మెగా రైలు దూసుకు వస్Ķ in arza prasad at TeluguPeople.com - Telugu Community Portal. Social Networking, Chat, Blogs, Classifieds, Videos, Photos, Galleries, Bollywood, Movies, Hyderabad, Visakhapatnam, Tirupati, Vijayawada, Guntur, Warangal, Kakinada, Kadapa, Kurnool, Rajahmundry and lot more...
TeluguPeople
  are the trend-setters

Active Blogs | Popular Blogs | Recent Blogs

venkata vara prasad arza's Blogs >> arza prasad

మెగా రైలు దూసుకు వస్Ķ

మెగా రైలు దూసుకు వస్తుంది! ప్రజా స్టేషన్ లో గణ గణ మని గంట మ్రోగింది !
ప్రజావాణి అన్నౌన్సుమెంట్ వినపడుతుంది !!
"ప్రయాణికులకు విజ్ఞప్తి శ్రీకాకుళం నుండి కడప మీదుగా హైదరాబాద్ చేరు మెగా రైలు ప్రజా ప్లాట్ ఫాం పైకి మరి కొద్ది క్షణాలు లో వచ్చును" అని
ప్రజలు అందరి ముఖాలలో ఉద్వుగ్నిత ,ఉత్సాహం ! అవును మరి చాలా కాలం గా ఇలాంటి మెగా రైలు కోసం వారు ఎదురు చూస్తున్నారు.
ఇదివరకు గతుకుల రోడ్ల అతుకుల సైకిల్ పై ప్రయాణించి ఒళ్ళు హూనమై పోయింది బాబు!
ఇప్పుడేమో చెయ్యి ఊపుతూ హెలికాప్టర్ లో చెక్కర్లు కొట్టే వాడే కాని బ్రతుకు ప్రయాణం లో చేదోడు వాదోడు గా ఉండేవాడు కరవై పోయాడు.
అందుకే ఈ మెగా రైలు కోసం ఇన్ని ఎదురు చూపులు.
మరి ఈ మెగా రైలు విశేషాలు ఏమిటో చూద్దాం.
ఈ మెగా రైలు కు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.
భారత్ దేశం లోనే ఇది పొడువైన రైలు .
ఇది 294 బోగీ లు తో హైదరాబాద్ వరకు మరో 42 ప్రత్యేక బోగీ లతో హైదరాబాద్ నుండి ఢిల్లీ వరకు ప్రయాణిస్తుంది.
ఈ మెగా రైలు ఎక్కేవారు టికెట్ కొనవలిసిన అవసరం లేదు .అలాగని ఎవరు పడితే వారు వారు ఎక్కటానికి వీలుకాదు .ప్రజలు తమకు నచ్చిన వారికి పాస్ రాసి ఇస్తారు వాళ్ళు మాత్రమే ప్రయాణానికి అర్హులు.
ఈ మెగా రైల్ లో రిజర్వేషన్ లు ఉండవు. ప్రయాణికులు అందరిని సమానం గానే పరిగణిస్తారు. అందరి సీట్లు ఒకేలా ఉంటాయి జనరల్, స్లీపెర్, ఎ.సి అనే తేడాలు ఉండవు!
ఈ మెగా రైలులో మరో ప్రత్యేకత ఏమిటంటే బోగిలలో కేవలం సీట్లు మాత్రమే ఉంటాయి. పడుకోవటానికి బెర్తులు అస్సలు ఉండవు. ఎందుకంటే వీరికి ప్రజలు పాస్ ఇచ్చింది పడుకోవటానికి కాదు కదా ! ఎప్పుడు మెలకువు గా ఉండాలి మరి !
ఈ మెగా రైలు ఎలా నడుస్తుందో తెలుసా ?
మార్పు ,సామాజిక న్యాయం ఈ మెగా రైలు కు రెండు వైపులా చక్రాలు గా
ప్రజా రాజ్యం రూటు లో ప్రేమే లక్ష్యం గా సేవే మార్గం గా నడుస్తుంది !
ప్రజలందరినీ సురక్షితం గా గమ్యానికి చేర్చే ఈ మెగా రైలు కు నమ్మకమైన డ్రైవర్ ఉన్నాడు .ఆయనే పద్మభూషణ్ డా .చిరంజీవి. అయన ప్రక్కనే పవన్ కళ్యాణ్ అసిస్టెంట్ గా ఉంటాడు. వెనక నుండి ఎవడు వెన్నుపోట్లు పొడవకుండా అల్లు అరవింద్ గార్డ్ గా ఉన్నాడు.
ఇక నాగబాబు సారధ్యం లో మిత్ర ,పరకాల వంటి చాల మంది ఆర్ పి ఎఫ్ దళం ఈ మెగా రైలు ను నిరంతరం చిల్లర దొంగలు , బంది పోట్లు బారి నుండి కాపాడుతూ ఉంటారు.
