Active Blogs | Popular Blogs | Recent Blogs సమయం మించి పోతుంది, సైనికులారా కదలండి!
అతనికి రాజకీయ అవగాహనే లేదంది కాంగ్రెస్
అది ఒక కేవలం నీటి బుడగ అంది తె దా పా
మీ విదానా లేమిటి ఏమిటి అన్నారు కమ్యునిస్టులు
తెలంగాణా పై స్పష్ట త లేదు అని పెదవి విరిచారు తె రా స
ఒక్కడు ఏమి చెయ్యగలడు మేము లేకుండా అని బా జ పా
ఇదంతా సరిగ్గా ఆరు నెలల క్రితం ఆయా పార్టిలు ప్రజారాజ్యం అదినేత పై సందించిన వాగ్భాణాలు
రోజులు గడిచే కొద్ది వీళ్ళలో ఆందోళన మొదలైంది ఆయనేమంటే అదే పాట అందు కున్నారు
సామజిక న్యాయం మేము ఎప్పుడో మొదలెట్టాం అన్నారు . మార్పు అంటే ఏమిటి ఉన్నవాటిని తీసేస్తాడా అన్నారు .రాజకీయం రెండు గంటల సినిమా కాదు అన్నారు సచివాలయం ఎక్కడుందో తెలుసా అన్నారు
ఉన్న ఊరికి ఎర్ర ఏగాని ఖర్చు పెట్ట లేదు అన్నారు. కుటుంబ రాజ్యం అన్నారు ,సినిమా వాళ్ళని దింపేరు, సర్వేలు చేయించారు, అబ్బే అస్సలు ప్రజారాజ్యం ప్రభావం ఏమి లేదన్నారు ,ఉమ్మడి గుర్తు కు అడుగడుగునా అవాంతరాలుసృష్టించారు, కోవర్టులను పంపేరు ,చివరకు వక్తి గతం గా దూషించారు .
అన్ని భరించేడు అన్ని సహించేడు.అవమానాలు అవరోధాలు అతన్ని ఆపలేక పోయేయి .
సరిగ్గా అక్టోబర్ నెలలో విజయ దశమి నాడు ప్రారంభమయిన ప్రజా అంకిత యాత్ర ఏప్రిల్ నెలలో శ్రీ రామ నవమి తో ముగిసింది . ప్రజా హృదయ క్షేత్రం లో కలతిరిగాడు అహర్నిశలు కష్టపడ్డాడు అన్నిటిని అదిగమించేడు .ఎన్నికల లో విజేత గా నిలపమని ప్రజల తీర్పు కోసం వినమ్రం గా నిలబడ్డాడు .
నేను సుఖం గానే ఉన్నాను ,నాకోసం ఇంకేమి అక్కరలేదు, ఇక నా జీవితం మీ కోసం అని పదే పది సార్లు ప్రజలకు స్పష్టం గా చెప్పాడు . సెహబాష్ చిరంజీవి అని మీ చేత అనిపించుకుంటాను అని ,చరిత్ర లో మిగిలి పోతానని తన చిత్త శుద్ధిని చాటు కున్నాడు .అన్న మాట మీద నిల బడతాను అని చెప్పటమే గాకుండా చేసి చూపించాడు
అభ్యర్దులు ఎంపిక పూర్తీ అయ్యింది నామినేషన్ల పర్వం ముగిసింది మేనిఫెస్టో లు విడుదల అయ్యాయి ప్రచారాలు హొరెత్తుతున్నై. పబ్లిక్ పరీక్షలు ఈ నెల లోనే ! 16 నాడు పేపర్ I 23 నాడు పేపర్ II . మే 16 పలితాలు విడుదల అవుతాయి ఎవరు పాస్, ఎవరు ఫెయిల్ అయ్యారో తేలిపోతుంది .
ఈ లోగ అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. .అది గదిగో అక్కడ టికెట్లు అమ్మేసు కున్నారు ఇది గిదిగో ఇక్కడ వెన్ను పోట్లు పోడిచేస్తున్నారు ,అని
డబ్బు మద్యం అయితే మహంతి గారి పుణ్యమాని చాల వరకు ఈ ఎన్నికలలో నిరోదిస్తున్నారు గాని పుకార్లు ఎలా నిరోదించగలం?
