Active Blogs | Popular Blogs | Recent Blogs మెట్లు
ప్రతివాడి జీవితంలోనూ అనుకోని సంఘటనలు జరుగుతాయట. ఏమో, నాకేంతెలుసు? అయినా, మా రాష్ట్రంలోనే మారుమూల జిల్లా అయిన శ్రీకాకుళంలో, ఎక్కడో ఒక కుగ్రామంలో పుట్టిన నాకు, అనుకోని సంఘటనలు ఏంజరుగుతాయి, నా పిచ్చిగానీ!... ఆలాగని ఏమీ జరగకుండా ఉంటే నేను మీకీ విషయం రాసేవాడినీకాను; మిమ్మల్నిలాగ ఇబ్బంది పెట్టేవాడినీకాను. ఎలాగూ జరిగిందికాబట్టి నేను చెప్పక తప్పదు, మీకు చదవకా తప్పదు.
అది షుమారుగా 1960 ప్రాంతం. అంటే ఇప్పటికి 50 సంవత్సరాల క్రితం మాట. అప్పుడు నా వయసు బహుశా పన్నెండేళ్ళు ఉంటాయేమో. అప్పట్లో మా నాయనమ్మకి జబ్బుచేసింది. ఇక్కడ మీకో విషయం చెప్పాలి. ఇంగ్లీషువాళ్ళు మనల్ని వదిలిపెట్టి చాలాకాలం అయినా ఇంగ్లీషు భాషమాత్రం మనల్ని వదిలిపెట్టలేక మనదగ్గరే ఉండిపోయింది. జార్జి చక్రవర్తి మనలో ఎంతమందికి తెలుసోకాని, కింగ్ జార్జి ఆస్పత్రి మాత్రం మా ప్రాంతంలో తెలియనివారు ఉండరు. "పి. హెచ్. సి" అంటే తెలియకపోవచ్చేమోకాని "కే. జి. హెచ్" అంటే తెలియనివారు ఉండరంటే నమ్మండి. మా నాయనమ్మని సరిగ్గా అక్కడికే తీసుకెళ్ళాం.
డాక్టర్లు పరీక్షచేసి "పెద్దాపరేషన్ చెయ్యాలి, రెండువారాలు ఉండాల్సొస్తుంది" అన్నారు. అంత పెద్ద పట్నంలో నేనూ, అమ్మ, నాన్న; బయట ఉండాలంటే హోటలూ గట్రా చాలా ఖర్చు అవుతుంది కాబట్టి, కే జీ హెచ్ కి దగ్గరలో, మా దూరపు బంధువైన ఒక పోలీసు కానిస్టేబులు గారి క్వార్టరులో ఉన్నాం. సరిగ్గా అదే రోజుల్లో, ఒకరోజు సాయంత్రం ఆస్పత్రిలో మా నాయనమ్మ దగ్గర్నుంచి మా పోలీసు మామయ్య నన్ను వాళ్ళ ఇంటికి తిరిగి తీసికెల్తూ, దగ్గరలోనే ఉన్న "సముద్రం; బీచి చూపిస్తాను పదరా అన్నాడు". సరే అని నడుస్తుండగా దారిలో ఒక ఎత్తైన ప్రదేశంలో పెద్ద కోటలాంటి భవనం, రాళ్ళతో కట్టింది, చుట్టూ ప్రహారీ; జానపద సినిమాల్లో రాజులుండే కోటలాగుంది. అచ్చంగా కే జీ హెఛ్ లాగే జేగురు రంగులో ఉంది. సాయంకాలపు సూర్యుడి వెలుగులో మెరిసిపోతూ కనపడింది. దాన్ని చూపిస్తూ "అదేంటి ?" అని మా పోలీసు మామయ్యని అడిగాను.
"అది కలక్టరాఫీసు, అందులో కలక్టరు దొర ఉంటాడు" అన్నాడుమామ. నాకెందుకో దాన్ని చూడాలనిపించింది.
