Active Blogs | Popular Blogs | Recent Blogs వేదమంటి నా హౄదయవేదన వింటావా
పాదమంటు కన్నీటి రోదన కంటావా
కంటి నిండా నీటితో, వంటి నిండా విషముతొ
క్షణము క్షణము నా కణము కణము కౄశించిపోతున్నది.
గుండె నిండా నీవుతో, బండబారిన నేనుతో
వ్రణము ఘనమై, నా కణము కణము శిలలౌతున్నది
కంటి ముంగిట కలలతో, ఇంటి ముంగిట కళలతో
క్షణము క్షణము, నా కణము కణము నీకై ఎదురు చూస్తున్నది
చెరకు వింటి పూలవానలా, చంటి పాప పాలవాసనలా
తనువు మనసై, నా కణము కణము నీ ప్రేమ నిండినది.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|