Active Blogs | Popular Blogs | Recent Blogs
తెలంగాణ బిడ్డ
అన్నీ నేర్చిండు
ఒక్క
బతకడం తప్ప
యెదయెదన
కొల్వై వున్న
వెంకన్నకి
కోటికోటి దండాలు
ఏ దిక్కు వెదకినా
దక్కేవాడు
ఏ దిక్కులేని వరికి
వాడే అందరిదిక్కు
సవతుల పోరులో
శ్రీ పతియైనా
ఉమాపతియైనా
ఓటమిగాక తప్పదు
నిరాదరణకి గురైతే
ప్రేమాభిమానాలు
సైతం
సన్నగిల్లుతాయి
అవినీతి అంటుకుంది
పిలవాల్సింది
ఫైరింజన్ ని కాదు
అన్నాహజారేని
కుప్పలు తెప్పలుగా
అప్పులు జేసి
తప్పతాగి చస్తున్నారు
ఎందుకీ ఋణమేళాలు
పనిచేయని
మేధావికన్నా
పనిచేసే
మూర్ఖుడు మిన్న
జీవన విధానం
సక్రమమైతే
జీవితం
సార్ఠకమౌతుంది
పుట్టుక అనేది
శాపమైతే
చావనేది
ఓ వరమౌతుంది
మైక్రోఫైనాన్స్
పుణ్యాన
కోరికలు
గుర్రాలయ్యాయి
భావనాప్రపంచం
కవిత్వమౌతే
మినీకధ మాత్రం
ఓ విశాల ప్రపంచం
స్నేహం
తోడైతే
విజయం
నీడలానిలుస్తుంది
కలసుంటే
కాపురం బృందావనమే
కలహిస్తే మాత్రం
కొంప కొల్లేరే.
చెప్పే స్థాయిలో
లేకున్నా
చెప్పీంచుకునే స్థితికి
దిగజారొద్దు
కటువుగా వుండే
ప్రెయసికన్నా
చిరునవ్వు చీందించే
రాక్షసి నయం
నిస్వార్థ చర్యలేవైనా
మనిషిని
ఉన్నత స్థితికి
చేరుస్తాయి.
క్షమిస్తే
అందరూ నీవారవుతారు
క్షోభపెడ్తె
అందర్లో ఒంటరివైతావు
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|