"నన్నొక్కసారి లోపలికి తీసికెళ్ళు మామా, చూస్తాను," అన్నాను. "అమ్మబాబో! ఒద్దురా" అన్నాడు మామ. నేను గట్టిగా పట్టుపట్టేసరికి, కాదనలేక "సరే, పదా" అన్నాడు. మామ చెయ్యి పట్టుకొని, అడుగులో అడుగు వేస్తూ, ఎత్తైన ఆ భవనాన్ని చూస్తూ మెల్లగా "పోర్టికో"లోకి చేరుకున్నాం.ఎడమ ప్రక్కకి తిరిగేసరికి ఎదురుగా రాతి మెట్లు, పైన రాతి వరండా, దానిని ఆనుకొని పెద్ద ముఖ ద్వారం.
అదిగో, ఎదురుగా అందులోనుంచి కనపడుతున్నాయి, సాన పట్టి మిలమిల మెరిసిపోతున్న వెడల్పాటి చెక్క మెట్లు, వాటికి రెండుప్రక్కలా ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చేతులు ఆన్చుకోవడానికి పెద్ద పొడవాటి ఆసరాలు. వరుసగా షుమారు పదిహేను మెట్లు, వాటిపైన చెక్క వరండా, ఆపైన రెండుగా విడిపోయి మలుపు తిరిగి పై అంతస్తుకు వెళుతూ మరల చెక్క మెట్లు, ఎంత అందంగా ఉన్నాయో.
సాయంకాలపు ఏటవాలు ఎండ ఎదురుగాఉన్న రాతి వరండాపై పడి, లోపలున్న మెట్లకు మెరుగు దిద్దినట్లనిపిస్తోంది. కింది మెట్టు దగ్గర నిల్చుని కళ్ళార్పకుండా ఆ మెట్ల అందాన్ని చూస్తూ మైమరచిన నేను, అప్పుడే పోర్తికోలోకి వస్తున్న కార్ల శబ్దానికి వెనక్కి తిరిగాను. అడిచూచిన మామ "అమ్మో, దొరగారోచ్చేసారు", అని నాచెయ్యి పట్టుకొని ఒక ప్రక్కకి జరిగాడు. మామ వెనకాల నిలబడి, కళ్ళు పెద్దవి చేసుకొని పోర్టికో వైపు చూడసాగాను.
కారు. తెల్ల కారు. పెద్ద తెల్ల కారొచ్చి పోర్తికోలోన ఆగింది. దాని వెనక కార్లు,జీపులు వచ్చి ఆగాయి. "అదిగో, ముందొచ్చి పోర్టికోలో ఆగిందే దొరగారి కారు", అన్నాడు మామ. నా కళ్ళు తాటి ముంజలు అంత అయినాయి. అదేపనిగా రెప్ప వెయ్యకుండా చూస్తున్నాను. కారులో ముందువైపు తలుపు తెరుచుకొని ఒకతను దిగాడు. ఆజానుబాహుడు, నల్లని ఒంటిపైన తెల్లని ప్యాంటు షర్టు, షర్టు పైన ఎడమ భుజం మీదినుంచి, తెలుపు రంగు పైన నీలం బోర్డరు ఉన్న బెల్టు కుడిప్రక్కన నడుము కిందికి ఉంది. దాని పైన అడ్డంగా నడుముకి చుట్టుకొని అదేమాదిరి ఇంకో బెల్టు, ఆ బెల్టు పైన ఝిగేలుమని మెరిసిపోతున్న వెండి రాజ ముద్ర. తలపైన టోపీ, చేతిలో ఫైళ్లు పట్టుకొని అతనిలా దిగుతుండగానే "అతనే దొరగారి డఫేదారు" అన్నాడు మామ. చేతిలో డైరీతో డఫేదారు వెనకాలే కారు దిగుతున్నతన్ని చూసి " అతను దొరగారి పి.ఎ" అన్నాడు మామ. ముందుగా దిగిన డఫేదారు కారు వెనకతలుపు తెరిచాడు.
