Active Blogs | Popular Blogs | Recent Blogs ఈ సంవత్సరం బోఇసి తెలుగు అసోసియేషన్ వారు శ్రీ ఖర నామ ఉగాది పండుగ ఉత్సవం అమెరికా లోని బోఇసీ నగరం లో April 16న ఘనంగ నిర్వహించారు. ఈ సంబరాల లో సుమారు రెండు వందల మంది బోఇసీ తెలుగు సభ్యులు ఉత్సాహము గా పాలుగోన్నారు. ఈ వేడుకల లో మన తెలుగు వారు వివిధ రంగాలలో తమ కళలను ప్రదర్శించారు. ఇందులో ముఖ్యముగా హాస్య నాటికలు, భరతనాట్యం, టాలీవుడ్ డాన్సులు, మధుర గీతాలు, కవి సమ్మేళనం ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టు కొన్నాయి. విశేషముగా అమెరికా లోని చిన్నారులు చక్కటి తెలుగు ఉచ్చారణ తో మాట్లాడిన విధానం మన తెలుగు వారిని గర్వ పడేలా చేసింది.
ఈ కార్యక్రమం లొ భాగంగా పూల అలంకరణ పోటీ, వివిధ రకాల రుచులతో నూరూరించే విందు, పిల్లల ఆటలు, మరెన్నో కార్యక్రమాలు ఎంతో సరదాగా, సంబరంగా సాగిపోయాయి. ఈ సంస్కృతిక కార్యక్రమం విజయవంతం గ జరగటానికి కృషి చేసి, పిల్లలకి, పెద్దలకి నటన, నృత్య గీతాలు నేర్పించిన నీరజ కుసుమ, తరంగిణి ఆదిమూలం, పద్మ తనికెళ్ళ, సౌజన్య బొల్లు, రవికుమార్ మద్దిపుడి, సిరిష బొమ్మ, శ్రీకాంత్ తనికెళ్ళ లను మోమెంటోలతో సత్కరించారు.
అనంతర కార్యక్రమంలో, బోఇసీ తెలుగు అసోసియేషన్ వారి ముఖ్య ఉద్దేశం గురించి అధ్యక్షులు రాజశేఖర్ జూలకంటి గారు మాట్లాడుతూ "తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను, గొప్పదనాన్ని గుర్తుకు తెచ్చుకుని, మన పిల్లలతో పంచుకోవటమే బోఇసీ తెలుగు అసోసియేషన్ వారి ముఖ్య ఉద్దేశం" అని తెలిపారు. ఈ ప్రయత్నం లో భాగంగానే తెలుగు బడి ని బోఇసీ లో త్వర లో ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. అటుపిమ్మట జరిగిన పరిచయ కార్యక్రమం లో అసోసియేషన్ ఉపాధ్యక్షులు హరి విన్నమాల, కార్యదర్శి సంతోష్ కుసుమ, కోశాధీకరి గౌరీ దామర్ల ని పరిచయం చేసారు. బోఇసీ తెలుగు అసోసియేషన్ వారు ఈ సభా కార్యక్రమాని కి విచ్చేసిన అందరకి ధన్యవాదాలు తెలుపుతూ, వచ్చే సంవత్సరం మరింత వైభవముగా, మరిన్ని కార్యక్రమాలతో ఉగాది జరుపుకోవాలని ఆశిస్తు వేడుకలని ముగించారు
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|