2011 in #telEmundi lemDi.....#tel at TeluguPeople.com - Telugu Community Portal. Social Networking, Chat, Blogs, Classifieds, Videos, Photos, Galleries, Bollywood, Movies, Hyderabad, Visakhapatnam, Tirupati, Vijayawada, Guntur, Warangal, Kakinada, Kadapa, Kurnool, Rajahmundry and lot more...
TeluguPeople
  are the trend-setters

Active Blogs | Popular Blogs | Recent Blogs

Padma Sreeram V.'s Blogs >> #telEmundi lemDi.....#tel

2011

చల్లని సాయంత్రమౌతోంది
నిశికన్య చుక్కల చెలికత్తెలతో
అంబరాన సయ్యాటలకి సై అంటోంది

బిక్క చచ్చినట్లున్న 2010 గది తలుపు తీసాను
కనుమరుగవుతున్న సంధ్యాకాలపు వెలుగు...
పికిలిపిట్టలు రొద చేసుకొంటూ పోతున్నాయి

తొలిదశాబ్దపు చేదు జ్ఞాపకాలు
మలిదశాబ్దపు ఏటి తరగల్లో
మొహాలు చూసుకొంటున్నాయి

జీవిత గట్టు మీద భవిష్యాశల గడ్డిపూలు
సంబరంగా చలాకీగా తలలాడిస్తున్నాయి

నిజమే వాటికీ వ్యవస్థ గురించి పట్టింపు లేదుగా
అందుకే ఈ వెర్రి ఆనందపు తలాడింపులు

లేకుంటే సెకనుకో రేటు మిల్లీమీటరుకో టోల్ గేటు
కట్టుకొంటూ నీరసించి తల వేలాడేసేవి

ఆశలకు కరప్షన్ లేదు కనుక
అవి స్వచ్ఛంగా స్వేచ్ఛగా అలానే తలాడిస్తాయి

మనమూ అలానే రెక్కలొచ్చిన 2011 లోకి ఎగిరిపోదామా

గడిచిన కాలంపై కంప్లైంట్స్ మానేసి
ఖరీదైన కలల్నీ కాలాతీతపు సృజననీ
సరాగాల సంతోషాన్నీ మూటగట్టుకొని

ఈ మకిలి మరకల 2010 ని విడిచి
మనదైన మమతల లోగిల్లోకి
మలి దశాబ్దపు తొలి విడిదికి

ఆశల రెక్కలు కట్టుకొని ఎగిరిపోదామా...



 

VENKAT ESWAR RAO
AUM SREE SAI PARAMAATHMAAYA NAMAHA
Hai Padma garu,
Namasthe !
Bagunnaara ??
How r u ??
I wish u a very very happy n happy prosperous new year 2011
Mee sreevaaru elaa unnaaru ??
Pillalu ??
Atta garu, aadabaduchulu..
manam amthaku mundu phone lo maatlaadukunnaamu long back gurthundaaa ??
Please visit my Blog n u r requested to pass ur comments..
Mee kavitha chaala baagundi
upamaanam baagumdi...
Bhavishyath aasala gaddipoolu thalaadisthunnaayi
manishi aasalni gaddi poovutho polchadam chaala baagumdi
kaakunte
manamoo alaane rekkalochhi anedi theesesthe baaguntumdemo anipimchimdi..
daanikannaa imkaa manchi padajaalam bhaavam unte imkaa sobha vochhedi..
namassulatho
venkateswar Rao

Posted at: 6, Jan 2011 8:09 AM
 



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.