Job sourcing a funny essay in Just Read and Enjoy at TeluguPeople.com - Telugu Community Portal. Social Networking, Chat, Blogs, Classifieds, Videos, Photos, Galleries, Bollywood, Movies, Hyderabad, Visakhapatnam, Tirupati, Vijayawada, Guntur, Warangal, Kakinada, Kadapa, Kurnool, Rajahmundry and lot more...
TeluguPeople
  are the trend-setters

Active Blogs | Popular Blogs | Recent Blogs

Tarzan Tarzan's Blogs >> Just Read and Enjoy

Job sourcing a funny essay

కాలేజి నుండి బయటపడి మొదటి సారి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న కుర్రాళ్ళు, కుర్రాళ్ళినిలకు సహాయపడటానికి

నేను చేస్తున్న ప్రయత్నమిది....ఇంటర్వ్యూ లో నెగ్గుకురావటానికి కావలసిన కిటుకులను నేను కాచి,

వడబోసి, ఇంటి బయట పారబోసాను. నా సీనియర్లు నాకు ఉచితంగా ఇచ్చిన సలహాలను నేను మీకందరికీ ఆ

ఉచితంలో సగం ధరకే ఇస్తాను..



ఉద్యోగానికి దరఖాస్తు చెయ్యటానికి ముందు మనము చెయ్యవలసిన పని - వచ్చే జన్మలోనైన ఇటువంటి దుస్థితి

రాకుండా ఓ పది, ఇరవై కోట్లకు వారసులుగా పుట్టేలా దీవించమని దేవుడికి మొక్కుకోవటం.



ఆ తరువాత resume తయారు చేసుకోవాలి. తయారు చేసుకునే ముందు దానిని 'రెస్యూం' అనాలో, 'రెస్యూమే

' అనాలో పెద్దలనడిగి తెలుసుకోవటానికి ప్రయత్నిచటం...ఎలా అన్నా ఒరిగేది ఏమీ లేదని తెలుసుకున్నాక

అసలు పనికి ఉపక్రమించటం.



'రెస్యూమే ఎంత చిన్నగా ఉంటే అంత మంచిది ' అని చెప్పే ఉద్యోగ ద్రోహులు చెప్పే మాటలు వినకండి. మన

తెలుగు క్యాలెండర్ లాగా కనీసం పన్నెండు పేజీలు ఉండేలా చూసుకోండి..ఆ తరువాత దాన్ని బైండింగు

చేయించి, స్కూలు బ్యాగు లో మోసుకెళ్ళొచ్చు ఇంటర్వ్యూ కు.



పన్నెండు పేజీలు ఎలా నింపాలి??



మనం ఎంత వెధవలమయినా మనల్ని మనం ప్రేమించుకోవాలి. కాబట్టి, రెస్యూమే మొదటి పేజీ లో హైబ్రీడు తాటికాయంత

అక్షరాలతో మన పేరు ఉండేలా చూసుకోవాలి. ఆ తరువాత మన ఫోన్ నంబరు, మన ఈ మెయిల్ ID రాయాలి. మన

ఈ మెయిల్ ID దగ్గరే కంపెనీ వాళ్ళ దృష్టిని ఆకట్టుకునేందుకు ప్రయత్నించండి. ఏదో పేలవమైన ID

కాకుండా crazyboy007@mindless.com లాంటి వంకర పేర్లు పెట్టుకుంటే మంచిది...మన రెస్యూమే

జన్మలో మర్చిపోడు చూసినవాడెవడయినా.



ఈ వివరాల తరువాత objective రాయాలి...



objective అంటే ఈ రెస్యూమే ఎందుకు తయారు చేస్తున్నాము అని - అంటే ఉద్యోగం కోసమని - అంటే

డబ్బు కోసమని - అంటే మూడు పూట్లా భోజనం కోసమని - అంటే రాత్రి పూట భోజనం చేస్తే బొజ్జ

వస్తుందని - అంటే రాత్రి చపాతీలు మాత్రమే తినాలని....

కాబట్టీ, objective పక్కన 'చపాతీలు తినటం' అని రాయండి! మీ దూరదృష్టి అర్థమౌతుంది కంపెనీ

వాళ్ళకు..



ఆ తరువాత మన అర్హతల వివరాలు...



పదవ తరగతి, ఇంటర్, గ్రాడ్యుయేషన్ మార్కు షీట్లు చూపించాలి కాబట్టి పెద్దగా అబద్ధాలు రాయకండి...కాని

ఒకటవ తరగతి నుండి, తొమ్మిదో తరగతి వరకు రెచ్చిపోండి.



3వ తరగతి - ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్

5వ తరగతి - సౌత్ ఇండియా టాపర్

8వ తరగతి - పరీక్షలు రాయకుండానే పాస్



...ఇలా యధేచ్చగా రాసుకోవచ్చు.



ఆ తరువాత రెస్యూమే కు అతి ముఖ్యమైనది మన 'స్కిల్ సెట్' వివరాలు రాయటం (గుర్తుందిగా...పన్నెండు

పేజీలు నింపాలి మనం)



ఇప్పుడిక్కడున్న అందరిలోకి మేధావిని నేనే కాబట్టీ నా 'స్కిల్ సెట్' గురించి ఎలా రాసానో చెబుతాను..దానిని

నమూనా గా తీసుకుని మీ మీ స్కిల్ సెట్లు రాసుకోవచ్చు.



