Active Blogs | Popular Blogs | Recent Blogs భర్తగా మారే బ్యాచిలర్లను ఉద్దేసించి శత్రుఘ్నసిణ్హా చెప్పిన కొన్ని సరదా పెళ్ళి సూత్రాలు ......
-పెళ్ళి రక్షణకునూ కొత్త అవకాశాలనూ కల్పిస్తుంది.పాత గర్ల్ ఫ్రెండ్స్ నుంచి రక్షణ దొరుకుతుంది.పెళ్ళయిన మహిళలతో కొత్తగా స్నేహం చేయవచ్హు.
-పెళ్ళయితే జీవితంలో స్తిరపడైనట్లే.తిండి గురించి ఆలోచించక్కర్లేదు.భార్య రూపం లో జీవితకాలపు కేర్ టేకర్ దొరుకుతుంది.
-పెళ్ళి-బుర్రకు పదును పెడుతుంది.పాత గర్ల్ ఫ్రెండ్స్ ఫోన్ నంబర్లు,పుట్టినరోజులు తరుచు గుర్తుకొస్తుంటాయి.
- బాగా శ్రమించడం అలవాటవుతుంది.అప్పటివరకు మంచం మీద రోజంత బద్దకం గ దొర్లినవారు కాస్తా భార్య నుంచి తప్పించుకునేందుకు కాస్త కూడా ఖాళీ లేకుండా తెగ కష్టపడుతుంటారు.షాపింగు కు అదీ వెళ్ళినప్పుడు ఓ కూలికన్నా ఎక్కువ బరువును మోయాల్సి వస్తుంది...అదీ ఉచితంగా.
-పురుషుడి స్వప్న జగత్తు ఒక్కసారిగా మేల్కొంటుంది...రాత్రంతా కలలు కంటూనే ఉంటాడు కాబట్టి.
-పెళ్ళి మనిషిని స్థితప్రజ్ణుడినీ తాత్వికుడినీ చేస్తుంది.పెళ్ళయిన తరువాత ఇక దేనిమీదా ఆసక్తి,కొరిక ఎందులోనూ ఉత్సాహం,ఉద్వేగం ఉండవు.
-చర్మం మొద్దుబారి ఎకసెక్కేలనూ హేళనల్నీ తట్టుకోగలుగుతుంది.పని నచ్హకపోతే ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది పనిమనిషి.కానీ భర్తకు అంత ధైర్యం,అవకాశం ఉండవు.
-చిన్ననాటి నుంచీ ఉన్న స్వేచ్హను కోల్పోవలిసి రావడం,అడుగడుగున రాజీపడాల్సి రావడం తోచేది పెళ్ళయిన కొత్తలోనే.ఆ తరవాత ఎలాగూ అలవాటుపడిపోతాం.
-పెళ్ళి అనేది కేవలం పైలాపచ్హీసు జీవితానికి ముగింపు కాదు. యావజ్జీవ ఖైదు.
-పెళ్ళయిన వాడు ఎప్పటికీ ముసలివాడు కాడు. అన్నాళ్ళు బతికి ఉండడు కాబట్టి.
- వివాహ రజతోత్సవం జరుపుకున్నవారు అప్పటి నుంచీ స్వర్నోత్సవం కోసం ఎదురుచూస్తుంటారు. అంటే మనుగడ కోసం పోరాటం అన్న డార్విన్ సిద్దాంతాన్ని నిజం చేసినట్లే.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|