రానున్నది ప్రజారాజ్& in arza prasad at TeluguPeople.com - Telugu Community Portal. Social Networking, Chat, Blogs, Classifieds, Videos, Photos, Galleries, Bollywood, Movies, Hyderabad, Visakhapatnam, Tirupati, Vijayawada, Guntur, Warangal, Kakinada, Kadapa, Kurnool, Rajahmundry and lot more...
TeluguPeople
  are the trend-setters

Active Blogs | Popular Blogs | Recent Blogs

venkata vara prasad arza's Blogs >> arza prasad

రానున్నది ప్రజారాజ్&


మనం అందరం పడిన శ్రమకు ఫలితం అశాజనకంగానే వుంటుంది తప్ప నిరాశకు గురిచేయదు అందుకు ముఖ్య కారణం చిరంజీవిని ఆయన పేరుని వాడుకుని రాజకీయాల్లో బతకాలనుకున్న వారికంటే వారి ఆశయాలను గౌరవించి అందుకు నిస్వార్ధంగా శ్రమించినవారే అధికం. ఇది కాదని ఎవరైనా అనగలరా! ఎందరో బడా బడా నాయకులు, వ్యాపార వేత్తలు చిరంజీవి అధికారం లోకి వస్తే తమ ఆటలు సాగవని గ్రహించి అసలు ప్రజారాజ్యం పార్టీనే స్థాపించకుండా వుండేందుకు పన్నిన కుట్రలు అనంతరం పార్టీకి ప్రజారాజ్యం పేరు రాకుండా చేసేందుకు అది కూడా సాధించిన తర్వాత కనీసం ఎన్నికల గుర్తు రైలింజను రాకుండా చేసేందుకు ఎన్ని కుతంత్రాలు పన్నారో మనకు తెలియనిది కాదు. ఏది ఏమైనా తను అనుకున్నది సాధించే అంతవరకు ఎన్ని పోరాటాలకైనా చిరంజీవి సిద్దపడతాడని సదరు పెద్దలకు తెలియదు. చివరకు ఇక తమ ఆటలు సాగవని గ్రహించి స్వార్ధరాజకీయ స్వలాభాపేక్షతో ప్రజారాజ్యం లోకి ప్రవేశించిన పరకాల వంటి వూసరవెల్లులను అడ్డంపెట్టుకుని చిరంజీవిని, ప్రజారాజ్యాన్ని అల్లరి పాలు చేయాలని ప్రయత్నించారు. చివరుకు నియోజక వర్గాల్లో సైతం మనలో మనకు విభేధాలు కలిపించి ప్రజారాజ్యాన్ని చిన్నా భిన్నం చేయసంకల్పించారు. ఈ పనిలో శత్రువర్గాలు కొంత మేరకు విజయం సాధించాయని చెప్పక తప్పదు. అందుకు కారణం మనకు చిరంజీవి పై వున్న అపారమైన అభిమానం ఇది మన బలహీనత దీనినే వారు తమ స్వార్ధానికి వినియోగించుకుని ప్రజారాజ్యం నాయకులకు, చిరంజీవి అబిమానులకు మధ్య అగాధాలను నెలకొల్పకలిగారు. ఇప్పటికైనా వాస్తవాలను మనం గ్రహించకలగాలి. అభిమానానికి అర్ధం స్వార్ధం కారాదు. రాజకీయాలు వేరు, అభిమానం వేరు మనలో ప్రతి ఒక్కరికి చిరంజీవి చేస్తున్న సామాజిక న్యాయ పోరాటం లో పాలు పంచుకోవాలని వుంటుంది ఇది ఎవరూ కాదనలేని నగ్న సత్యం. అయితే ముందుగా మనం రాజకీయ పరిపక్వత కలిగి వుండాలి అందుకు తగిన అనుభవం గడించాలి. ఇందుకు కొంత సమయం, అనుభవం సంపాదించాల్సి వుంటుంది కదా! అప్పటి దాకా అనుభవం కలిగిన నాయకుల అవసరం వుందని గ్రహించి తదనుగుణంగా ఇకనుండైనా అనుభవం కలిగిన నాయకులను గౌరవిస్తూ మన ముందు కార్యక్రమాలకు బాటలు వేద్దాం, ముందు తరాలకు మనం దిక్శూచిలుగా మారదాం. చిరు ఆశయాలు సఫలీక్రుతం చేసేందుకు మనవంతు సహకారాన్ని అందిద్దాం. ఇదే ఇదే నిజమైన అభిమానిగా ప్రజారాజ్యానికి మనం చేయకలిగిన మేలు. ఇందుకు ఎన్ని అడ్డంకులనైనా దాటుదాం, ఎంతటి వారినైనా ఎదిరిద్దాం, నిజమైన ప్రజారాజ్య స్థాపనే ధ్యెయంగా ముందడుగు వేద్దాం! రానున్న ఎన్నికల ఫలితాలు ప్రజారాజ్యవిజయానికి అనుకూలంగా వస్తున్నాయి కనుక మనం మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి వుంది. మంత్రి పదవుల పంపిణీ మొదలుకుని అన్ని వ్యవహారాలలో మన అధినేత అచి తూచి నిర్ణయాలు తీసుకోవాలి అందుకు ఎంతో పరిశ్రమించాల్సి వుంటుంది, ఎన్నో, ఎన్నెన్నో ఒత్తిడులు ఎదుర్కోవాల్సివుంది, కనుక అభిమాన మిత్రులారా ఇటువంటి సమయం లో మనం చిరుకి మరిన్ని కొత్త సమస్యలు కలిపించక గతం లో వలె మేము సైతం అంటు ఆయనకు మరింత ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిపించి ప్రజారాజ్య స్థాపనకు, సామాజికన్యాయానికి, నూతనరాజకీయఒరవడులకు శ్రీకారం చుడదాం. మే నెల పదహారు దాకా ఓపిక పడదాం ఈ లోగా ఎందరు ఎన్ని విశ్లేషణలు చేసినా, ఎంత కాకిలెక్కలు చెప్పిన వినవద్దు, నమ్మవద్దు, మనం నమ్మాల్సింది ప్రజలను ఆ ప్రజలు ఇచే తీర్పుని, అంతకుమించి అధినేత మాటలను మాత్రమే! ఏ స్వార్ధం లేకుండా తనపై ప్రజలు చూపించిన అపారమైన అభిమానానికి పాత్రుడైన మెగాస్టార్, ఎంతో కొంత ప్రజలకు మేలు చేసి తన రుణం తీర్చుకోవాలన్న ఒకేఒక్క నిశ్చయంతో స్థాపించినదే ప్రజారాజ్యం, ఇంతటి మహదాశయంతో ఎన్నికల బరిలో దిగిన ప్రజారాజ్యానికి విజయం తధ్యం. అపోహలు అనుమానాలు వీడి విజయభేరి మ్రోగించేందుకు సిద్దం కండి!



 
Be first to comment on this Blog Post!
 



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.