Active Blogs | Popular Blogs | Recent Blogs ఆనగనగా అది ఒక అందమైన ఊరు
ఆనంతమైన నా భాల్య స్మ్రుతులకు నిలయ’మా’ఊరు
తల్చుకొంటే తన్మయంగా, గుర్తుకొస్తే గమ్మత్తుగా
కళ్ళముందు కదులుతాయా కమనీయ ద్రుస్యాలెన్నో...
దాహం తీర్చటానికి దాతలు ఇచ్చిన సొమ్ముతొ తాతలు త్రవ్వించిన
నిండు కుండలాంటి పెద్దచెరువు గంభీరం
పూలపల్లెంలా చెరువునిండుగా మెండుగా తామరపువ్వులు
వాటి ప్రక్కనే ఆకులపై చెపలకై థపస్సు చెసే కొంగలనే మునిపుంగవులు
కాయకష్టం చెసే నాన్నకు కాస్త చేదోడు అవుదామని
చెతకాకున్నా చేతికెత్తుకున్న కుర్రాళ్ళ కావడి కర్ర చెసే కిర్రు కిర్రుల కచేరి
కాలక్షేపం కోసం కచేరీపాకలో చేరిన పెకాటరాయుళ్ళు
పంపకాలు కుదరక పైపంచెలు విసుర్తూ పలికే ప్రగల్భాలు
రావి చెట్టుపై కాకి గూటిలో పెరుగుతున్న కొకిల పిల్ల గొంతు కనిపెట్టి
వెంటపడి తరుముతున్న కాకుల క్రోదపు కేకలు
చెరువు చుట్టూ మూడుసార్లు కుంటలేక ముప్పతిప్పలు పడుతున్న
గోడుంబిళ్ళ ఆట లో ఘొరంగా ఓడిన ప్రత్యర్థి గాంగ్
షావుకారు షాపుకెల్లి అమ్మ చెప్పిన అల్లం తెస్తున్న చిన్నారిని
గుండె అదిరేటట్లు బెదిరిస్తున్న మర్రి చెట్టు తొర్ర లొని గుడ్లగూబ గుర్రు
చవితిరోజు పాలవెల్లి కి కట్టే కలువల కోసం కాలువకెల్లి
మోయలేనన్ని మోసుకొచ్చి ఊరంతా పంచే ఉత్సాహవంతుల కోలాహలం
రాత్రి ఎప్పుడో దాక్కొని 'గడ్డి వాములో గుర్రుపెడుతున్న ' దొంగల్ని పట్టుకోలేక
తెల్లవార్లూ వీధి వీధి విధిగా తిరుగుతున్న దొంగా పొలీసు ఆటలోని పొలీసు
కత్తి కట్టిన కోడిపుంజు కొట్లాటలు, పొగరెక్కిన పొట్టేళ్ళ పోట్లాటలు చూస్తూ
పట్టలేనంత పరవసంతో సాగిపోయే సంక్రాంతి సంబరాలు
పక్క ఊరి టూరింగ్ టాకీసులో టిక్కెట్లు ఇచ్చేముందు
ఠంచనుగా వినిపించే 'దూరానా నీలిమేఘాలు ' పాట
ఎన్నని చెప్పను ఎంతని చెప్పను
మనసు మైమరపించే మాఊరి మధురాలు
కొన్నైనా ఉన్నాయా ఈ అనుభూతులు
ఈ కాలపు సైబర్ సిసింద్రీలకు
...-ప్రసాద్ అట్లూరి
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|