అందులోనుంచి దిగేలోపల "అదిగో దొర" అన్నాడు మామ. ఇంతలో,తెల్లని పొడుగాటి వ్యక్తి, నీలం రంగు పాంటులోకి దూర్చిన సగం చేతుల తెల్లటి ఉల్లిపొరలాంటి సిల్కు చొక్కా, పోర్టికోలోనికి వీస్తున్న సముద్రపు చల్లగాలిని తట్టుకోలేనట్టుగా ఊగుతున్న అతనిఉంగరాల జుట్టు, ప్రయాణ బడలికకు అలసిపోయిన అందమైన ముఖం; కారులోనుంచి దిగ్గానే, నేను తెల్లబోయి చూస్తున్నంతలో, దూరంగా ఉన్న జనం; దొరకోసం ఎప్పట్నుంచో కాచుకున్న జనం, ఆయన దగ్గరకొచ్చి, కాస్త దూరంలో నిలబడి, "దండాలయ్యగోరూ" అని వాళ్ళ సమస్యలేవో కొద్దిసేపు చెప్పుకున్నారు.
వాళ్ళు చెప్పిందంతా విని, మిగతా కార్లలోంచి దిగి తన వెనక నిల్చున్న కొంతమంది అధికార్లను పిలిచి, వాళ్ళ సమస్యలపై చర్యలు తీసికోమని చెప్పి, వరండా లోంచి వచ్చి, ముందుగా డఫేదారు నడుస్తుండగా, తనవెనక అధికార్లు వస్తుండగా, వాళ్ళు చెబుతున్నవి వింటూ, అందమైన చెక్కమెట్లు ఒక్కటొక్కటిగా ఎక్కుతూ పైకి వెళ్ళిపోయారు, దొరగారు; దొరగారితోపాటు అధికార్లు.
అదంతా చూసిన నాకొక అనుమానం వచ్చింది. "మామా, ప్రజలకి ఎలాంటి కష్టమొచ్చినా తీర్చెయ్యగలడా కలక్తరుదొర ?" అన్నాను. "అవున్రా, దొర తలచుకొంటే ప్రజలకి ఎంత మేలైనా చెయ్యగలడు, మా హెడ్డుగారు చెప్పాడు, జిల్లాకి రాజుగదా?" అన్నాడు.
"మామా, ఒక్కసారి చెక్క మెట్లెక్కి, పైకెళ్ళి చూసి వచ్చేద్దాం మామా " అన్నాను. " పైన దొర ఉన్నాడు. నువ్వు అటూ ఇటూ వెళ్ళిపోకుండా నా పక్కనే ఉండాలి, మళ్ళీ తొందరగా వచ్చెయ్యాలి, సరేనా?" అన్నాడు. సరే, అని బయల్దేరాం.
ఒక్కొక్క చెక్కమెట్టూ ఎక్కుతుంటే, కలక్తరుదొర మెట్లెక్కింది గుర్తొచ్చింది. నాయనమ్మ చెప్పిన కథల్లో రాజులకంటే, కలక్టరు గొప్పోడు అనిపించింది. నేను కలక్టరు అయిపోవాల. ప్రజలందరి కష్టాలు తీర్చెయ్యాల, అనుకొంటూ మెట్లన్నీ ఎక్కేశాను. పైనుంచిచూస్తే; ఎడమ ప్రక్కన సముద్రం, కుడి ప్రక్కన కెజిహెచ్, మధ్యలో విశాఖపట్నం; ఎంత బాగుందో!
ఎవరో ఒకతను మావైపు వస్తూ "హలో" అని మామని పలకరించాడు. మామ కూడా అతన్ని "హలో" అని, వాళ్ళిద్దరూ ఏమిటో కొంచంసేపు మాట్లాడుకున్నారు. తరవాత నన్నతనికి పరిచయంచేస్తూ "మా బంధువుల అబ్బాయి, నాకు మేనల్లుడవుతాడు" అనిచెప్పి, నాతో "ఇతనిది మన ప్రక్క వూరే, కలక్టరు ఆఫీసులో క్లర్కుగా పనిచేస్తున్నాడు" అన్నాడు.
