Active Blogs | Popular Blogs | Recent Blogs సెవేన్ లింగ్
~~~~ బొల్లిముంత వెంకట రమణా రావు
ఒంటికన్ను రాక్షసి!
మా కిటికీ తలుపు తెరిచినప్పుడు
బుల్లితెర ధారవాహికలా వుంటుంది
అది అనంత పాత్రల కధనం.
సందడిగాను, సరదాగాను వుంటుంది
ఒకొక్కసారి చిరునవ్వులా గాలి తెర నన్ను తాకుతుంది
నేను కిటికీ కంటి రెప్పలు మూసేవరకు.
కిటికీ ఫ్రేం ఓ అందమైన దృశ్య కావ్యం
సెవేన్ లింగ్
ఈ ప్రక్రియను తొలిసారిగా అన్న అఖ్మతోవా అనే కవి పరిచయం చేయడం జరిగింది.
ఈ ప్రక్రియ నిర్మాణం ఏడు పంక్తులతో ముడి పడి వుంటుంది - ఇది మూడు భాగాలుగా విభజనతో వుంటుంది. మొదటి రెండు భాగాలు మూడేసి పంక్తులుగాను, చివరి భాగం ఒక పంక్తితో ముగింపు వాక్యంగా సెవేన్ లింగ్ కవితా భావన సారాంశాన్ని తెలియ పరుస్తుంది.
మొ దటి మూడు పంక్తులు ఒకే విషయం లేదా అందుకు విరుద్దమైన భావం కలిగి వుండవచ్చు
నాలుగు నుండి ఆరు పంక్తుల వరకు పై వస్తువుకు అనుగుణంగా దానితో సంబంధము కలిగివుండాలి వస్తువులోని విషయం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా దానిలో విషయం వ్యక్తపరచాలి
చివరి వాక్యం ( ఏడవ పంక్తి) పూర్తి సారంశాన్ని ప్రతిబింబిచేలా వుండాలి. ఈ ప్రక్రియలో ఎలాంటి నియమ నిబంధనలు లేవు.
దీనికి సామాన్యంగా శీర్షిక వుండదు. నా సౌలభ్యం కోసం వ్రాయడం జరిగింది.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|