విజయానికి తొలి మెట్ల in నా అంతరంగాలు at TeluguPeople.com - Telugu Community Portal. Social Networking, Chat, Blogs, Classifieds, Videos, Photos, Galleries, Bollywood, Movies, Hyderabad, Visakhapatnam, Tirupati, Vijayawada, Guntur, Warangal, Kakinada, Kadapa, Kurnool, Rajahmundry and lot more...
TeluguPeople
  are the trend-setters

Active Blogs | Popular Blogs | Recent Blogs

kanakadurga mantrawaadi's Blogs >> నా అంతరంగాలు

విజయానికి తొలి మెట్ల


ఈ ఆధునిక యుగం లో వత్తిడి, పోటీ తత్వం తీవ్రంగా రాజ్యమేలుతున్న ప్రస్తుత పరిస్థితులలో జీవితం లో విజయం సాధించడం ఎలా ? మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా? మానసిక ప్రశాంతత తో ఆరోగ్యకరమైన, ఆనందదాయకమైన జీవితాన్ని జీవించడం ఎలా అనే ప్రశ్నలు అందరినీ వేధిస్తున్నాయి. విజయం సాధించిన వారిని చూసి తాము కూడా అదే విధంగా విజయం సాధించలన్న కోరిక ప్రతివారికీ కలగడం సహజం.

ఫ్రస్తుత సమాజంలో సక్సెస్ అనే పదానికి అర్ధం పూర్తిగా మారిపోయింది. డాక్టర్, ఇంజనీరు, ఎంబి ఏ ఇత్యాది డిగ్రీలను సాధించి డబ్బు బాగా సంపాదించి, పేరు, ప్రతిష్ట, పలుకుబడులను సంపాదించిన వారినే సక్సెస్ ఫుల్ పీపుల్ గా మనం పరిగణిస్తున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే సమాజంలో ఎంత పేరు పలుకుబడి, ఆస్థి పాస్తులు వుంటే అంత సక్సెస్ సాధించిన వారిగా గుర్తించబడుతున్నారు. పైన పేర్కొన్న వాటిని ఆ విజయం సాధించిన వ్యక్తి ఎలా సంపాదించాడనే విషయాన్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.అడ్డదారులు తొక్కి, నానా గడ్డి కరిచి సంపాదించినవాళ్ళనూ సక్సెస్ ఫుల్ పీపుల్ గా మనం గౌరవం ఇస్తున్నాం. కానీ అదీ అసలైన విజయమా అన్న ప్రశ్న ఎవ్వరం వేసుకోవడం లేదు. ఎంతసేపూ బాహ్య పటోపాలనే తప్ప వారు నడచిన దారిని గుర్తించడం లేదు. నీతి, నిజాయితీ, వినయ విధేయతలు, మంచితనం, అత్యున్నత విలువలు కలిగి వుండడం వంటి సద్గుణాలకు గుర్తింపు మనం ఇవ్వడం లేదు, పైగా కొంతమంది ఇటువంటి మంచి విలువలు కలిగి వున్నా పేరు, ప్రఖ్యాతులు, ఆస్థి పాస్థులను
సంపాదించలేకపోతే వారిని ఏమీ చేతకానివారిగా పరిగణిస్తున్నాం. పైగా దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం చేతకానివారిగా ముద్రలు కూడా వేస్తున్నాం. గ్లోబలైజేషన్ నేపధ్యంలో నైతిక విలువలు తీవ్రంగా పతనం చెందాయని, అతి ప్రాచీనమైన మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు మనమే త్రిలోదకాలు ఇస్తున్నామని మేధావులు ఇటీవలి కాలంలో ప్రకటించడం జరుగుతోంది.
కాని వాస్తవిక పరిస్థితులను క్షుణంగా అధ్యయనం చేస్తే డబ్బున్న వారందరూ సుఖ సంతొషాలతో లేరని, మానసిక ప్రశాంతత అనేది పుర్తిగా కొరవైందని, పేదా, ధనిక, కుల, మత వర్గ బేధాలు లేక అందరూ చిత్ర విచిత్రమైన వ్యాధుల బారిన పడుతున్నారని,మానసిక ఒంతరితనం అనేది అందరినీ సమానంగా , తీవ్రంగా పట్టి పీడిస్తోందని అర్ధం అవుతుంది.డబ్బుతో నయం చేసుకోలేని చిత్రమైన వ్యధలకు నేటి ఆధునిక యుగం మానవుడు లోనవుతున్నాడు. అందుకే డబ్బును సంపాదించగలవు కానీ నిద్రను కొనలేవని, రుచికరమైన ఆహార పధార్ధాలను డబ్బుతో కొనగలవు కానీ వాటిని తిని జీర్ణం చేసుకునే శక్తిని డబ్బుతో కొనలేవని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పేరు ప్రఖ్యాతులు, భోగ భాగ్యలతో తూగే అన్నో కుటుంబాలు అశాంతితో ,కలహాలతో నిత్యాగ్నిలా మండుతున్నాయి. సిరి సంపదల మధ్య జీవించిన ఎందరో బ్రతుకు దుర్భరం గా మారి ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు.వారు మానసిక ప్రశాంతత అనేది ఎక్కడ దొరుకుతుంది అని నిరంతర వెదుకులాటలో వున్నారు., అందుకోసం ఎన్ని లక్షలైనా వెచ్చించడానికి సిద్ధం. డబ్బు సంపాదించే క్రమంలో మానవుడు ప్రేమను, అత్మీయతను,మమతానురాగాలను, స్నేహ సంబంధాలను పూర్తిగా దూరం చేసుకుంటున్నాడు.ఎన్ని లక్షలు ఇచ్చినా వాటిని తిరిగి సంపాదించుకోలేమని మానవులకు అవగతం అయిననాడు ఈ ధనార్జన అనే తపన తగ్గుతుంది.

