Active Blogs | Popular Blogs | Recent Blogs (అదివారం ఉదయం...)
నా భార్య వంటింట్లో వంట చేస్తుంది
నేను:ఏం వంట చేస్తున్నావొయ్ !
నా భార్య: తోటకూర పప్పు,చిక్కుడుకాయ కూర చేస్తున్నానండి.
నేను ఇంటివెనకాల స్టొర్ రూం లో దాచుకున్న మందు సీసా మూత తీసి గబుక్కున పెగ్గేసి చటుక్కున మూతి తుడుచుకున్నా .
నేను:మన పిల్లలు ఎక్కడికెళ్ళారు?
నా భార్య: శర్మ గారింటికి క్యారం బోర్డ్ ఆడుకోవటానికి వెళ్ళారండి.
నేను స్టోర్ రూం లో కి వెళ్ళి చటుక్కున పెగ్గేసి గబుక్కున మూతి తుడుచుకున్న.
నేను: అవునే ! శర్మ గారికి పెళ్ళి అయిందా?
నా భార్య: అయ్యొ రామ! శర్మ గారికి పెళ్ళవ్వటం ఏంటండి నా బొంద..ఆయనకి ఒక అమ్మయి కూడ ఉంటే.
నేను ఇంటి వెనకాల స్టొర్ రూం లో కి వెళ్ళి గబుక్కున మూతేసి చటుక్కున పెగ్గు తుడుచుకున్న.
నేను:శర్మ గారి అమ్మయి బడికెల్తుందంటే ?
నా భార్య:శర్మ గారమ్మయి చాల పెద్దమ్మయి కదండి బడికెళ్ళటమేంటండి నా మొహం.
నేను పెగ్గులోకి వెళ్ళి చటుక్కున మూతేసి గబుక్కున స్టొర్ తుడుచుకున్న.
నేను:శర్మ గారి అమ్మాయికి పెళ్ళయిందా?
నా భార్య:గాడిద లాగ పెరిగింది..ఇంకా పెళ్ళి అవ్వలేదండి.చాల ఏళ్ళు ఉంటాయి..
నేను మూతి వెనకల ఉన్న పెగ్గులొకి వెళ్ళి చటుక్కున స్టొర్ వేసి గబుక్కున పెళ్ళి చేసుకున్న.
నేను:ఏంటె!శర్మ గారిని పట్టుకొని గాడిద అంటావా!!
నా భార్య:మీకు ఎక్కువయినట్టుంది.వెళ్ళి పడుకుంటారా?..బక్కెటు నీళ్ళు పొయ్యమంటారా?
(నేను చదివిన వాటిల్లో నాకు నచ్హిన సంభాషణ ఇది)
 Anant kv | :-)
Posted at: 18, Jul 2009 10:14 AM |  uma maheeswari maheeswari | hmm idi nenu kudaa chadivanu namaskaram baagundi malli chadivinchi nanduku tq
Posted at: 11, Jul 2009 7:40 AM |
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|