Active Blogs | Popular Blogs | Recent Blogs కాశ్మీరు కొండల్లొ మంచు లా చల్లనైనది నీ నవ్వు
సముద్ర గర్బంలో ముత్యంలా స్వచ్చమైనది నీ నవ్వు
చంటి పాప బొసినవ్వుకి తీసి పోనిది నీ నవ్వు
కంటిపాప చూడాలనుకొనే కమనీయద్రుశ్యం నీ నవ్వు
అలసిన మనసులకు ఆహ్లదం నీ నవ్వు
కలసిన మనుషులకు ఉత్తేజం నీ నవ్వు
పూదోటలొ విరిసిన పుష్పం నీ నవ్వు
సయ్యాటలొ విసిరిన సరసం నీ నవ్వు
నిండు చందమామలా పరిపూర్నమైనది నీ నవ్వు
పండు వెన్నలలా హాయిని గొలిపెది నీ నవ్వు
కొకిలమ్మ కుహూ రాగం కన్నా తియ్యనైనది నీ నవ్వు
తుమ్మెదమ్మ జుమ్మందినాదం కన్నా శ్రావ్యమైనది నీ నవ్వు
మల్లెపువ్వులోని మత్తైన గమ్మత్తు నీ నవ్వు
కన్నెపిల్ల కౌగిలిలొని వెచ్చదనం నీ నవ్వు
గలగల పారే సెలయేటి సవ్వడులే నీ నవ్వు
చిటపట కురెసే జడివాన పదనిసలే నీ నవ్వు
గుండెలోపలి భావాల్ని తట్టిలేపే పదునైన అస్త్రం నీ నవ్వు
మూగమనసుకి మాటలు నేర్పే అరుదైన శాస్త్రం నీ నవ్వు
అందుకే నాకు ఇష్తం నీ నవ్వు
ఎప్పటికీ నాతో అది వుండనివ్వు...
---అట్లూరి ప్రసాద్
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|