నానీలు in devender at TeluguPeople.com - Telugu Community Portal. Social Networking, Chat, Blogs, Classifieds, Videos, Photos, Galleries, Bollywood, Movies, Hyderabad, Visakhapatnam, Tirupati, Vijayawada, Guntur, Warangal, Kakinada, Kadapa, Kurnool, Rajahmundry and lot more...
TeluguPeople
  are the trend-setters

Active Blogs | Popular Blogs | Recent Blogs

Devender Chintala Devender's Blogs >> devender

నానీలు

నానీలు రచన: చింతల దేవేందర్, కేవీ ౧, ఉప్పల్, హైదరాబాద్.500 039 phone. 9493409263

.నానీల గోపి
షష్టిపూర్తి
నానీ కవులకి
ఎంతో సంతృప్తి. 1

గోపి జలగీతం
చదివినప్పుడల్లా
హర్షిస్తుంది హృది
కన్నీళ్ళతో, పన్నీళ్ళతో. 2

నగరంలొ వానోస్తే
కంపుకంపు
అదే పల్లెల్లోనైతే
కమ్మటి మట్టివాసన. 3

పొలాలు పచ్చగా
వున్నంతవరకు
పచ్చనోటులొని బాపు
బోసినవ్వు వెచ్చగానే వుంటుంది. 4

పాలవాడి
పిలుపు
నగరనాగరికులకి
మేలుకొలుపు. 5

ఆకార
నిరాకార సాకార
ఓంకారరూపమే
పరమాత్మ. 6

జీవితమంటె
అరవడం కరవడం
కాదు
నవ్వడం నవ్వించడం. 7

ఆడది ఆడదే
తల్లైంది
కాబట్టి
దేవతైంది. 8

ఆక్సిడెంటు
అర్థం మారింది
అవి రోజూ
రివాజుగా జరిగేవి. 9

రుచులు
ఆరే
అభిరుచులు
మాత్రం వేవేలు. 10

సహజమైన
చావుపుట్టుకలు
తగ్గాయి
సిజేరియన్, ఆక్సిడెంట్ల పుణ్యాన. 11

అమ్మకు
నాన్నంటే చిన్నచూపు
నాకు మాత్రం
వారిద్దరే పెద్దదిక్కు. 12

ఆడదంటే
జీరోని హిరో చేసేది
హిరోని సైతం
జీరో చేసేది. 13

మూత్రవిసర్జన
ప్రాంతమా
ఐతే ఖచ్చితంగా
అది సర్కారు గోడే. 14

నగరాలన్ని
బాంబులతో భయంభయం
పల్లెలు పట్నాలే
నయంనయం. 15

పరిణామక్రమంలో
ఆత్మ,జీవాత్మ,
అంతరాత్మ
పరమాత్మగా మారడమే. 16

ప్రేమ పంచే
తల్లి సేద్యం చేసే రైతు
విద్య నేర్పే గురువు
వీరేనేమో త్రిమూర్తులు. 17

విద్య వికసిస్తే
ప్రమోదం
వికటిస్తే మాత్రం
ప్రమాదం. 18

ఋజువర్తన
కల్గిన వ్యక్తి
వెలుగొందుతాడు
అందర్లో సూర్యునిలా. 19

రాజగోపురం
రాలిపోయింది
పక్షులకి
గూడు కరవైంది. 20

రాయి రాయి
నడుమ ఆయనో రాయి
ఆయనని సేవిస్తే
అదో హాయి 21

ఝుమ్మన్న నాదం
గోదారి గలగల
వేటూరి లేక
వెలవెలబోయింది. 22

వేటూరి గీతం
ఘంటసాల గానం
బాపు చిత్రం
అజరామరం. 23

భోపాల్ తీర్పు
న్యాయాన్నే అన్యాయం
చేసింది
న్యాయస్థానం. 24

మయసభన
ద్రౌపది నవ్వుని
మననం చేసుకోవాలి
ఆడది నవ్వే ప్రతీసారి. 25

అరుణ కవితలు
గోపి నానీలకు
చిరునామా
శ్రీనివాసపురం 26

పెళ్ళిల్లన్నీ
స్వర్గంలోనే జరుగుతాయి
కొన్ని మాత్రమే
నరకాలవుతాయి. 27

అమ్మ దేవతే
నాన్న దేవుడే
పిల్లలే
రాక్షసులు. 28

కోప్పడే
