Active Blogs | Popular Blogs | Recent Blogs నువ్వు పోలిథిన్ బేగ్(వి)వా
ఎన్నో అనర్థాల బండిల్(వి)వా
మైక్రో మందం నీది
మేక్రో వినాశనం నీది
ఆనుకోకుండా ఆయువు పోసుకున్నావు
ఆనంతమైన కాలుష్యానికి కారణమవుతున్నావు
తరాలు గడచినా కరగని నీ కాయం
కరిగించేస్తూంది నేలలో సారం
ఆహారమని అశగా నిను తిన్న మూగజీవులు
ఆవుతున్నాయి అంతలొనే విగత జీవులు
దశాబ్దం లోనే వ్యాపించావు
శతాబ్దంలోనైనా అంతరిస్తావా నువ్వు
ఆందుకే నడుంభిగిస్తోంది మానవాళి మొత్తం
ఇహనైనా నీ నడ్డివిరిచి అంతమొందించటానికి
ఖబడ్థార్… ఒ కాలకూటమా, కాలగర్భంలొ
కలసిపొతావ్.
---అట్లూరి ప్రసాద్
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|