Active Blogs | Popular Blogs | Recent Blogs రవి రోజూ ఉదయిస్తున్నా
రోజురోజుకి నాలోని కవి
కనుమరుగవుతున్న వైనం
నా అంతరంగాన ప్రస్ఫుటమవుతున
బాధ అంతాయింతా కాదు.
ప్రేయసి తన ప్రేమని పంచనంతవరకూ
దైవం తన కరుణని ప్రసాదించనంతవరకూ
మితృడు తన మైత్రిని బహిర్గతపరచనంతవరకూ
శతృవు సైతం తన ఉనికిని తెలపనంతవరకూ
సంధ్యాసంధ్యల్లో సాగరరకెరటాలు తన సోయగాలని
ఆవిష్కరించనంతవరకూ
నాలో నేను రసస్పందన పొందనంత వరకూ
ప్రకృతి తనదైన ఆకృతితో
నాహృదిని చైతన్యపరచేంత వరకూ
నాలోని కవితాత్మ
అంకురించను
అక్షరించను
అని మొండికేసింది
అక్షరం సైతం సూక్ష్మంగా
నాలో నిక్షిప్తమై లిప్తంగా వుంటానంటుంది
కలకాలం అండగా నిలవాల్సిన అక్షరం
నాందీప్రస్తావనకి కూడా హుళక్కి చెప్తూ
కలకలం రేపుతున్న
కలం మాత్రం మౌనసాక్షిగా నిలచింది.
మనసెందుకో చాంచల్యమౌతుంది
ఏ భావనలూ,
ప్రకంపనలూ, ఘటనలూ
సంఘంటనలూ లేవే
ఏవిటీ విచిత్రం?
మన్సు చెదరితే
ఓ కవితకి అంకురార్పణ
అదే మనసు అహ్లాదపడితే
ఓ కథకి ప్రేరణ
మనసు ఖాళీ ఐతే మట్టుకు
కథకీ,
కవితకీ
నో చాన్స్!
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|