Active Blogs | Popular Blogs | Recent Blogs అలవాటయిన స్వప్నం
అందుకే త్వరగా కరుగదు
అనుభవం నుండి అభివృద్దికి
నిరాశ నుండి ఆశకు
చేరుకునే దోవలో
మెట్లు ఎన్నో? అంతస్తులు ఎన్నో?
పరాజయమిచ్చిన పౌరుషంతో
విజయలందించిన స్పూర్తితో
మరో అడుగు ముందుకేస్తూ
వెనుకనే పరిశీలన చేస్తూ
గతి తప్పక ప్రగతి సాధిస్తూ
జగతి అంతా జయిస్తూ
నిగర్వియై నిరాడంబరియై
హుందాతనముట్టిపడగా
కష్టాలందు ఉదారత
నష్టాలందు జాగురూకత
ఇది
అలవాటయిన ఒక స్వప్నం
బహుశా
ఎప్పటికీ ఇది చెదరదు
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|