Active Blogs | Popular Blogs | Recent Blogs
మన తెలుగు చిత్రాలలో శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు పాత్రధారుల మేకప్ చూస్తే వాంతి వచ్చేలా ఉంటొంది. పూర్వం నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి సమయంలొ రాముడు, కృష్ణుడు పాత్రలు వేసేటప్పుడు నలుపు తెలుపు చిత్రాలలోవారికి వేసిన రంగు తెలిసేది కాదు. కానీ రంగుల చిత్రాలు వచ్చిన తరువాత కూడా వెగటు కలిగించేది కాకుండా కొద్ది మొత్తంలొ మాత్రమె ఆయన నీలం రంగు వెసుకొనేవారు. కానీ, నేటి చిత్రాలలోని పాత్రధారులకు వేస్తున్న నీలం రంగుని చూస్తె అంతర్వెది తీర్థంలొ ముష్టి కృష్ణుడు, పగటి వేషాలు వేసే రాముడుని తలపిస్తూ పరమ రోతగా ఉంటున్నారు. ఈ విషయంలొ స్వర్గీయ తారక రామారావు గారి పుత్రుడు శ్రి బాలకృస్ణ కూడా మినహాయింపు కాదు. నేను ఈ బ్లాగు రాయడానికి కారణం ప్రస్తుతం విడుదలకు నోచుకోబోతున్న శ్రీ రామ రాజ్యం చిత్రం లో శ్రీ బాలకృష్ణ గారి శరీరానికి పూసిన రంగు. అసలు రాముడు లేదా కృష్ణుడు పాత్రధారులకి నీలం రంగు ఎందుకు పూయాలి? నీల మేఘశ్యముడు అంటే నీలం రంగు పరమ రోతగా పూసుకొని తిరగడమేనా? నాకు తెలిసినంతవరకూ శ్రీ రాముడు లేదా శ్రీ కృష్ణుడు ఇరువురూ నీలమేఘులే. నీలము అంటే చామన ఛాయ కంటే కొంచెం రంగు తక్కువ అది నలుపు రంగులొకి వస్తుంది. అంటే ఇరువురూ నల్లని వారే కానీ నీలం రంగు వారు మాత్రం కాదు. దీనికి ఒక ఉదాహరణ ఒక సినిమాలొని పాట లో శ్రీ కృష్ణుడు ని ప్రార్థిస్తూ ' కన్నయ్యా, నల్లని కన్నయ్యా' అని ఉంది. అందుచేత మన సినిమాలలొ ఆ పాత్రలని నీలం రంగుతొ నింపి ప్రజల ప్రాణాలు తీయకుండా ముఖానికి కాస్త మామూలు రంగు రంగు వేస్తే మంచిది. అయ్యా దర్శకులారా మీ దర్శకత్వ పైత్యంతో, అంత డొకు వచ్చే నీలం రంగుతొ మీ నాయకులని నింపవద్దని మనవి.
 Ravindranath Rallabhandy | Thank you very much Krishna Murthy gaaru. The obscenes are being shown as comedy in today's movies. It is also to be controlled.
Posted at: 25, Sep 2011 3:19 AM |  KRISHNA MURTHY RAYACHOTY | waav... correct gaa chepparu ravindranath garu. kevalam ilanti rangule kaakunda, konni saanghika chitraalalo pradrsinche pouraanika "antharnaatakaalalo" vidodam perita vekili hasyam tho apahaasyam choopisthunnaaru. mee blag sandesham kontha mandi kaina kanuvippu kaavaali. thanks.
Posted at: 18, Sep 2011 12:13 PM |
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|