నమ్మకం ఉంచాలి
ఒక అవకాశం క్రొత్త వారికి ఇవ్వాలి
మార్పు ని ప్రోత్సహించాలి
పదే పదే పాత పార్టీ ల చేతిలో మోస పోకూడదు
అభ్యర్దుల కన్నా అధినేత ముఖ్యమని గ్రహించాలి .
అభిమానులు కూడా అలిగి వేరే పార్టి లోనికి వెళ్లి పోవటం గర్హినీయం
అభిమానానికి పరమార్ధం స్వార్ధం కారాదు .
స్వచ్చందం గా నిస్వార్ధం గా చుపేదే అభిమానం కాని టికెట్ రాక పొతే పార్టి ఫిరాయించే వాడు ఎన్నటికి నిజమైన అభిమాని కాజాలడు.
స్వార్దమే లేనప్పుడు అసలు త్యాగం చేసే ప్రస్తావన ఎందుకు ఏర్పడుతుంది ?
పదవుల కోసేమే అభిమానులు పార్టి లో చేరారా ?
ఇన్నాళ్ళు మనం చూపిన అపారమైన అభిమానం రాజకీయ అవసరం కోసమేనా ?
అనర్హులను ,అయోగ్యులను అభ్యర్దు గా నిల బెట్టిన పరిస్థితులు కొన్ని చోట్ల ఉన్నాయి వాటి మీద పోరాడటం తప్పు కాదు దానికి ఆఫీసు బద్దల కొట్టనవసరం లేదు ప్రత్యర్ధులను నిలబెట్ట వలిసిన ఆవశ్యకత లేదు .సత్యాగ్రహం చేయ వచ్చు . అధినాయకత్వాని నిల దీయ వచ్చు .కానీ రాత్రి కి రాత్రే వేరే పార్టి గూటి లో కి చేరటం క్షమించారని నేరం .
అయినా అభిమానులు గా గుర్తించి కొన్ని చోట్ల సీట్లు ఇచ్చేరు కదా ! ఎన్నో సమీకరణాలు, ఎన్నో సామాజిక ఆవసరాలు, అన్నో స్థానిక అనివార్యాలు, బి సి లకు 104 సీట్లు , ఇంకా ఎన్నో కులాలనుండి ఒత్తిడి లు, ప్రత్యర్దుల పై గెలుపు అవకాశాలు బేరీజు, ఇదంతా ఒక మహా యజ్ఞం ,ఒక మహా సమరం ,అందరిని సంతృప్తి చేయాలి ,ఎవరు అసంతృప్తి చెంద కూడదు !ఎ పార్టి లో లేని అనేక రెట్లు ఆశావహులు! పదిమంది లో ఒకడి కి ఇస్తే 9 మంది రెబెల్స్ !
ఒక్క సారి ఈ కింద ఇచ్చిన పట్టికను పరిశీలించండి ఏయే ఏయే పార్టి లు సామజిక న్యాయ సాధనకు ఎంత చిత్త శుద్ది తో అభ్యర్ధులను ఎంపిక చేసారో ఎవరు కుల తత్వాని పబ్లిక్ గా చాటు కున్నారో ఎవరు బి సి లకు మైనారిటీ లకు పెద్ద పేట వేసారో తెలిసిపోతుంది కాంగ్రెస్, తెదాపా కుల రాజకీయాలు ,నిజ స్వరూపాలు స్పష్టం అయి పోయాయి .. ఈ రణరంగం లో పోరు సలపలేని మహిళలకు ,వికలాంగులకు కూడా ఎం ఎల్ సి సీట్లు కేటాయిస్తామని 5 ఏప్రిల్ ఆదివారం మీట్ ది ప్రెస్ లో చిరంజీవి స్పష్టం చేసారు .