"నేను కాలేజీలో చివరి బెంచిలో కూర్చునేవాడిని..ముందు బెంచీ అబ్బాయిలు, అమ్మాయిలు క్లాసు

జరుగుతున్నంత సేపు ఏవో చీటీలు రాసుకుని ఒకళ్ళకొకళ్ళు పాస్ చేసుకునేవాళ్ళు. అమ్మాయిలు ముసిముసి

నవ్వులు నవ్వుకునేవాళ్ళు..అబ్బాయిలు ముసిముసి లేకుండా నవ్వుకునేవాళ్ళు. క్లాసు అయ్యాక ఆరోజు

రాసుకున్న చీటిలన్నీ బెంచీల్లో వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు నేను, నాతోపాటు చివరి బెంచీల్లో

కూర్చునే ఓ నలుగురిని వెంటేసుకుని ఆ చీటీలన్నీ హాస్టలుకు పట్టుకెళ్ళి, వాటిని క్షుణ్ణంగా

చదివి...ఆ చీటిలలోని విషయాలన్నింటినీ రుబ్బి, ఒక కథగా రాసి, ఔత్సాహికులకు పంచిపెట్టేవాడిని."



చూసారా - ఒక నాలుగు పంక్తులు రాసి అందులో నా నిపుణతల్ని అన్నింటిని ఎలా ఇమడ్చానో! ఇది చదివిన

వాళ్ళకు నా కష్టపడే మనస్తత్వం, నా అటెన్షన్ టు డీటెయిల్, నా నాయకత్వ లక్షణాలు, నా లోని టీం ప్లేయర్,

పక్కవారితో పంచుకునే గుణం - అన్నీ కనిపిస్తాయి.



మీరు కూడా మీ సామర్థ్యాన్ని గురించి బుల్లెట్ పాయింట్ల రూపంలో కాకుండా ఇలా ఒక మినీ కథ రాస్తే

పాఠకులు ఎక్కువగా ఆస్వాదిస్తారు.



ఆ తరువాత మనం కాలేజీలో చేసిన ప్రాజెక్ట్ల గురించి రాయాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి - మనది

వసుధైక కుటుంబం. మన క్లాస్మేట్లు, మన సీనియర్లు అంతా మన ఇంటివాళ్ళే..వాళ్ళ ప్రాజెక్ట్లు మనవి

కాదా, మన అరియర్లు వాళ్ళవి కావా? మొహమాటం లేకుండా ఎవరి ప్రాజెక్టు బాగుంటే అది పెట్టెయ్యండి

రెస్యూమేలో..



ఆ తరువాత మన 'వ్యక్తిగత వివరాలు ' ఇవ్వాలి..రెస్యూమే మొదట్లో మనము రాసిన వివరాల్ని పీకి పాకాన

పెట్టాలి..

మీ వంశవృక్షం మొత్తాన్ని ఒక ఫ్లోచార్టు లాగ గీసెయ్యండి. మీ పుట్టిన రోజు, బారసాల, మొదటిసారి

గుండుకొట్టించుకున్న రోజు - ఈ వివరాలన్నీ రాస్తే ఇంటర్వ్యూ చేసేవాడికి బాగా దగ్గరౌతారు..



ఇవన్నీ రాసాక కూడా ఇంకా పన్నెండు పేజీలు నిండకపోతే ఈ రెస్యూమే టైపు చేసిన పేపర్ ఏ షాపులో కొన్నది,

ఆ షాపు వాడు నెలకు అద్దె ఎంత కడుతున్నాడు, అద్దెలు బెంగళూరులో ఎలా పెరుగుతున్నాయి,

బెంగళూరులో ఇంతమంది అమ్మాయిలున్నా మనల్ని ఒక్కరు కూడా ఎందుకు చూడట్లేదు - మన

సృజనాత్మకతనంతా ఉపయోగించి ఇలాంటివెన్నో రాసుకోవచ్చు..



రెస్యూమే తయారయ్యాక దానికి పసుపు, కుంకుమ రాసి అప్లై చెయ్యాలనుకున్న కంపెనీలకు పోస్టు

చెయ్యండి..చేసిన తరువాత తెలుస్తుంది - మనము ఇంకా గుప్తుల కాలంలో లేము, ఇప్పుడంతా ఆన్లైన్

అప్లై చేస్తారు అని...అప్పుడు కంప్యూటర్ మానిటర్ కు పసుపు, కుంకుమ రాసి ఆన్లైన్ దరఖాస్తు

చెయ్యటం మొదలెట్టండి....



అప్ప్లై చేసేసాం కదా...ఇప్పుడు విశ్రాంతి! విశ్రాంతి తరువాత ఒక పాట. పాట అవ్వంగానే ఇంటర్వ్యూలు

రావటం మొదలౌతాయి..



ఇంటర్వ్యూలో ఎటువంటి టెక్నికల్ ప్రశ్నలు అడుగుతారో మనకు తెలియదు...అలాంటప్పుడు వాటికి

సమాధానాలు మాత్రం తెలుసుకుని ఏం చేస్తాం?? కాబట్టి, ఏ పుస్తకాలు చదువుకోకుండా నేరుగా వెళ్ళండి.



మామూలుగా శని, ఆదివారాల్లో కంపెనీలు 'వాక్-ఇన్ ' ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంటాయి...వీటి వివరాలు పేపర్

లో చూడగానే చెయ్యల్సిన మొదటి పని - అదే ఊళ్ళో ఉన్న మన క్లాస్మేట్స్ ఎవ్వరూ ఆ 'వాక్-ఇన్ ' కు అటెండ్

కాకుండా చూసుకోవటం!



 

Enduser Enduser
ఉచితంలో సగం ధరకే ఇచ్చిన సలహాలైనా, నవ్వుకోవడానికి బాగుంది.....
.....:)

Posted at: 1, Oct 2010 12:47 PM
 



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.