ఇంతకీ ఈ మెగా రైలుకు విద్యుత్ శక్తి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా ?
6000 మెగా వాట్ల ఉత్పతి చేసే మెగా పవర్ ప్లాంట్ నుండి!
అది ఎ నాడు షట్ డౌన్ కాని చిరంజీవి “అభిమానుల గుండె” నుండి !!
ఎదురు చూసిన సమయం రానే వచ్చింది. పెద్ద శబ్దం చేస్తూ మెగా రైలు ప్రజా స్టేషన్ లో కి దూసుకు వచ్చింది . ప్రజలు లో ఒకటే కోలాహలం. స్టేషన్ అంతా ప్రజల తో కిక్కిరిసి పోయింది.
ప్రయాణికులు గా మారిన ప్రజా ప్రతినిధులు ప్రజలకిచ్చిన హామీల పెట్టి బేడా తో తమ నియోజక వర్గ బోగీలు వైపుకు వడి వడి గా అడుగులు వేస్తున్నారు.
స్టేషన్ లో ప్లాట్ ఫాం మీద తోపుడు బండి వాళ్ళు ఒకటే గోల, అరుపులు.
ఆ చాయ్...చాయ్ . ఆ కాఫీ ....కాఫీ అని అరుస్తున్నారు
ఒక తోపుడు బండి అయన “తమ్ముళ్ళు ఇటు రండి ఇడ్లి ఫ్రీ, వడ ఫ్రీ, బ్రెడ్ ఆమ్లెట్ ఫ్రీ “ అని అరుస్తున్నాడు.
ఇంకో తోపుడు బండి ఆయిన “చెల్లమ్మలు మీకు రోగం వస్తే మందులు ఫ్రీ , మీరు చచ్చే దాకా భీమా ఫ్రీ” అని అరస్తున్నాడు.
ప్రజలంతా ముందు అయన వైపు అనుమానం గాను రెండో అయన వైపు భయం గాను చూస్తున్నారు .
ప్రజలు ఎందుకైనా మంచిదని దగ్గరుండి రైల్లో ఎవరి సీట్లు లో వాళ్ళని కూర్చో బెట్టి వాళ్ళ ప్రతినిధి ల తో చెప్తున్నారు ఇలా :
"ఒరే అబ్బాయి లు జాగ్రత్త గా ఉండండి! అన్ని ప్రీ అంటున్నాడని కక్కుర్తి పడి అడ్డమైన గడ్డి తింటారేమో , రోగం వస్తే మందులు ప్రీ అనుకున్నారు గనక, ఆనక బాధ పడేది మనమే. మెగా రైలు లోపల శుభ్రం గా “పాంట్రి కార్” ఉంది. వేళ కు వాళ్ళే అన్నం పెడతారు. చిల్లర తిళ్ళు తినకండి. బుద్ది గా కూర్చోండి రైల్లో ఎమైన వెదవ వేషాలు వేసారో , చిరంజీవి కి చెపుతాం...... చిరంజీవి సంగతి తెలుసుగా? రఫ్ ఆడేస్తాడు..... మాట వినక పోతే మధ్య లో దింపెస్తాడు, వెనక్కి వస్తే మేం ఊరుకోం, తన్ని తగలేస్తాం ….. జాగ్రత్త!"
ప్రజా ప్రతినిధులు బుద్దిగా తల ఆడించారు.
బొత్తి గా బేరం లేక తోపుడు బండి వాళ్ళు అంతా నీవల్లే అయింది అంటే నీవల్లే అయింది అని తిట్టు కుంటున్నారు నీకు బుద్ది లేదంటే నీకు బుద్ది లేదని కొట్టు కుంటున్నారు .
చిర్రెత్తిన చిరు రైలు ఇంజన్ హారన్ ఒక సారి “భం” అని గట్టి గా కొట్టేడు!
తోపుడు బండి వాళ్ళ రోద అంతా ఇంజన్ హారన్ హోరులో కలిసి పోయింది!!
ప్రజలు సంతోషం గా స్టేషన్ లో గంట గణ గణ మని కొట్టరు
పైన తెలుపు క్రింద ఆకుపచ్చ మధ్యలో మండే సూర్యడు ఉన్న జెండా
అరవింద్ హుషారు గా ఊపేడు !
చిరు హుందా గా బ్రేక్ వదిలేడు !!
పవన్ కసి గా అక్సిలటర్ తొక్కేడు !!!
ఒక్క ఉదుటున రైలు బయిలు దేరింది .......ప్రజా ప్రస్థానం వైపుకి!
శ్రీ శ్రీ కలలు గన్న మహా ప్రస్థానం వైపుకి !!



 
Be first to comment on this Blog Post!
 



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.