Active Blogs | Popular Blogs | Recent Blogs ఓనాటి ప్రేమ అల...
మనసు తీరం తాకి.....
మధుర గాయం చేసిందిలా.....
తీపి ఙ్ఞాపకాల గాయాలు రేపి...
చేదు అనుభవాలు ఙ్ఞాపకం చేసి...
అలా కలలా కరిగిపోయింది.....
ఓనాటి ప్రేమ అల...
మనసు తీరం తాకి.
మధుర గాయం చేసిందిలా.....
ఇద్దరం ఒకటైన క్షణాన్ని...
ఇద్దరం రెండైన క్షణాన్ని...గుర్తుచేసి
లిప్తకాలంలో లుప్తమైపోయింది...
ఓనాటి ప్రేమ అల...
మనసు తీరం తాకి.
మధుర గాయం చేసిందిలా.....
ఎప్పటిదో రాగం..
అప్పటిదే తాళం...శృతి లేక
లయలో లయమైపోయింది....
ఓనాటి ప్రేమ అల...
మనసు తీరం తాకి.
మధుర గాయం చేసిందిలా.....
రెండు గుండెలు వేరని....
రెండు మనసులు కలువవని...తెలిపి
గుండెని రెండుగా చీల్చుతూనే ఉంది.
ఓనాటి ప్రేమ అల...
మనసు తీరం తాకి.
మధుర గాయం చేస్తూనే వుంటుందిలా.....
రుధిర పానం చేస్తూనే వుంటుందిలా...
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|