ఆత్మకధ in telugu stories at TeluguPeople.com - Telugu Community Portal. Social Networking, Chat, Blogs, Classifieds, Videos, Photos, Galleries, Bollywood, Movies, Hyderabad, Visakhapatnam, Tirupati, Vijayawada, Guntur, Warangal, Kakinada, Kadapa, Kurnool, Rajahmundry and lot more...
TeluguPeople
  are the trend-setters

Active Blogs | Popular Blogs | Recent Blogs

namaste namaskaaram's Blogs >> telugu stories

ఆత్మకధ

నేను ఒక అద్భుతమైన వ్యక్తిని.నా పేరు చెప్పను.ఎందుకంటే నా పేరు తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు.నేను నా నియోజకవర్గానికి ఎంతో చేసాను కాబట్టే నేను ఎం.ఎల్.ఎ. గా వరసగా నాలుగోసారి ఎన్నికవుతూ వచ్హాను.
అసలు విషయం ఏమిటంటే నేను రాసుకుంటున్న నా అత్మకధ పుస్తకం పూర్తికావొచ్హింది.నా పుస్తకాన్ని చదివినప్పుడల్లా నాకు ఎంతో గర్వం గా ఉంటుంది.అందులో నాకు ఇష్టమైన కొన్ని పేజిలను మరొక్కసారి చదవుకోవాలనిపించింది. 18వ పేజిని తీసాను. అందులో నా చిన్నతనం లో నేను అనుభవించిన కటిక పేదరికం గురించి చదివి ఇప్పుడు ఉన్న స్థితిని తలుచుకుంటే ఎంతో గర్వంగా ఉంటుంది.ఉండదా మరి !! నేను కొన్ని కారణాల వల్ల 'నా' ఆస్తులు బయటకి చెప్పకూడదు గాని నేను ఖచ్హితంగా కోటీశ్వరుల జాబితాలో ఉంటాను.తర్వాత నాకు ఇష్టమైన 94వ పేజి ని తిప్పాను.అందులో నేను ఒక పేదవాడికి డబ్బు సాయం చేసిన విషయం చదువుతుంటే నన్ను పేదల పెన్నిది అని ప్రజలు అనటంలో అతిసయోక్తిలేదనిపిస్తుంది ....
ఎక్కడో నుండో హఠాత్తుగ నాకు ఎవో మాటలు వినపడ్డాయి.చుట్టూ చూసాను.ఎవరూ కనపడలేదు.అది "ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక పసి ప్రాణాన్ని చంపేసావు" అంది.అప్పుడు నేను "నా కూతురికి MBBS సీట్ కోసం నేను ఎంత లౌక్యం ఉపయోగించానో నాకే తెలుసు.నాకు ఉన్న పరపతితో నా కూతురికి సీట్ సంపాదించగలిగాను.ఆ సీట్ రావలిసిన అబ్బాయి వాళ్ళ నాన్నకి చాల డబ్బులు ఇవ్వవలిసి వచ్హింది.సీట్ వచ్హినా వాళ్ళు ఫీజు కట్టలేరు.ఆ తర్వాత ఆ అబ్బాయి అత్మహత్య చేసుకుంటే దానికి నేనేలా భాద్యుడినవుతాను" అన్నాను.అది మాట్లాడలేదు.
తర్వాత 136వ పేజిని తిప్పాను.అందులో నేను సహాయం చేసిన ఒక వ్యక్తి గురించి వ్రాశాను.నాకు ఇతరులకి సహాయం చేయటం అనేది ఒక అలవాటుగా మారిపోయింది.ఇంతలో అది "జనాల సౌఖ్యం కోసం ఉపయోగించాల్సిన సొమ్ముని మీరు తింటార" అంది.అప్పుడు నేను "ప్రభుత్వం ఇచ్హిన డబ్బులతో రోడ్లు వేయించాను.ఆ పనులు నాకు బాగ తెలిసిన కాంట్రాక్టర్ కి అప్పగించాను.ఎందుకంటే అతను కూడ బతకాలి కదా.కొంతమంది జనాలు టర్నింగ్ లో స్పీడ్ బ్రేకర్ పెట్టించండి. యాక్సిడెంట్స్ అవుతున్నాయి అన్నారు.కాని జనాలకి అన్ని చేయకూడదు కదా !! నిధులు విడుదలయ్యాక ఆ పని చేస్తాను" అని చెప్పాను.అది మళ్ళి నోరు తెరవలేదు.నాకు ఎందుకో నేను వ్రాసిన అత్మకధ సంపూర్ణం కాలెదనిపించింది.నేను కొంత డబ్బుని తీసకెళ్ళి పేదవారికి పంచి ,ఆ విషయాన్ని నా ఆత్మకధలో వ్రాస్తే గాని సంతృఅప్తికరం గా ఉండదనిపించింది.
నేను అలా అనుకోగానే నా పుస్తకాన్ని మూసేసి యాభై వేలు జేబులో పెట్టుకుని కారు డ్రైవ్ చేసుకుంటు మురికివాడలో నివిసించే ప్రజలు వద్దకు వెళ్ళాను.అబ్బ!! అసలు 'మురికివాడ' అనే మాట వింటుంటేనే ఎంత కంపరం గా ఉందో చూడండి.వాళ్ళని చూడగానే కడుపులో తిప్పింది.అంత కంపులో వాళ్ళు ఉండటం చూసి అసహ్యం వేసింది. అయిన తప్పక చిరునవ్వు నవ్వుతూ వాళ్ళకి డబ్బు పంచాను.వాళ్ళలో ఒకడు నా కాళ్ళకి దండంపెట్టాడు.వాడి మురికి చేతులు న షూస్ ని తాకినప్పుడు నాకు కంపరమెత్తింది.నా షూస్ కి మరకలు అంటినాయి.ఇక ఎప్పుడూ జీవితం లో ఇలాంటి చోటికి రాకుడదనుకున్నాను.వాళ్ళకి డబ్బులు పంచేసి కారులో ఇంటికి బయలుదేరాను.ఇప్పుడు నా చాతి చాల ఆనందంతో ఉబ్బింది.నేను నా అత్మకధలో నేను చేసిన సహాయాన్ని గురించి వ్రాయబొతున్నాను.
నా ఇంటికి దగ్గర్లో ఉన్న రోడ్ టర్నింగ్ తిరుగుతుంటే ఎదో పెద్ద శబ్ధం వినపడింది.తర్వాత ఒక్క నిమిషం నాకు ఆకాశం కనపడింది..ఎవరివో అరుపులు ఏడుపులు వినపడుతున్నయి.నాకు అంత అయోమయం గా అనిపించింది.నా నుండి ఏదో విడిపడుతున్న భావన కలిగింది.అది నా నుండి దూరం గా న ఇంటి వైపు పోతుంది.అది నా గదిలోకి వెళ్ళి నా అత్మకధ పుస్తకం లొ చివరి పేజి ని తీసి ఇలా వ్రాసింది.
"పీడ విరగడయింది."
ఇంతలో ఎవరో నాకు విగ్రహం కడతానని ఎవరితోనో చెబుతున్నాడు.ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు.ఎందుకంటే నేను ఒక అద్భుతమైన వ్యక్తిని కాబట్టి.



 
Be first to comment on this Blog Post!
 



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.