Active Blogs | Popular Blogs | Recent Blogs ఎవరైనా కాశీకి వెళ్లి తమకిష్టమైన పండుని మరియూ కాయగూరని వదిలేస్తారు. కానీ మన కాకతీయ విశ్వవిద్యాలయ ఆచార్యులూ, విధులు ఎగ్గొట్టి, విద్యార్థులకు బస్సులు తగలేయడం ఎలా, ఎదుటివారిని తన్నడం ఎలా అనే వీరోచిత విద్యలలో తర్ఫీదునిచ్చే ఆచార్య కోదండ రామ రెడ్డి గారు కాశీ కి వెళ్ళకుండానే తమ పేరు చివరన రెడ్డి అనే పదాన్ని త్యాగం చేసారు. ఎవరైనా ధనాన్ని త్యాగం చేస్తారు లేదా ఏదైనా ఉద్యమానికి పొట్టి శ్రీ రాములు గారి లాగా ఆమరణ నిరాహార దీక్ష పేరుతొ ఆత్మ త్యాగం చేస్తారు లేదా మన తెలంగాణా వాదులు చెప్పుకొన్నట్లుగా 600 మంది ఆత్మ త్యాగాలు చేసారు అని చెప్పడం విన్నాను. కానీ, నేను నా ఉద్యోగాన్ని త్యాగం చేయను, కానీ నా పేరు చివరన ఉన్న రెడ్డి అనే పదాన్ని త్యాగం చేసాను అనే అతి మేధావి మరియూ అతి పిన్న వయసులో (50 +) డాక్టరేట్ అయిన ఆచార్య వర్యులు శ్రీ కోదండ రామ రెడ్డి గారు. ఆయనని నేను ప్రొ.కోదండ రామ రెడ్డి అని సంబోధించినందులకు నా తెలంగాణా మిత్రులు నామీద అలుక వహించి నీవు మా కోదండ రాం సర్ ని అవమానిస్తున్నావు అని తిట్టిపోశారు. ఈయనకి శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య గారు ఆదర్శం. శ్రీసుందరయ్యగారు తన కుల సంకేతాన్ని రెడ్డి అనే పదాన్ని త్యాగం చేసారు అంతే కాదు బిడ్డలు పుడితే దేశ సేవ చేయలేనని పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకొన్న మహానుభావుడు అంతే కాదు తన కున్న వ్యవసాయ భూమిని కమ్యూనిస్ట్ పార్టీ కోసం, తాను నమ్మిన సిద్ధాంతాల కోసం త్యాగం చేసిన మహా వ్యక్తి ఆయన. ఆయనని చూసి ఆ త్యాగ గుణాన్ని నేర్చుకోవలసినది పోయి నా పేరులో ఉన్న రెడ్డి అనే పదాన్ని త్యాగం చేసాననడం హాస్యాస్పదం. ఇక్కడ నాకొక సందేహం, స్వాములవారి వద్ద త్యాగం చేయడానికి ఏమీ లేక తన గోచీ గుడ్డని త్యాగం చేసినట్లుగా మన ఆచార్యులు ముద్దసాని కోదండ రామ రెడ్డి గారు రెడ్డి అనే పదాన్ని త్యాగించినట్లుగా ఉంది. అయ్యా కోదండ రామ రెడ్డి గారు, మీరు మీ పేరులోని రెడ్డి పదాన్ని త్యాగం చేయక పోయినా వచ్చే నష్టం ఏమీ లేదు. మీరు ఇతరుల ప్రాణ త్యాగాలకు పాల్పడే విధమైన ప్రకటనలు చేయకుండా ఉంటే అంతే మంచిది.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|