Active Blogs | Popular Blogs | Recent Blogs
చాలా రాసాం.. అమ్మ మీద , నాన్న మీద. ప్రేయసి మీద , ప్రేమ మీద.
కొందరు ప్రేమ అంటే అమ్మ అన్నారు. అమ్మ కన్నా మిన్న నాన్న అనీ అన్నారు.
కొందరు అమ్మాయి అడుగుల్ని కొలుస్తూ వెళ్ళారు. మరి కొందరు నడవటమే మర్చిపోయారు.
కొందరు నిస్వార్దం అన్నారు, మరి కొందరు త్యాగం అన్నారు.
మోసం అన్నారు , ప్రపంచాన్ని మరిపించే మందు అని కూడా అన్నారు.
ఎవో అన్నారు.. ఎన్నో రాసారు.
నచ్చిన వారు బాగుందన్నారు. నచ్చని వారు భావం తెలీలేదన్నారు.
నీ గురించి ఏదైనా రాయాలని కొత్తగా తోచింది.
ఇదిగో
నాకు నచ్చింది తనకూ నచ్చింది అంటూ గొడవ పడటం బాగోలేదు.
నా కోసం తెచ్చింది తనకూ కావలి అనటం భావ్యం కాదు.
అన్నం తినిపించవు. ఆటలాడి ఇంటికొస్తే అమ్మ ముందు కాపు కాయవు.
బడి ముందు ఉన్న బండి దగ్గరకు వెళ్ళనీయవు. గుడి లొ గంట ఎగిరి కొట్టనీయవు
కోప్పడతావు, కొడతానంటావు. మాట వినకపోతే మళ్ళీ మాట్లాడనంటావు
నాకేమీ తెలియదంటావు. అర్దం చేసుకునే తెలివి తేటలు నాకు లేవంటవు
నువ్వు చూడ్డానికి ఏమీ బాగోవు. నీ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేవు
ఏంటో.. ఎప్పుడూ నన్ను పట్టి లాగుతావు.
నిన్ను ఎంత గానో మాటలు అందాం. నువ్వేమంటావో చూద్దాం అనుకుంటే
నువ్వేమో నన్నో పిచ్చి దానిలా చుస్తావ్. పరవాలేదులే అని నవ్వేసి పొతావ్.
నేనేమన్నా… మర్చిపోయి నన్ను దిద్దడమే పనిగా పెట్టుకున్నావ్.
అయి ఉండొచ్చు. ఎంతైనా నువ్వు “అక్క”వి కదా . నువ్వు ఏదైనా చెయ్యగలవ్.
నేనూ చూస్తా నువ్వెన్నాళ్ళు నన్ను సరి చేస్తూ ఉంటావో.
నువ్వేంటో సరిగా కనపడే వరకూ చూస్తూనే ఉంటా.
నీది కూడా ప్రేమే అని అర్దం అయ్యేలా అందరికీ చెప్తా.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|