కోడళ్ళున్నంతవరకు
వృద్ధశరణాలయాలకి
ఢోకా లేదు. 29

ఇంట్లో
టీవి పాడయింది
పిల్లలంతా
బాగుపడ్డారు. 30

ఫాస్ట్ ఫుడ్
సెంటర్లు
అపరిశుభ్రతకి పుట్టినిల్లు
ఆసుపత్రులకి మెట్టినిల్లు. 31

కార్పోరేట్ చదువు
రెండు రెళ్ళెంత
అంటే
కంప్యూటర్నే అడగాలి. 32

అమ్మ వంటలు
బానే వుంటయి
నాన్న రచనలు బానే వుంటాయి
పిల్లలకే రుచించవు 33


ధరల వరవడిలో
కూరలకే
గాయాలయ్యాయి
పాపం కూరగాయలు. 34

అన్నమో రామచంద్ర
అప్పుడు
అప్పులో రామచంద్ర
ఇప్పుడు. 35

తిరుపల ఉద్యోగింట
వజ్రాల తాబేలు
అయ్యవారి సేవలో
ఎన్ని మతలబులో. 36

ఈ చెత్త చేసే
జిత్తుల్ని
చిత్తు చేసే చిత్తశుద్ది
కోసమే ఈ చింతన. 37

రూపులో దైవత్వం
మాటల్లో మానవత్వం
చేతల్లో రాక్షసత్వం
ఇదీ మనిషి తత్వం. 38

దొరతనం పోయింది
బతికిపోయాం
కాని
దోమల్తో రోజూ చస్తున్నాం 39

గ్యాస్ షుగర్
ఇంటికి అవసరమేగాని
ఒంటికి మాత్రం
రాకూడదు. 40

ఉత్తరాలకి
ఉత్తరక్రియలు జరిపారు
ఇప్పుడంతా
ఎస్ ఎం ఎస్ లు ఈమేయిల్లే. 41

పత్రికలు
చదవడమనేది పాతఫ్యాషన్
ఇప్పుడు
కేవలం చూడటమే. 42

గోపిసార్ పుట్టిన
నల్లగొండ సల్లగుండ
కోట్ల నానీలకు
పుట్టినిల్లు గోపిలోగిలి. 43

నగరం
నడిరొడ్డుపై కొచ్చిన
దర్గలూ దుర్గలూ
కాస్త పక్కకి జరగరూ 44 .

సైకిళ్ళు రిక్షాలు
కనుమరుగయ్యాయి
కీళ్ళనొప్పులు
మెదలయ్యాయి 45

నడక తగ్గింది
ప్రతీఅవసరానికీ
బండే
కీళ్ళనొప్పులు రాకేంజేస్తాయి 46

నానమ్మ సలహాలు
నానీల సారం
మధురం
గోపీజన్మే సార్థకం. 47

అదృశ్శ్యంగా వున్న
ఆత్మని
సాదృశ్యం చేసుకోవడమే
ఆత్మసాక్షాత్కారం. 48

నాన్నమ్మలు అమ్మమ్మలు
వున్న ఇండ్లు
ఆయురారోగ్యాలతో
చల్లగా వుండు. 49

వారింట్లో
పంకాలకి పరదాలకేం
కొదువ
కాకపోతే గాలే కరువు. 50

తారురొడ్డుపై
కారుజోరు హుషారు
రొడ్డుదాటేవారికే
బేజారు. 51

పిల్లలున్న
ప్రతీ ఇల్లు
ఓ కిష్కింద
కాండే. 52

నానీలంటే
రాసినకొద్దీ
రాయలనిపించేవి
అదీ నానీల గోపి"దనం. 53

ఎఫ్ ఎం ల పుణ్యాన
మరుగునపడిన
రేడియోలు
పునర్జన్మనొందాయి. 54

ముసురుకున్నాయ్
మేఘాలు
కార్చడానికి కన్నీళ్ళు సైతం
కరువయ్యాయి. 55

రొడ్లయితే
విశాలంగానే వున్నాయి
ఇండ్లే ఇరుకుగావున్నాయి
ఇండ్లల్లో వుండే మనుషుల వలే. 56

కాశీకి వెళ్ళినా
కాటికి పోయిన
గుర్తుకొచ్చేది
చచ్చే వైరాగ్యామే. 57

స్నేహమనేది
విడిపోయేది కాదు
సేదకోసం
పైన వాలి పోయేది 58

గురువులు
కోరుకునేది
ఆస్తులు అంతస్తులు కావు
శిష్యుల ఆదరాభిమానాలే. 59

నానీలకు
పత్రికలు
మంగళహారతులు
పట్టినాయన్నది నేటినిజం 60



 
Be first to comment on this Blog Post!
 



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.