Active Blogs | Popular Blogs | Recent Blogs కడుపుకి పట్టెడన్నం పెట్టే కర్షకుల
కన్నీటి వ్యధల కథే క్రాప్ హాలిడే
నడ్డె విరిచే వడ్డీల నరకయాతన అంభవించలేక
అన్నదాత ఎంచుకున్న అవాంచనీయ మార్గం క్రాప్ హాలిడే
పండించిన పంటకు సరైన ప్రతిఫలం దక్కని
కలత చెందిన రైతు కన్నీటికి సాక్షం క్రాప్ హాలిడే
ఫెనుతుఫాన్లు, కరువుకాటకాలు చీడపీడలెన్నైనా ఎదిరించి నిల్చిన రైతన్న
రాని గిట్టుబాటుకి, (తే)లేని పెట్టుబడికి,క్రుంగిపొతున్నదుకే క్రాప్ హాలిడే
పచ్చని చేలని పచ్చిక భీడులుగా చేయడానికి వెనకాడని
బక్క గుండె చేసిన మొండి ధైర్యం క్రాప్ హాలిడే
ఏలక్షన్లు కలక్షన్లు కు మాత్రమే పర్తిమితమైన నేతలు
తమ రాతలు మార్చరని తెలుసుకున్నదుకే క్రాప్ హాలిదే
ఆదుకోవల్సిన ప్రభుత్వం ఆదమర్చి నిద్రపోతున్నందున
అలసిన ప్రజల అంతులేని ఆక్రొశమే క్రాప్ హాలిడే
కావాలి ఎందరికో ఈ క్రాప్ హాలిడే కనువిప్పు
కాదంటే పొంచివుంది అందరికీ పెనుముప్పు
కాకూడదు కష్టజీవి శోఖం మన అందరికీ శాపం
...-ప్రసాద్ అట్లూరి
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|