Active Blogs | Popular Blogs | Recent Blogs కలల గగనములో
ప్రవహించే మనో లయలలో
ఇద్దరి తలపులు ఏకమై
సరాగాలను అందుకొంటూ వుంటే
ప్రకృతి పులకించి
నక్షత్ర రాశులను
మనపై చల్లుతూ దీవించే వేళ
ఓ ప్రియసఖీ !
కళ్యాణ కాంతుల మధ్య
కమనీయ దృశ్య బింబం
రెప్ప చాటున చిగురు తొడిగింది
నా ఊపిరి సవ్వడిలో
నీ అపురూప సౌందర్యం
గుండె మాటున గూడు కట్టింది
స్వప్న జగతిలో
ఒక చిలిపి ఊహ ప్రాణం పోసుకొని
దృశ్యమై వెంటాడుతోంది !?
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|