Active Blogs | Popular Blogs | Recent Blogs సినిమా కష్టాల్లాగే సినిమా ప్రేమలు కూడా ఉంటాయని మరోసారి రుజువు కాబోతోంది. నిన్నటిదాకా వాలెంటైన్స్ డే డిబేట్లలో, పబ్ పార్టీలలో కెమెరాలకు పోజిచ్చి చిలుకాగోరింకల్లా కలిపించిన శ్రీజ- శిరీశ్ (చిరంజీవి కూతురు, అల్లలుడు) ప్రేమకథ ముగింపు దాకా వచ్చినట్లుంది. ఉన్నట్టుండి శ్రీజ హైదరాబాద్ సిసిఎస్ పోలీసు స్టేషన్ కు వెళ్లి, తన భర్త గృహహింస (డొమెస్టిక్ వయలెన్స్)కు పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని విచారణ మొదలుపెట్టారు. వీళ్ల ప్రేమ ప్రయాణం ముగియవచ్చు లేదా రాజీ కుదరవచ్చు.
`సినిమా ప్రేమ' అని ఎందుకు అన్నానంటే, మన హీరోలు సినిమాల్లో అర్థంపర్థం లేని ప్రేమకథలు సృష్టించి జనం మీదికి వదులుతుంటారు. వాటిని తమకు అన్వయించుకొని, నిజజీవితంలో ప్రేమకథలకు తెరతీసిన హీరోల కూతుళ్లు కొద్దికాలంలోనే వాస్తవ లోకంలోకి వచ్చి నాన్న వద్దకు చేరుకోవడంతో సినిమా ప్రేమకథ ముగుస్తుంది. గతంలో ఇలాగే ప్రేమపేరుతో వెళ్లిపోయిన సెలబ్రిటీ కూతురు చివరికి సినిమాప్రేమకు ముగింపు పలికింది. ఇప్పుడు లెజండ్ కూతురు కూడా అదే బాటలో పయనిస్తోంది.
`సినిమా ప్రేమ'ను జనం మీదికి వదిలే హీరోలు, హీరోయిన్ల పిల్లలు అదే `సినిమా ప్రేమ' బాధితులైనప్పుడు మీడియా దృష్టికి వస్తోంది. కాని, సినిమాప్రేమ వల్ల వేలాది మంది సామాన్యుల జీవితాలు నాశనమవుతున్నాయి. వాళ్ల తల్లిదండ్రులు లెజెండ్సో, సెలబ్రిటీలో కాకపోవడం వల్ల బయటికి రాకుండానో, లేదా పేపర్లో ఎక్కడో క్రైమ్ న్యూస్ లో సింగిల్ కాలమ్ వార్తగానో ప్రచురితమవుతున్నాయి.
చిరంజీవి రాజకీయ పార్టీని ఎలాగూ నడపలేకపోయాడు, కనీసం సినిమాప్రేమకు వ్యతిరేకంగా ఒక వేదికనైనా ప్రారంభించాలి. అమ్మాయిలెవరూ తన కూతురిలా సినిమాప్రేమ బారిన పడకుండా మార్గదర్శనం చేయాలి.
 hamza amita | Hi dear, I saw your profile and have interest to be your online friend, you are a wonderful mom and will like to be sharing ieas together, my name is Amita, haven't experinece of pregnancy or child because i am still single. but i like to have child one day. you can write me at (amita_hamza@yahoo.com)
Posted at: 3, Apr 2011 6:02 PM |
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|