Active Blogs | Popular Blogs | Recent Blogs గోరంత దీపం ముందు ఆరిపోకుండా కూర్చున్నాను.
లెమ్మన్న పిలుపుకి ఆలోచనల్నుండి తేరుకున్నాను.
ఎవరో గుమ్మం ముందు నిలబడ్డారని వెళ్ళి చూసాను.
ఎవరూ లేరు. ప్రాణం లేని కొన్ని గుర్తులు తప్ప.
ప్రతి గంటకోసారి వెళ్ళి చూసిన చూపులు. పరిగెత్తుకుంటూ వెళ్ళిన నా అడుగులు.
నిన్ను అందుకోవాలని ముందుకొచ్చి , వెనుతిరిగి నిరాశతో నిండిన చేతులు.
ఇంటినిండా కలియ తిరుగుతున్న నీ అల్లర్లు.
ఒక్కసారిగా విరిగిపోయిన నీ ఎదుగుదలకి కారణమైన మెట్లు.
నిముషం కూడా నిలవలేని నీ రూపం నిలువెల్లా ఙ్ఞాపకాలను నింపి పోయింది.
పరిచయం లేని పరామర్శలా విధి లేక నిలబడింది.
పలకరించే ప్రతి ప్రయత్నం వృధా అని తెలిసీ ఆరాట పడింది.
చెసేది ఏమీ లేక ఊరుకుంది.
అయినా పరవాలేదు.
నిలబడతాను గోరంత దీపం ముందు ఆరిపోకుండా.
ఈసారి, లెమ్మన్న పిలుపుకి బెదిరిపోకుండా.
చడీ చప్పుడు లేకుండా నువ్వు నన్ను దాటకుండా
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|