Active Blogs | Popular Blogs | Recent Blogs జనబలం ముందు ధనబలం ఆటలు సాగకపోవడం తో అధికారపక్షం చివరకు ఎంతకు దిగజారుతుందో తిరుపతి సంఘటన అద్దం పడుతుంది. తను పోటీ చేస్తున్న నియోజకవర్గం లో కూడా చిరంజీవిని కార్యకర్తలతో కలవనివ్వకుండా చేసేందుకు అధికారపక్క్షం పన్నుతున్న కుట్ర చూస్తుంటే పోలింగు జరుగకుండానే ఓటమి భయం పట్టుకుందని అర్ధమవుతుంది. ప్రజాభిమానం ముందు ధనబలం పనిచేయకపోవడంతో, చివరకు అంగబలంతో దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఇది క్షమించరాని అపరాధం కాదా! ప్రశాంత వాతావరణం లో ఎన్నికలు జరపడం కాంగ్రెస్ నైజం కాదని ఈ సంఘటన మరోమారు నిరూపించింది. ఫ్యాక్షన్ రాజకీయాలకు తిరుపతి వెంకన్నకు కూడా మినహాయింపు లేకుండా చేసిన ఘనత కాంగ్రెస్ వారిదే. ప్రపంచ ప్రశిద్ది గాంచిన తిరుపతి బాలాజీ పవిత్రతకు భంగకలిగేలా ప్రవర్తించడం దేశ ప్రజల మనుగడకె ప్రమాదకరం. కనుక దయచెసి కాంగ్రెస్ నాయకులారా అధికారం కోసం అర్రులు చాచక నిర్భయంగా ప్రజాతీర్పు కోరండి! అంతేకానీ ప్రజల ముందు భగవంతుని ముందు తప్పులు చేసి భగవంతుని ఆగ్రహానికి, ప్రజల చీత్కారానికి బలి కాకండి! ఏ తప్పూ చేయని చిరంజీవిపై లెని పోని బురద చల్లాలని ప్రయత్నించి భంగపడకండి! కనీసం మానవులుగానన్న మిగలండి! అవినీతిని ఎదుర్కోవాలంటే అందుకు ఎంతో అత్మస్థైర్యం కావాలి అది మెండుగావున్న చిరంజీవిని ఆపాలనుకోవడం మండేసూర్యుడ్ని తాకాలను కోవడమేనని గ్రహించండీ. చిరు అభిమానులారా! ఇలాంటి అవాంతరాలు చిరుకి కొత్త కాదు, మనకి కొత్త కాదు ఇప్పటి వరకు మనం రాజకీయనాయకులను చూసినది నాణేనికి ఒక వైపే అయితే ఇప్పడు చూస్తున్నది నాణేనికి రెండోవైపు అదే అధికార వ్యామోహం అందు కోసం ఎంతకైనా తెగిస్తారు. ఎంతటి దారుణానికైనా తెగపడతారు కనుక మనమందరం ఐక్యంగా వుందాం అవినీతిపరుల గుండెల్లో రైళ్ళు పరిగెట్టిద్దాం! చిరు బలం ప్రజాబలం ఎంతటి మహోన్నతమైనదో నిరూపిద్దాం! అయ్యా!అమ్మా! ఓటరు దేవుళ్ళారా! ఉచిత కలర్ టీవీ లకు, బిచగాళ్ళ మాదిరి నెలసరి బిక్క్షానికి ప్రలోభపడక నిజాయితీగా ప్రభుత్వం నుండి మనకు రావలసిన హక్కులను, రాయితీలను పొందాలంటే ప్రజారాజ్యాన్ని బలపరచాలి, చిరంజీవిని ముఖ్యమంత్రిని చేయాలి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|