మామ ఆమాట చెప్పగానే నాకో ఆలోచన వచ్చింది. "మామా, ఇందాక వచ్చిన కలక్టరు గారిని ఒక్కసారి నాకు చూపించమనవా!" అన్నాను.
అది విన్న ఆయన, నాతో "ఇందాక వచ్చింది కలక్టరు గారు కాదు బాబూ. ఆయన్ని పి.ఏ టు కలక్టరు అంటారు (ఇప్పటి జిల్లా రెవిన్యూ అధికారి అన్నమాట). కలక్టరు గారు హైదరాబాదు వెళ్ళారు, సోమవారం వస్తారు" అన్నాడు.
-----------------**********---------------
రచన: పి.వి.యస్.మూర్తి, ఐ.ఏ.యస్ (రిటైర్డ్)
101, సాయిమానస, 7-1-212/11,శివబాగ్ కాలనీ,
బల్కంపేట్, హైదరాబాద్-500016,
ఫోన్: 9848624332, మెయిల్: murty _pydi @yahoo.com
మెట్లు
ప్రతివాడి జీవితంలోనూ అనుకోని సంఘటనలు జరుగుతాయట. ఏమో, నాకేంతెలుసు? అయినా, మా రాష్ట్రంలోనే మారుమూల జిల్లా అయిన శ్రీకాకుళంలో, ఎక్కడో ఒక కుగ్రామంలో పుట్టిన నాకు, అనుకోని సంఘటనలు ఏంజరుగుతాయి, నా పిచ్చిగానీ!... ఆలాగని ఏమీ జరగకుండా ఉంటే నేను మీకీ విషయం రాసేవాడినీకాను; మిమ్మల్నిలాగ ఇబ్బంది పెట్టేవాడినీకాను. ఎలాగూ జరిగిందికాబట్టి నేను చెప్పక తప్పదు, మీకు చదవకా తప్పదు.
అది షుమారుగా 1960 ప్రాంతం. అంటే ఇప్పటికి 50 సంవత్సరాల క్రితం మాట. అప్పుడు నా వయసు బహుశా పన్నెండేళ్ళు ఉంటాయేమో. అప్పట్లో మా నాయనమ్మకి జబ్బుచేసింది. ఇక్కడ మీకో విషయం చెప్పాలి. ఇంగ్లీషువాళ్ళు మనల్ని వదిలిపెట్టి చాలాకాలం అయినా ఇంగ్లీషు భాషమాత్రం మనల్ని వదిలిపెట్టలేక మనదగ్గరే ఉండిపోయింది. జార్జి చక్రవర్తి మనలో ఎంతమందికి తెలుసోకాని, కింగ్ జార్జి ఆస్పత్రి మాత్రం మా ప్రాంతంలో తెలియనివారు ఉండరు. "పి. హెచ్. సి" అంటే తెలియకపోవచ్చేమోకాని "కే. జి. హెచ్" అంటే తెలియనివారు ఉండరంటే నమ్మండి. మా నాయనమ్మని సరిగ్గా అక్కడికే తీసుకెళ్ళాం.
డాక్టర్లు పరీక్షచేసి "పెద్దాపరేషన్ చెయ్యాలి, రెండువారాలు ఉండాల్సొస్తుంది" అన్నారు. అంత పెద్ద పట్నంలో నేనూ, అమ్మ, నాన్న; బయట ఉండాలంటే హోటలూ గట్రా చాలా ఖర్చు అవుతుంది కాబట్టి, కే జీ హెచ్ కి దగ్గరలో, మా దూరపు బంధువైన ఒక పోలీసు కానిస్టేబులు గారి క్వార్టరులో ఉన్నాం. సరిగ్గా అదే రోజుల్లో, ఒకరోజు సాయంత్రం ఆస్పత్రిలో మా నాయనమ్మ దగ్గర్నుంచి మా పోలీసు మామయ
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|