత్మను శస్త్రాలు చేధించలేవు, అగ్ని దహించలేదు, నీరు తడుపజాలదు, ఆత్మ నిత్యం, సత్యం,అమరం” అని అన్నారు.

అలెగ్జాండర్ కు ఆ మాటలు విన్నంతనే సంభ్రమాశ్చర్యాలకు గురయాడు. ఆత్మ తత్వం గూర్చిన ఇంతటి అద్భుతమైన ప్రభోధాన్ని అతనింతవరకు విని వుండలేదు. అధ్యాత్మిక వైభవంతో విరాజిల్లుతున్న ఇటువంటి పరమ పవిత్రమైన దేశం పై దండెత్తడం మహా పాపమని తలిచి ఆ మహర్షికి శిరస్సు వంచి అభివాదం చేసి తిరిగి తన దేశానికి వెళ్ళిపోయాడు.

చూసారా ! మన దేశం యొక్క వైభవం ? విశ్వ విజేత అయిన అలెగ్జాండర్ చక్రవర్తినే ఒక మహర్షికి శిరస్సు వంచి నమస్కారం చేసేలా చేసింది.

ఆ మహర్షికి వున్న ధైర్యం, నిర్భయత్వం కేవలం ఆత్మ జ్ఞానంతో నే వస్తాయి. ఆది సాధించేందుకు నిరంతర కృషి, మనసును నిర్మలంగా వుంచుకోవడం సదా భగవన్నామస్మరణ వలనే సాధ్యం.

భగవంతుని నీడలో బ్రతికేవారికి కష్టాలనేవి దూరంగా వుంటాయి. అందుకే మనం వేసే ప్రతీ అడుగు భగవంతుని ఆజ్ఞానుసారం వెయ్యాలి. ఎల్లప్పుడూ సత్యం పలుకుతూ ధర్మయుతంగా జీవించాలి. తన కోసమే కాక తనకు ఇంత నిలువ నీడ కల్పించి తన ఉనికికి అర్ధం కల్పించిన సమాజం కోసం ఇతోధికంగా కృషి చెయ్యాలి. నైతిక విలువలను ప్రాణం కంటే ఎక్కువగా కాపాడుకుంటూ నిత్యం ఆచరించాలి.
ఇచ్చేది,తీసుకునేది ఆ సర్వేశ్వరుడే కాబట్టి జీవితం లో సంభవించే కష్ట నష్టాలకు ఏ మాత్రం ఆందోళన పడక భగవంతునిపై భారం వేసి నిశ్చలంగా వుండాలి.

ఐహిక సంపదలు అశాశ్వతం. ఏనాటికైనా నశించేవే. అధ్యాత్మిక సంపదే శాశ్వతమైనది. ఇహంలోనూ, పరం లొనూ పరమార్ధం కల్పించి ముక్తిని ప్రసాదిస్తుంది. కాబట్టి నిత్యమైన ఆధ్యాత్మిక సంపదను పోగుచేసుకొనుటకు మనమంతా కృషి చేయాలి.

మనమంతా ఆ భగవంతుని బిడ్డలం. బిడ్డల అవసరాలను తల్లి అడుగకనే తీరుస్తుంది. అట్లే మన భౌతిక అవసరములను కూడా ఆ భగవంతుడే తీరుస్తాడు. అందుకోసం రాత్రింబవళ్ళూ ఆందోళనకు గురవడం అనవసరం. భగవంతుడు మనల్ని ఎలా సృష్టించాడో మనం కూడా అలాగే జీవించాలి. సంతృప్తి అనేది ఆనందమయ జీవితానికి అత్యావశ్యకం. కోరికలు ధు:ఖానికి హేతువులు. ఒకటి తీరినా పరిస్థితుల ప్రభావం వలన క్రొత్తవి చిగురించి మునపటి కోరికలు తీరిన సంతోషం కూడా మయమౌతుంది.క్రొత్త వాటిని తీర్చుకోవాలన్న ఆరాటం మొదలై తత్ఫలితంగా అశాంతి, ఆందోళన మొదలౌతాయి. అందుకే కోరికల వేటలో సాగే మానవునికి ఆనందం ఎప్పుడూ ఆమడ దూరం లో నిలిచి పోతుంది. కోరికలు లేని మనస్సు నిశ్చల సాగరం వంటిది. శాశ్వత ఆనందానికి చిరునామా !

హిమాలయా శిఖరముల కంటే ఉన్నతంగా ఎదిగిన మన దేశ సంస్కృతిని కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపై వుందన్న విషయాన్ని మనందరం గుర్తెరగాలి.



 
Be first to comment on this Blog Post!
 



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.