Active Blogs | Popular Blogs | Recent Blogs మనసులెని మాటలు
ఎన్నైనా అనర్గళంగా మాట్లాడొచ్చు
ఎటోచ్చి మనసున్న మాటలు
రమ్మన్న రావడం లేదు
లోతుల్లోంచి లోలోతుల్లోంచి
గ్రాంధికంగా అర్ధవంతంగా
బలవంతంగా మాట్లాడాల్సొస్తుంది
ఎందుకంటే
మనసెరిగి
మానసికంగాతయారై మరీ మాట్లాడాలిగా
మాట్లాడటం అనేది ఓ రకంగా ఆటాడటం లాంటిది
ఇక్కడ మూడుముక్కలాట సాగుతుంది
ముక్కలు కావాలని మరీమరీ అడుగుతున్నారు
ఏ ముక్క కావాలని అడిగితే
ముక్కచెక్కలు వద్దు
ఒక్కటిగా వుందామంటూనే
రాజు,రాణి ఎక్కాలొస్తె జాక్ పాట్
గెలుస్తామని అంటూనే
రాజురాణి కలిసివుంటే చాలు
ఇన్నాళ్ళు ఎకసెక్కం ఆడిన ఎక్కాని
వదులుకుందామని తీర్మానం సైతం
చేసేసుకున్నాయి కొన్ని వర్గాలు
బైట పడని వర్గాలు సైతం
కమిటీ పుణ్యాన నోరు మెదిపి
తమ భావాల్ని వెళ్ళగక్కాయి
అందుకే కమిటీకి హెట్సాఫ్ చెప్పాలి
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|