మాయాబజార్ చిత్రం నందమూరి తారకరామారావు గారిని వెండితెర కృష్ణుడిని చేసిన చిత్రంగా చరిత్రలో నిలిచిపోయింది. అంతకుముందు
సొంతవూరు అనే చిత్రంలో కృష్ణుడిగా కనబడినా అది కొంచెం సేపే అవడం వల్ల ప్రజల్లోకి అంతగా చొచ్చుకుపోలేదు. అయితే
మాయాబజార్
కృష్ణుడు అంత సులువుగా తయారుకాలేదు. ఆ వేషం, ఆహార్యం అంత అందంగా
రూపొందడానికి ముందు ఎంతో కసరత్తు జరిగింది. కళాదర్శకుడు మా. గోఖలే గారి
పర్యవేక్షణలో ఎందఱో కళాకారులు అనేక రేఖాచిత్రాలు గీసారు. అందులో సింహభాగం
విజయా సంస్థకు ఆస్థాన కళాకారుడైన కళాధర్ గారు గీసినవి. చక్రపాణి గారి
నేతృత్వంలోని పెద్దలు అవన్నీ పరిశీలించి చివరగా ఒక నిర్ణయానికొచ్చి
కృష్ణునికి అంత అందమైన రూపాన్ని తీసుకొచ్చారు. అందుకే ఆ కృష్ణుడే తెలుగు
వారి మనస్సులో నిలిచిపోయాడు.
....... ఇక అసలు విషయం
ఇక్కడ చదవండి.
http://sirakadambam.blogspot.com/2011/06/blog-post_7213.html