Active Blogs | Popular Blogs | Recent Blogs
నాన్నగారు - మూర్తీభవించిన వ్యక్తిత్వం
నాన్నగారు - ఈ పదం ఊహ తెలిసిన దగ్గర్నుంచి ప్రతి ఒక్కరికీ తెలిసిన పదమే ! ప్రతి ఒక్కరి జీవితంలో మొదటి అనుబంధం అమ్మతోనైతే రెండవ అనుబంధం తప్పనిసరిగా నాన్నతోనే ! మన జీవితాన్ని తీర్చిదిద్దడంలో ఇద్దరి పాత్రా సమానమైనదే ! నవమాసాలు మోసి జన్మనిచ్చేది అమ్మ అయితే ఆ జన్మకు పరిపూర్ణమైన రూపమిచ్చేది నాన్న. అయితే చాలామందికి ఆమ్మ దగ్గరున్న చనువు నాన్న దగ్గర వుండదు. ముఖ్యంగా మగపిల్లలకి. నిజానికి వాళ్లకి తండ్రి ఒక రోల్ మోడల్. ఆయన్ని అనుకరించాలని చిన్నతనంలో ప్రయత్నిస్తారు కూడా !
మా నాన్న దగ్గర మాకంత చనువు ఉండేది కాదు. ఆయనంటే కొంచెం భయం కూడా ఉండేది. అలాగని ఆయనేమీ కర్కోటకుడు కాదు కానీ కొంచెం సీరియస్ గానే ఉండేవారు. అధ్యాపక వృత్తిలో వుండడం వల్లనో, అభిరుచి వుండడం వల్లనో ఎక్కువ సమయం చదువుకే కేటాయించేవారు. మాతో గడపడానికి కేటాయించిన సమయం తక్కువ కావడమే మాకు అంత చనువు ఏర్పడకపోవడానికి కారణం. కొన్ని నియమాలకి, సిద్ధాంతాలకి కట్టుబడి ఉండేవారు.
........................... అంతర్జాతీయ పితృ దినోత్సవం సందర్భంగా తండ్రులకూ, వారిని గౌరవించే పిల్లలకూ శుభాకాంక్షలతో ప్రత్యేక వ్యాసం ఇక్కడ చదవండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|