Active Blogs | Popular Blogs | Recent Blogs సీడబ్లుసీ మరియు సీఎం రోశయ్య ల మధ్య జలరగడను మరియు ఇటీవల కేసీఆర్‌కు-పొన్నాలకు మధ్య చోటుచెసుకున్న మాటల యుద్ధాన్ని మనం చూశాం. ఈరోజు కూడా పొన్నాల తమ తప్పిదం ఏమీలేదని మీడియాలో చేసిన వాదనలను అర్ధం చెసుకోవడానికి ఈకింది వార్త ఉపయోగపడుతుందని ఆశించి ఇక్కడ ఇస్తున్నాను.
ఈరోజు అంటే 13 అక్టోబర్ నాటి ఆంధ్రజ్యోతిలో వచ్చిన అతి ముఖ్యమైన అంశాలున్నాయి వాటిని ప్రింట్‌లోగాని,వెబ్‌లోగాని ఏమాత్రం వదలకుండా చదవాలని కోరుతున్నాను.
ముందు పేజీలోనె కుడిపక్కన ఉన్న 'జల రగడ ' చదవండి, చదివించండి,చదువురాని మన పేద ప్రజలకు వినిపించండి. జలరగడ కేంద్ర జల వనరుల సంఘానికి(సీడబ్ల్యూసీకి)-రాష్ట్ర ప్రభుత్వానికి (సీఎం రోశయ్య)కు మధ్య అన్నమాట. అదే హెడ్డింగ్ కింద రెందు ఉప హెడ్డింగులు ఉన్నాయి.1.భారి వరద వస్తుందని ముందే హెచ్చరించాం.ఇది ఏకేబజాజ్ గారు వివరించినది.2.మీరు చెప్పిందేమిటి జరిగిందేమిటి? ఇది సీఎం రోశయ్య ప్రశ్న. మొత్తం చదివితేనే నేనిప్పుడు రాస్తున్న విశ్లేషణ అర్ధం ఔతుంది.
కేంద్ర జల సంఘం చైర్మన్ అరుణ్ కుమార్ బజాజ్ గారు తమ తప్పిదంలేదు,తమ వైఫల్యంలేదని చెప్పుకునేందుకే ఈక్రింది వివరాలు ఇచ్చారు.
వరదలు రావడానికి 26 గంటలు ముందే వరదలపై హెచ్చరిక ఎట్లెట్ల చేశామో డిల్లీలో మీడియా ముందు వివరించారు.
1. ఈనెల 1 వ తేదీన సాయంత్రం 5 గంటలకు తొలి ప్రత్యేక అడ్వైజరీని (స్పెషల్ సలహాను) విడుదల చేశాం.
2.అదేరోజు రాత్రి 7-20 గ.లకు ఆరెంజ్ బుల్లెటిన్‌ను ,
3.అదెరోజు రాత్రి 10-45 గ.లకు మరో రెడ్ బుల్లెటిన్‌ను,
4.అర్ధరాత్రి అంటే 2 వ తేదీ తెల్లవారు జామున 12-45 గ.లకు మూడవ బుల్లెటిన్‌ను,
5.2 వ.తేదీ ఉదయం 4 గ.లకు మళ్ళీ రెడ్ బుల్లెటిన్‌ను విడుదల చేశాం.
ఈ నోటీసులను కేంద్ర జల వనరుల శాఖతోపాతు ఇతర 29 మంది అధికారులకు పంపిస్తాము. హైదరాబాదులోని మా సీడబ్లూసీ నుండి కూడా హెచ్చరికలు వెళ్ళాయి.ఆరోజు కర్ణాటక
నుండి శ్రీశైలంలోనికి 20 లక్షల కూసెక్కుల నీళ్ళు/వరద ప్రవాహం రాబోతున్నట్లు చెప్పాం.అప్పటికే శ్రీశైలంలో 95 % శాతం నీరు చేరి ఉంది.దిగువన ఉన్న నాగార్జున్ సాగర్‌లో 45 %శాతం నీరు మాత్రమే ఉంది. అంటే కిందికి వదిలే అవసరం, అవకాశం ఉన్నా ఇంజనీర్లు వదలకుండా శ్రీశైలంలో పరిమితికి మించి నిలిపి ఉంచారు. నిలిపి ఉంచడంపై అభ్యంతరం లేదు (అభ్యంతరం చెఫ్ఫే భాధ్యత తమకు లేదా? అనేది ఏకే బజాజ్ గారే చెప్పాలె). గేట్లు ఎందుకు ఎత్తలేదో,నీరెందుకు కిందికి వదలలేదో వాళ్ళు (రాష్ట్ర ప్రభుత్వం) చెప్పాలి. ఇంత స్పష్టంగా బజాజ్ చెప్పినా రోశయ్య తమ తప్పేమి లేదని చెప్పడానికి, మళ్ళీ బజాజ్ మీదికి నెట్టే ప్రయత్నాన్ని పక్కనే ఉన్న వార్తలో చూద్దాం.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|