Active Blogs | Popular Blogs | Recent Blogs
నల్లానల్లని వాడు
తెల్లనామాల వాడు
ఏడుకొండలపై కొలువై
వున్నాడు వాడు
బోసినవ్వులో
బోలెడు వరాలు కురిపిస్తాడు
నీలాలు తనవేనంటాడు
నీలో వున్న అహాన్ని
నిరోధించమంటాడు
నాలో నీవున్నావంటూ
నీవే నేనంటాడు
వాడి వైభవమేమో
వర్ణింప తగింది కాదు
పూలదండని ముడి వేయకుండానే
భుజాలపై వేసుకుంటాడు
భయం సమస్తమై భయపెట్టినప్పుడు
అభయహస్తమిచ్చి ఆదుకుంటాడు
జగతిలోనిదంతా భూమినించేపుట్టి
తిరిగి భూమిలొనేకల్సేదంటూ
దక్షిణ హస్తాన్ని చూపిస్తాడు
తనలో లీనమయ్యె తత్త్వం
పెంచుకోమంటాడు
క్షణకాలం వాడి దర్శనం
కోటిజన్మల తృప్తికి నిదర్శనం
జన్మరాహిత్యానికి సోపానం
జన్మసాఫల్యానికి బహుమానం.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|