Active Blogs | Popular Blogs | Recent Blogs
వెండితెర నవలలపై రమణ
ముళ్ళపూడి వెంకటరమణగారు రచనల్లో ప్రత్యేకంగా చెప్పుకోదగినవి వెండితెర నవలలు. ఒక కథని వెండితెరకేక్కించడం సులువేనేమో గానీ వెండితెర మీద దృశ్యకావ్యంగా ఒదిగిన కథని ఒక నవలగా మలచి పాఠకులను ఒప్పించడం చాలా కష్టం. నవల పఠనంలోనే పాఠకునికి సినిమా చూపించగలగాలి. ఆ శైలి ముళ్ళపూడి గారి ప్రత్యేకత. ఆయన రాసిన ' భార్యాభర్తలు ' వెండితెర నవల చదివి ఆ చిత్ర దర్శకుడు కె. ప్రత్యగాత్మ " సినిమా తియ్యడానికి ముందే ఈ నవలను చదివివుంటే సినిమాను ఇంకా బాగా తీసేవాడిని " అన్నారంటే ముళ్ళపూడి వారు ఆ చిత్ర సన్నివేశాల్ని ఎంత బాగా కాగితం మీద పరిచారో అర్థం చేసుకోవచ్చు.
తాను రాసిన వెండితెర నవల గురించి ముళ్ళపూడి వెంకటరమణ గారు ఏమంటున్నారో ఇక్కడ చదవండి.....
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|