Active Blogs | Popular Blogs | Recent Blogs జెమిని టీవీలో వంటల కార్యక్రమాన్ని చూశాను. అందులో కార్యక్రమ వ్యాఖ్యాత పేరు తెలియదు ఆవిడ ఎవరో ఇద్దరు కొత్త వంటగత్తెల తో కొత్త రకం వంటలని వండించారు. ఆ లంగరమ్మ (anchor) వారిని అడిగి ఒక వంట చేయించిన తీరు ఈ విధంగా ఉంది. మీరేమి వంట చేస్తారు అని అడిగితె ఆ ఇద్దరిలో ఒక వంట గత్తె చెప్పినది మష్రూమ్, కాప్సికం మసాలా కర్రీ. అంటే పుట్ట గొడుగులు, బుంగ మిర్చి మసాలా కూర. ఇంక ఆవిడ చేసేటప్పుడు ఆవిడ భాషా పాండిత్యం చూడాలి కొన్ని మష్రూమ్స్ ని, ఆ తర్వాత కాప్సికంని పీసెస్ చేయండి. ఆ నెక్స్ట్ వన్ బౌల్ తీసుకోండి. అందులో సమ్ ఆయిల్ అంటే వన్ టేబుల్ స్పూన్ వేసి హీట్ అయ్యాక గార్లిక్స్, జింజర్ పేస్ట్ వేసి మరి కొంత టైం ఫ్రై చేయాలి నెక్స్ట్ సం (some) గసగసాలు, దాల్చిన చెక్క, పెప్పర్ మిక్సీ లో వేసి పేస్ట్ తయారు చేసి దానిలో వాటర్ ఏడ్ చేయండి. నెక్స్ట్ అందులో ముందుగా కట్ చేసిన మష్రూమ్, కాప్సికం వేసి మరికొంత సేపు ఫ్రై చేయండి. ఇప్పుడు, మష్రూమ్, కాప్సికం మసాలా కర్రీ రెడీ.
ఈ కూర చేసే విధం ఎలా ఉన్నా ఇందులో తెలుగు భాష ఎంత ఉందొ ఆలోచించండి. ఆ లంగరమ్మ మధ్యలో ప్రకటనల కోసం విరామానికి, ఆవిడ భూన భోనాంతరాలు బ్రద్దలయ్యేలా ఆ వంటగత్తెలతో పాటుగా నౌ లేట్ అజ్ టెక్ ఏ స్మాల్ బ్రేక్ అని అరుపులు ఒకటి మీకు ఉచిత ప్రదర్శన. మన లంగరమ్మలు వారు పిలిచే అతిథులు తెలుగులో కనీసం పట్టుమని ఐదు నిముషాలు తెలుగులో మాటలడలేని స్థితిలో ఉన్నారు. పైగా తాము మాట్లాడేది తెలుగు అని నమ్మ మంటారు. కాస్తో, కూస్తో ఆంగ్లం చదువుకొన్న నాకే ఏమీ అర్థ కాక ఆ కార్యక్రమాన్ని చూసీ నోరు వెళ్ల బెట్ట వలసిన పరిస్థితి దాపురిస్తే మిగిలిన అంతంతమాత్రంగా చదువుకొన్న వారి పరిస్థితి ఏమిటి? పోనీ ఆ మాట్లాడే అతిథి గారేమన్నా ఆంగ్లభాషలో పండితులా అంటే అది కూడా ఐదు నిముషాలు తప్పులు లేకుండా మాట్లాడలేని స్థితి. ఎందుకు మనం మన అచ్చ తెలుగు భాషని అన్య భాషా పదాలతో ఖూనీ చేయడం? అయ్యా, టీ వీ వ్యాఖ్యాతలు మరియు అందులో పాల్గొనే ఔత్సాహికులారా మీ మిడిమిడి భాషా పరిజ్ఞానముతో ప్రేక్షకులని చంపకండి. ఈ విధమైన భాషా దారిద్ర్యం ఒక్క జెమినీ టీ వీ కె పరిమితం కాదు. అన్ని చానెళ్ళు అలాగే తగులబడ్డాయి. ఈ లంగరమ్మలు, లంగరయ్యలకు తెలుగూ రాదు. ఆంగ్లమూ రాదు. పైగా దీనికి తోడు మధ్య మధ్య లో హిందీ ముక్కలు పేలడం ఒకటి. ఈ మాతృ భాషలో మాట్లాడేటప్పుడు నా భార్యా పుత్రికలూ మినహాయింపు కాదు. వాళ్లు కూడా ఏ భాషలోనూ పట్టుమని పడి నిమిషాలు లేదా పది వాక్యాలు మాట్లాడలేరు.
చక్కటి తెలుగు మాట్లాడగలిగిన టీవీ వ్యాఖ్యాతలలో ఒక ఝాన్సీ గారు, ఒక ఉదయ భానుగారు, మలయాళం మాతృభాష ఐనా తలుగు చక్కగా సంభాషించే ఒక సుమ గారు కానీ వారి భాషని చూస్తే ముచ్చట వేస్తుంది. వీళ్లు కూడా అప్పుడప్పుడు ఆంగ్ల పదాలని ఉపయోగిస్తూ ఉంటారు కానీ మిగిలిన వారి కన్నా నయం. ఈ టీ వీ చానెల్స్ లో తెలుగు భాష కాస్త చక్కగా వినిపించేది దూరదర్శన్ వారి తెలుగు చానెల్, ఏ టీ వీ వారిని చూసీ ఇతర చానెల్స్ వారు భాషా పరంగా నేర్చుకోవలసినది చాలా ఉంది.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|