Active Blogs | Popular Blogs | Recent Blogs
ఆమె డైరి :
మేము కాఫీ డే లో కలిసి కాఫి తాగడానికి ప్లాన్ చేసుకున్నాము. నేను రోజు మొత్తం ఫ్రెండ్స్ తో షాపింగ్ చేసి వచ్హేటప్పటికి లేట్ అయినందుకు అతడు అప్సెట్ అయ్యాడనుకున్నా. మా మధ్య ఎలాంటి సంభాషణా జరగలేదు. అందుకని నేను అతనిని ఎక్కడికయినా వేరే ప్లేస్ కి వెళ్ళి ఏకాంతంగా మాట్లాడుకుందాం అని అన్నాను. కాని అతని నుండి ఎలాంటి సమాధానం లేదు. మూడీ గా ఉన్నాడు. అప్పుడు నేను అడిగాను ఏంటి ఎందుకలా ఉన్నావు అని. కాని అతను ఏమీ లేదని చెప్పాడు. నేను ఏమయినా తప్పు చేసానా అని అడిగాను. కాని అతను అదేమి లేదు అన్నాడు. ఇంటికి వెళ్ళే దారిలో అతనికి "నువ్వంటే నాకు చాలా ఇష్టం" అని చెప్పాను. అతను అలా చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నాడు. తిరిగి "నువ్వంటే నాకు చాలా ఇష్టం" అని చెప్పలేదు. అతని ప్రవర్తన చాలా మారిపోయింది. ఇంటికి వెళ్ళేటప్పటికి నాకు అర్ధమయింది అతను నా నుండి దూరం జరుగుతున్నాడని,అతనికి ఇక నా అవసరం లేదని. సోఫా లో కూర్చొని టి.వి చూశాడు. ఇంకా మూడి గా మాటలు మాట్లాడకుండా ఉన్నాడు. చివరికి నేను నిద్రపోవటానికి గదిలోకి వెళ్ళాను. పది నిమిషాల తర్వాత అతను కూడ వచ్హాడు. నేను ఇక ఈ విషయాలు ఇంతటి తో మర్చిపోదామనుకున్నాను. ఇక ఈ విషయాలు ప్రస్తావించదలుచుకోలేదు. అతను వెంటనే నిద్రలోకి జారుకున్నాడు. నాకు చాలా ఏడుపు వచ్హింది. ఇప్పుడు అతని ఆలోచనలన్ని వేరే ఇంకొకరి చుట్టూ తిరుగుతున్నాయి.అలా ఏడిచి నిద్రపోయాను. నాకు ఏమి చేయాలో తోచటం లేదు. నా జీవితం నాశనం అయిపోయింది.
......................................................................................................................................................
అతని డైరి :
చ!! ఈ రోజు ఇండియా బంగ్లాదేశ్ చేతిలో క్రికెట్ మ్యాచ్ ఓడిపోయింది.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|