ఈ ఆధునిక యుగంలో మానసిక ప్రశాంతత అనేది ఒక అమూల్యమైన వస్తువుగా మారిపోయింది. సంపుర్ణ మానసికోల్లాసంతో జీవిస్తున్న వారు బహు అరుదు.ఎవ్వరిని చూసినా ఏదో చింతతో, వ్యాకులతతో బాధపడుతున్నట్లు కనిపిస్తారు.ప్రతీవారికి ఇతరులకంటే తమకే ఎక్కువ బాధలునట్లు బాధపడుతుంటారు.

మానసిక చింతలను దూరం చేసుకోవడం మనకు తప్పని సరి.లేకపోతే ఎన్నో విచిత్రమైన వ్యాధుల బారిన పడవల్సి వస్తుంది. ఏమైనా సమస్య ఎదురైతే, సమస్య గురించి చింతించక ఈ సమస్య నుండి ఎలా బయట పడాలా అని సానుకూల ధృక్పధంతో ఆలోచించాలి.అవసరమైతే మన ఆప్తుల సలహా కూడా తీసుకోవడం లో తప్పులేదు.పరిష్కారం ఆలోచించాక దానిని తక్షనం అమలు పరిచితే సమస్య తృటిలో మాయమౌతుంది. ఉన్నదానికీ లేనిదానికి చింతించడం వలన ఒనగూడేదేమీ వుండదు.రోగాలు తెచ్చుకొని తిరిగి వాటిని నయం చెసుకోవడానికి డాక్టర్ల చుట్టూ పరుగులు తీయడం , అవి తగ్గక పోతే మళ్ళీ చింత మొదలు, ఇలా చింత అనే సుడిగుండంలో చిక్కి కొట్టుమిట్టాడుతుంటాము. హింతలను మానసిక శాస్త్రవేత్తలు చితి మంటలతో పోల్చారు.చివరకు దహనం, బూడిద అవడం ఖాయం. మనం పరిష్కరించలేని సమస్యల గురించి చింతించడం మాని వాటిని భగవంతుని పాదాల వద్ద పడవైచి ,పరిష్కరించమని చిత్తశుద్ధితో శరణు వేడితే అద్భుతాలు జరుగుతాయి.భగవంతుని అనుగ్రహం వలన సాధ్యం కానిది ఈ సృష్టిలో ఏమీ లేదు, కాని అందుకు కావలసినవి భక్తి, విశ్వాసాలు, అచంచలమైన నమ్మకం.

పేరు ప్రఖ్యాతులను సక్రమ మార్గంలో ఆర్జించడం అవశ్యం. అందువలన అన్ని వత్తిడులు దూరమవడమే కాక మానసిక ప్రశాంతత లభ్యమౌతుంది.కంటికి తృప్తిగా నిద్రపోగలుగుతాము.అలా కాకుండా అడ్డదారులు తొక్కేవారికి ఒక్క నిమిషం నిద్ర వుండదు.తమ సంపదకు ఎప్పుడు హాని కలుగుతుందా అని అనుక్షణం భయపడుతూ జీవిస్తుంటారు. మధుర ఫలాలను అందుకోవడానికి చక్కని దారిని ఎంచుకోవాలన్న మహాత్ముని పలుకులను మనం ఇక్కడ స్మరించుకోక తప్పదు.

తనకు విధించిన కర్మలను చిత్తశుద్ధితో పూర్తి చేసి, ఫలాన్ని భగవంతునికి అర్పణ చేసి ఎటువంటి చింతనలు మనసులో వుంచుకోక ఆనందంగా జీవించగలిగుఇనవాడే నిజమైన విజయం (ట్రుఎ సుచ్చెస్స్)సాధించిన వ్యక్తి.ఎంత సంపాదించావు అన్నది కాక ఎలా సంపాదించావు, ఎంత ఆనందంగా, ప్రశాంతంగా జీవించగలుగుతున్నావు అన్నదే ప్రశ్న.విజయం అనేది మనకు సంతృప్తిని, ప్రశాంతతను, ఆనందాన్ని ఇవ్వగలగాలి, ఇవేమీ లభించని నాడు అవి విజయాలు కావు, ఎండమావులు అన్నది సుస్పష్టం.

నేను సాధించగలను, నా వలన కానిది ఈ సృష్టిలో ఏదీ లేదూ అని మనస్పూర్తిగా నమ్మి ధైర్య సాహసాలతో ముందడుగు వేసిన నాడు ఏదీ అసాధ్యంకాదు. ఇతరుల వలన సాధ్యం అయినది మన వలన కూడా అవ్వుతుంది.అయితే అందుకు కావలసింది మనపై మనకు అపారమైన నమ్మకం,పట్టు సడలని కార్య దీక్షత.ఇతరులను కూలదొసి వారిపై ఎక్కి సాధించేది విజయం కాదు. ఇతరులను అశాంతికి గురి చేసి తద్వారా పొందే ఆనందం పైసాచిక ఆనందంతో సమానం.అటువంటి వారికి చివరకు మిగిలేది నరకప్రాయమైన జీవితమే !




 
Be first to comment on this Blog Post!
 



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2026 TeluguPeople.com, All Rights Reserved.