Active Blogs | Popular Blogs | Recent Blogs బాలగంగాధర తిలక్ ( Bala gangadhara tilak)
Tuesday, 24 November 2010
మానవీయ కవి బాలగంగాధర తిలక్ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గర "మండపాక" లో 1921 ఆగస్ట్ లో జన్మించి చిన్న వయస్సులోనే 1966 జూలై 2 న మరణించారు. నిత్యం సాహితీ పటనం చేస్తూ కాలాన్ని గడిపేవారు.. వీరి ౧౯౩౭ లో "ప్రభాతము - సంధ్యా" అనే కవితా సంపుటి ప్రచురించారు. 1945 సంవత్సరంలో మరో మారు ఈ కవితా సంపుటి అచ్చుకు నోచుకుంది. 1961 నుండి కవిత్వంలో కొత్త పోకడలు చూపించాడు.. వీరు రాసిన కొత్త పోకడలు చూపిన కవితా సంపుటి " అమృతం కురిసిన రాత్రి" వీరు చనిపోయాక ముద్రణకు నోచుకుని కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డును పొందింది.. అందులోని కొన్ని కవితలు :-
నా కవిత్వం
నా కవిత్వం కాదొక తత్వం
మరికదొక మీరనే మనస్తత్వం
కాదు ధనికవాదం, సౌమ్యవాదం
కాదయా అయోమయం.. జరామయం..
గాజు కెరటాల వెన్నెల సముద్రాలూ
జాజిపువ్వుల అత్తరు దీపాలూ
మంత్ర లోకపు మణి స్తంభాలూ
నా కవితా చందన శాఖా సుందర చిత్ర విచిత్రాలూ
అగాధ భాధా పాద: పతంగాలూ
ధర్మ వీరుల కృత రక్తనాళాలూ
త్యాగశక్తి ప్రేమ శక్తి, శాంతి సూక్తి
నా కళా కరవాల ధగధగ రావాలూ
నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయా సారావతాలూ
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఇరావతాలూ
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమయిన ఆడపిల్లలు ..
దృశ్య భావాలు
ఘోష
హెష
మురళి
రవళి
కదలి కదలి
ఘణం ఘణల నిక్వణ క్వణల ఝణం ఝణల
బండి మువ్వ,
కాలి గజ్జే
కలిసిపోయి
పక్షి రెక్క
పొన్న మొక్క
జొన్న కంకె
తగిలి పగిలి
వాన చినుకు చిటపటలో కలిసి
కొబ్బరి మువ్వ పిచ్చుక గొంతులో కలిసి
మూలుగు యీలుగు కేక
చప్పతులు చక చకలు నవ్వు
పోదివికోనీ అదిమి కొని
కదలి కదలి
ఘోష
హెష
మురళి
రవళి
నా మనస్సులో నిశ్శబ్దపు స్థంభంలా
నిలుచున్నవి
చదల చుక్క
నెమలి రెక్క
అరటి మొక్క
ఆమె నొసటి కస్తూరి చుక్క
కదలి వచ్చి ప్రిదిలి నవ్వి
నవ్వి నవ్వి నీరెండల పరుగులెత్తి
మావి తోపు నీడ నాడి
కుంద జాజి సేవంతుల ల
వంగ మల్లీ మందారాలు బంతులాడి
కొలనిగట్ల పడుచుపిల్ల
కుచ్చెళ్ళతో పంతమాడి
కలలమెట్ల వంగినడిచి
అలల కడలి అంచు లోరసి
నా తలపుల్లో కలిసిపోయి
నా పలుకులలో పరిమళించు
చెదల చుక్క
నెమలి రెక్క
అరటి మొక్క
ఆమె నొసటి కస్తూరి చుక్క
సంధ్య
గగనమొక రేకు
కన్నుగవ సోకు
ఎరుపెరుపు చెక్కిళ్ళ విరిసినది చెంగల్వ
సంజె వన్నెల బాల రంగు పరికిణి చెంగు
చీకటిని తాకినది అంచుగా
చిరు చుక్క ప్రాకినది
వాలు నీడల దారి నీలి జెండాలెత్తి
చుక్క దీపపు వత్తి సొగయు బాటల నెల్ల
నిదుర తులేది నడక గడుము మైకపు కోర్కె
వచ్చు నిశిలో కరిగి నవ్వు శశిలో కలసి
సంజె వన్నెల బాల రంగు రంగు రుమాల
విరిసింది కలలల్ల
వెండి తోటల మధ్య
వాలినది వ్రాలినది తావిగా
సోకినది సోకినది
సంజె పెదవుల ఎరుపు కదలి అంచుల విరిగి
సంజె పరికిణి చెరగు ఎడద లోతుల మెరసి
ఏటి కొంగల నిదుర ఎర్రగా ప్రాకింది
బాతు రెక్కలనీడ బరువుగా సోలింది
సంజ వన్నెల చాలు స్వర్ణ స్వర్నది ధార
వయసు మైకపు జీర కరగు మబ్బుల తేల
గగనమొక రేకు
కన్నుగవ సోకు
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|