సోనియాను తిట్టండి... పదవులు కొట్టండి in AP Politics at TeluguPeople.com - Telugu Community Portal. Social Networking, Chat, Blogs, Classifieds, Videos, Photos, Galleries, Bollywood, Movies, Hyderabad, Visakhapatnam, Tirupati, Vijayawada, Guntur, Warangal, Kakinada, Kadapa, Kurnool, Rajahmundry and lot more...
TeluguPeople
  are the trend-setters

Active Blogs | Popular Blogs | Recent Blogs

Srinivas Reddy Pasula's Blogs >> AP Politics

సోనియాను తిట్టండి... పదవులు కొట్టండి

నక్కను తొక్కితే లాభం కలుగుతుందన్న నానుడిలో నిజమెంతే తెలియదు కానీ, కాంగ్రెస్ పార్టీలో సోనియాను తిడితే పదోన్నతి లభిస్తుందన్న నమ్మకం మాత్రం రోజురోజుకూ బలపడుతోంది. సోనియాను చెడామడా తిట్టి కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్లిన శరద్ పవార్, పి.ఎ. సంగ్మాలను ఇప్పుడు ఆ పార్టీ పల్లకీలో ఊరేగిస్తోంది. బోఫోర్స్ కుంభకోణంలో ఇటలీ కనెక్షన్ బయటపెట్టి, రాజీవ్ వంటింటి నుంచే వ్యవహారం నడిచిందని పార్లమెంటులో అర్థం తెలియని ఆంగ్ల పదాలతో కుండబద్దలు కొట్టిన జైపాల్ రెడ్డికి ఇప్పుడు సోనియమ్మ హయాంలో అగ్రతాంబూలం దక్కింది.

సోనియాను అవినీతి సామ్రాజ్యపు అధినాయకిగా వర్ణించి, కాంగ్రెస్ నేతల పంచెలు ఊడగొడతామని ఊదరగొట్టిన చిరంజీవి ఇంటికి బంపర్ ఆఫర్లతో కాంగ్రెస్ పార్టీ పల్లకీ పంపింది. దేవత, దయ్యం అనేవి పర్యాయపదాలన్నంతగా మార్చిమార్చి సంబోధించే కేసీఆర్ అంటే కాంగ్రెస్ హైకమాండ్ కు ప్రత్యేకమైన భయం.

నిలువుదోపిడీకి సిద్ధంగా ఉన్న నిజమైన భక్తులకు 10 జనపథ్ లో దర్శనం కరవవుతుంటే, తిట్ల దండకంతో కొట్లాటకు దిగిన వాళ్లకు ప్రత్యేక బ్రేక్ దర్శనం లభిస్తోంది. బహుశా ఇవన్నీ చూసేనేమో జగన్ కూడా కాంగ్రెస్ పై యుద్ధం ప్రకటించాడు... ఆయన అనుచరులు కవి చౌడప్ప సాహిత్యం చదివి మరీ బూతులు నేర్చుకుంటున్నారు, అమ్మగారి ఆగ్రహాన్ని అనుగ్రహంగా పొందడానికి.

ఇంకోవైపు తెలంగాణ ఇస్తం, తెస్తం అని మీసాలు తిప్పుకుంటూ గడ్డాలు పట్టుకుంటూ గల్లీ నుంచి ఢిల్లీదాకా డేకుతున్న తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లకు అధిష్ఠానం పూచికపుల్లంత విలువ కూడా ఇవ్వడం లేదు. ఐనవాళ్లకు ఆకుల్లో కానివాళ్లకు కంచాల్లో వడ్డించే సోనియమ్మ వైనాన్ని ఇంతకాలం దగ్గరినుంచి చూస్తున్న కాకా ఉరఫ్ వెంకటస్వామికి ఇప్పుడు జ్ఞానోదయమైనట్టుంది. శరీరం సహకరించకపోయినా వీల్ చైర్ లో కూర్చువి కుంభస్థలంపై మాటల తూటాలు ఎక్కుపెడుతున్నాడు. ఏమో కాకా వ్యూహం ఫలించి రాష్ట్రపతి పదవి దక్కినా దక్కొచ్చు.



 

Srinivas a
I do agree with you and good analysis too

Posted at: 10, Mar 2011 12:42 PM

giri kumar reddy basireddy
u r right mr srinivas , and onemore thing i want to tel u , that all the politicians are making us sheeps , and playing with our life, did u see any one dies accept , potti sriramulu garu , for the societly just now a days all politicisans just siting at home and give some money for rowdsy and gundas , they are the one who is maintaing the all this strikes and rastha rokos and , , realy one stupid thing is ther athat even deaths are aslo aming big issues and they are conneting to this udyamalu ,if some dies in telangana , trs wil el that he die for telenganaa, if some one dies in seemandra there politicis tel they dies for samikya andrha, this is now days i dont no when our people get awaresnes this stupid politcinsa we want a great leader , not like chirlu joker and , chandrababu , power greedy person , we want some one who can give at lesst who can provie food and hose and work , for livees

Posted at: 5, Feb 2011 1:23 PM

annaji venkata krishna naga chandra sekhar Gubbala
Very good ...this is 100% right. Why other congress leaders waiting.....start learning unparliamentary words(of course you are the dictionaries for that) and use on your leader. Good luck.

Posted at: 3, Feb 2011 1:07 AM

Jalli Saddappa
Superb!!!!!, Very good Analysis, Srinivas Garu

Posted at: 1, Feb 2011 1:35 PM

Ramachandra Rao Nidadavolu
:-) excellent!!!

Posted at: 1, Feb 2011 11:53 AM
 



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.