రాజముండ్రి రూరల్ సీట్ పొందిన శ్రీ రవనం స్వామి నాయుడు పరిస్థితి స్థానికుడు కాదన్న కారణం గా ఏమైందో చూసారు గా ? అక్కడ కు మన అభిమానులంతా అర్జెంట్ గా చేరు కొని అతనికి బాసట గా నిలవాలి ! అతని విజయానికి అన్ని విదాల సహాయ సహకారాలు అందివ్వాలి . సీట్ రాని వాళ్ళు అలకలు మాని సీట్ వచ్చిన వాణ్ని గెలిపించండి కనీసం వెయ్య మంది అభిమానులు రాజమండ్రి రూరల్ నియోజక వర్గం చేరుకుని అక్కడ మన అభిమాన సంఘాల నాయకుడుని గెలిపించు కొండి
కుప్పం లో కూడా మన అభిమానే నిలబడ్డాడు మరి చంద్ర బాబు ను ఓడించి మీ కసి తీర్చుకోండి ఇంతకన్న పెద్ద గౌరవం అభిమానులకు వస్తుందా ?
రామునికి పరం భక్తుడైన హనుమంతుడు ఎ పదవి ఆశించేడు ?
ఒక సారి రాముడు మీద కూడా యుద్ధం చేసేడు ! అది రాముని కోసమే!
కానీ రామ బాణం అతన్ని ఏమి చేయ లేక పోయింది ఎందుకో తెలుసా ? అతని నిరంతర రామ నామ స్మరణే అతని చుట్టూ రక్షణ కవచం గా మారి హనుమంతుని కాపాడటం చూసి రాముడు ఆశ్చర్య పోయేడు !
మన రాముడు చుట్టూ చేరిన రాక్షస మూకలను పని పట్టకుండా మన మానాన మన వెళ్ళిపోవటం భవిష్యత్ లో ఎంత పెద్ద పొరపాటో ఆలోచించారా ? యుద్ధం మద్య లో ఆపేద్దామా ? రావణాసురుడు వైపు వెళ్లి పోదామా ?
మన గమ్యం ఏమిటి ? మన లక్ష్యం ఏమిటి ? మరిచారా ?
మనకు గుర్తింపే ముఖ్యమా? అబిమానం చూపటానికి వేరే మార్గాలే లేవా ? రక్తాన్ని ధార పోసిన మన అభిమానులు చిరంజీవిని ముఖ్యమంత్రి చూడాలని కోరు కోవటం లేదా ? చెప్పండి ?
ప్రతి అభిమాని ఎవరికి వారు ఆత్మ విమర్శ చేసుకోవాలి !
మనముందున్న కర్తవ్యాన్ని ఎట్టి విపత్కర పరిస్తితి లో కూడా విస్మరించ కూడదు
ఇంతటి మహోద్యమం మళ్లీ మనం నిర్మించలేము ఈ అవకాశం మళ్లీ ఎన్నటికి రాదు
మన స్వంత ప్రయోజనం కన్నా ప్రజాప్రయోజనమే మిన్న అన్న సత్యాన్ని మరువ కూడదు .
అభిమానులకు కు ఒక వేడికోలు
మీ మనసులు గాయ పడితే మన్నిచండి కానీ మన ఆశయాని మాత్రం ఎన్నటికి తూట్లు పొడవకండి .
ప్రతిపక్షాల ఎత్తులకు చిత్తవ్వకండి.మన కుటుంబ సమస్య మనమే పరష్కరించు కుందాం
కదిలి రండి కలసి రండి ఇది మనం నిర్మించుకున్న మన రాజ్యం .మన రాజ్యం లోంచి మనం వెళ్లి పోవటం ఏమిటి ? దొంగలు ఎవరైనా వుంటే మనమే వాళ్ళని వెళ్ళ గొడదాం. అంతే గాని మనం వెళ్లి పోయి దొంగ చేతికి తాళాలు ఇవ్వటం వివేకమైన పని కాదు .
మన అందరి వాన్ని ఒంటరి వాన్ని చేయటం భావ్యం కాదు.
మనం కోరుకున్న మార్పు మనమే తెద్దాం .ప్రజారాజ్యం విజయానికి పాటుబడదాం.
సమయం మించి పోతుంది సైనికులారా కదలండి!
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|