Active Blogs | Popular Blogs | Recent Blogs విషాద అచ్చులను
ఆనందపు హల్లులను
వర్ణమాలగా చేసుకొని
కాలాన్ని గుణించు కొంటూ
సాగిపోతోంది
మనసు బాష !
క్షణాలపై దొర్లుకొంటూ
వెచ్చని కన్నీటి ప్రవాహాలలో
కొట్టుకొంటూ
చల్లని ఆనంద కెరటాలలో
నింగి కెగురుతూ
లోలకపు ఆలోచనలకు
ఊహా కాంతులను అద్దుకొని
అనంత దృశ్యాలను
తనలో నిక్షిప్తం చేసుకొని
కవితా ప్రవాహమై
జీవితకాలం కవి కలంలో
జీవిస్తోంది జీవ బాష
అదే మన తెలుగు భాష
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|