Active Blogs | Popular Blogs | Recent Blogs వస్తే వానా నువ్వు వయ్యారంగా
పులకరించదా పుడమి అమాంతంగా
ఛిట పట చినుకుల సవ్వడిని
టప టప రెక్కలార్పుకుంటున్న గువ్వల్ని
తడిసిన మట్టి సువాసనల్ని
తన్మయంతొ తలలూపుతున్న వనాల్ని
కారు మబ్బులు చేస్తున్న షికారుల్ని
ఆకాశమ్నుంచి ‘ఒకటి 'లు కురుస్తున్న వైనాన్ని
ఛిమ్మచీకట్లకే కళ్ళు భైర్లు కమ్మించే మెరుపుల్ని
నింగినే భయపెట్టేట్లు ఘర్జించే ఉరుముల్ని
గొడుగులు నుంచి జారుతున్న ధారల్ని
బుడగలు సండడిగా సాగుతున్న దారుల్ని
నిల్చిన నీటిలొ చిందులేస్తున్న చిన్నారి ఆనంద పరవశాన్ని
తడసిన కురుల్ని సవరించుకుంటున్న ముద్దుగుమ్మ మోహనాన్ని
నిన్ను చూస్తూ సిప్ చెస్తున్న కమ్మనైన కాఫీ రుచిని
ఆస్వాదించనా నేను ఆసాంతంగా….
....అట్లూరి ప్రసాద్
 KRISHNA MURTHY RAYACHOTY | Hai! ATKURI PRASAD Garu, Congratulations!!! mee kavithalu annitini chadvaanu. Tenelolike telugu bhasha teeyadanalanu jodinchina meekavithalu entho aakattukunnaayi.
Ninna saayantrame oka Kaaryakramaaniki velladam jarigindi. "TELUGU PRASHASTHI" perita visishta sangeetha nritya roopakam lo Telugu Bhasha gurinchina adbhuta samaacharam telusukunnaamu.
Marinni "Ras gulikalatho" sadaa meeru munduku saagaalani korutu, RAYACHOTY KRISHNA MURTHY, MUMBAI.
Posted at: 19, Oct 2011 0:52 AM |
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|