Active Blogs | Popular Blogs | Recent Blogs
ఆజాద్
మెల్లగా స్వాతంత్ర్య సమరం మన దృష్టిలోంచి తొలగిపోతోంది. అంతః కలహాలు పెచ్చుమీరిన సమయంలో మన దేశాన్ని ఆక్రమించిన బ్రిటిష్ వారు సుమారు రెండు వందల సంవత్సరాలు మన దేశాన్ని తమ వలస రాజ్యంగా చేసుకుని, ఇక్కడ వుండే సంపదను దోచుకుని, స్వేచ్చా స్వాతంత్ర్యాలు హరించి ప్రజల్ని బానిసలుగా మార్చేసారు. ఈ విషయం ఇప్పుడు పూర్తిగా చరిత్ర పుస్తకాలకే పరిమితమైంది. ఇప్పుడెవరికీ ఆ పుస్తకాలు చదివి ఈనాడు మనం అనుభవిస్తున్న స్వేచ్చకు కారణమైన ఆనాటి సంగ్రామాన్ని గురించి తెలుసుకునే ఓపిక గానీ, తీరిక గానీ వుండడం లేదు. విజ్ఞానం అందివ్వాల్సిన చదువు వృత్తి విద్యల పేరుతో డబ్బు సంపాదించే యంత్రాలను తయారుచేస్తూ వ్యాపారంగా మారిపోయింది.
ఇంక స్వాతంత్ర్యాన్ని సాధించడానికి జరిగిన సమరం గురించి, ఆ సమరం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహానుభావుల గురించి ఇప్పటితరానికి తెల్సేదేలా ? వాటినుంచి ఇప్పటి తరం స్పూర్తి పొందేదేలా ? ఎవరో కొందరు రాజకీయనాయకులు తమ స్వార్థ రాజకీయాల కోసం చరిత్రను తమకనుకూలంగా మలచుకుని చెప్పే కట్టుకథలే నిజమైన చరిత్రని నమ్ముతున్నారు గానీ, వాస్తవ చరిత్ర పరిశీలించే పరిస్థితి ఈనాడు కనిపించడం లేదు. ఆ చరిత్రనుంచి పాఠాలు నేర్చుకుని భవిష్యత్తు బంగారం చేసుకునే బదులు నరకం చేసుకుంటున్నారు. అందుకే.... అప్పుడు పరాయి దేశస్తులు దోచుకున్నారు.... ఇప్పుడు మనవాళ్ళే మనల్ని దోచుకుంటున్నారు.
ఈ తరుణంలో అప్పటి స్వాతంత్ర్య సమరయోధుల గురించి కొన్ని ముఖ్య సందర్భాలలోనైనా గుర్తు చేసుకోవడమే కాక మన తర్వాత తరాలవారికి వారి గురించి చెప్పాల్సిన అవసరం ఎంతైనా వుంది.
........ ఆనాటి స్వాతంత్ర్య సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ వర్థంతి సందర్భంగా ప్రత్యేకం ఇక్కడ చదవండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|