Active Blogs | Popular Blogs | Recent Blogs రాత్రి పదకొండు గంటలకు కాలింగ్ బెల్ మోతకు వెళ్లి తలుపు తీసింది రమణి.ఎదురుగ మత్తులో జోగి ,వంటి నిండా కట్ల తో ఉన్న కొడుకు నిఖిల్ ను చూసి నిశ్చేష్టురాలు అయింది రమణి."ఏమి లేదు ఆంటీ. ఇవ్వాళ birthday కదా అని రెండు పెగ్గులు ఎక్కువ వేసాడు,,ఫ్రెండ్స్ తో బెట్ కట్టి byke రేస్ లో participate చేసాడు,బాలన్సు తప్పి పడిపోయాడు,మరేమి పర్వాలేదు అన్నారు డాక్టర్స్ అని చెప్పి నిఖిల్ ను సోఫా లో కూర్చోపెట్టి వాళ్ల పని అయిపోయిన్దనిపించి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్.లేక లేక పుట్టిన ఒక్క కానోక్క కొడుకు ను ఈ స్తితి లో చూసి తల్లడిల్లిపోయింది రమణి."అర్ధరాత్రి పూట ఎందుకురా ఆ పందాలు అవి..ఎన్ని సార్లు చెప్పాలి పబ్బు లకు క్లబ్బులకు వెళ్లొద్దు తాగి రావద్దు అని,,తొందరగా ఇంటికి వచ్చి హాయ్ గా మాతో ఉండక ఎందుకురా ఫ్రెండ్స్ అంటూ తిరుగుతావు,,ఏదో చిన్న దెబ్బలు కాబట్టి సరిపోయింది,నీకేమన్నా అయితే మేమేమయి పోవాలి రా" అంటూ ఏడుపు లంఘిన్చుకుంది తల్లి.అస్సలే మత్తులో తూగుతూ దెబ్బలతో కొంచెం చికాకు గా ఉన్న నిఖిల్ కు అమ్మ ఏడుపులు చికాకు ను రెట్టింపు చేసాయి,"ఛి ఛి అందుకే నేను ఇంటికి రాను ఎప్పుడు చూడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. చిన్నప్పుడు చదువు చదువు అని.ఏదో ఆ ఇంజనీరింగ్ అయిన్దనిపించాక ఉద్యోగం ఉద్యోగం అని సతాయించారు..ఏదో నా అదృష్టం బాగుంది మంచి జాబు వచ్చింది.నా జీతం నాకు పాకెట్ మనీ కు సరిపోతుంది,,ఇప్పుడు కూడా నన్ను ప్రశాంతం గా నా పని నన్ను చేసుకోనీయరా,ఎంజాయ్ చేస్తే తప్పేంటి.ఏమంత కాని పని చేసానని" అని విసుకుగా తన గదిలోకి వెళ్ళిపోయాడు నిఖిల్.
ఆ రాత్రంతా రమణి,గోపాల్ లకు కంటి మీద కునుకు పట్టలేదు..కొడుకు ఇలా చేయి దాటిపోతున్నాడు అని మనసులో బాధ పడసాగారు,ఒక్క కానోక్క కొడుకు అని చిన్నప్పటినుండి గారాబం గా పెంచారు.అడిగింది కాదనకుండా ఇచ్చారు.ఎంతో మంచి పోసిషన్ లో ఉండాలి తమ కొడుకు అని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.స్వతహాగా తెలివిగల వాడే నిఖిల్.ఇంజనీరింగ్ వరకు బాగానే ఉన్నాడు.ఇంజనీరింగ్ అయిపొయింది వెంటనే మంచి కంపెనీ లో ఉద్యోగం వచ్చింది అప్పటినుండి ఫ్రెండ్ సర్కిల్ పెరిగింది,సొంత సంపాదన.పాతికవేల జీతం..ఒక్కసారి గా అలాంటి జీవితం,జీతం అందేటప్పటికి ఒక్కొక్క వ్యసనము అలవాటు అయింది.పబ్బులు క్లబ్బులు వెళ్ళటం అలవాటు అయింది.లేట్ నైట్ పార్టీస్ మొదలు అయ్యాయి.దీనికి తోడు byke racelu అంటూ కొత్తగా మొదలు పెట్టాడు.వద్దని ఎన్ని సార్లు చెప్పినా అమ్మ నాన్న ల మాట చెవిన పడలేదు నిఖిల్ కు.చూద్దాం కాలమే సమాధానం చెబుతుంది అని సర్ది చెప్పుకున్నారు రమణి,గోపాల్ దంపతులు.
ఒక వారం గడిచింది.గాయం కాస్త పాత పడింది.మళ్లీ byke రేస్ అని పందెం మొదలుపెట్టాడు.ఎంతో ఫాస్ట్ గా దుసుకుపోతుండగా సడన్ గా ముందు ఉన్న కిరణ్ బండి స్కిడ్ అయ్యి పల్టీలు కొడుతూ వెల్లకిలా పడ్డాడు.బండి వచ్చి అమాంతం మీద ఒరిగిపోయింది.ఒక్కసారి గా అందరూ భయ పడ్డారు జరిగినదానిని చూసి,,వెంటనే హుటాహుటిన హాస్పిటల్ కు తీసుకు వెళ్లి చికిత్స స్టార్ట్ చేయించారు.ఏదో ప్రాధమిక చికిత్స చేసి చిన్న చిన్న దెబ్బలకు కట్టు కట్టారు డాక్టర్స్.కానీ వెన్నుముక కు బలమయిన గాయం తగలటం వలన ఇంక పైకి లేవలేడని డాక్టర్స్ తేల్చి చెప్పేశారు.ఒక్కసారి గా ఫ్రెండ్స్ అందరూ ఉలిక్కి పడ్డారు.అప్పటి దాక తమతో ఉత్సాహం గా చిందులేసిన తమ స్నేహితుడు ఇంక అస్సలు లేచి నిలవలేడని విని తట్టుకోలేకపోయారు.ఇది అంతా నావలన నే కదా. అనవసరం గా నేనే పోటిపడదాం అని వాడిని రెచ్చకోట్టానే అని గుండెలవిసేలా రోదించాడు నిఖిల్.ఇంతలో వార్త తెలిసి కిరణ్ వాళ్ల parents హాస్పిటల్ కు చేరుకొని మంచం లో ఉన్న తమ కొడుకును చూసి మూర్చపోయారు.తమకు ఎంతో చేదోడుగా ఉంటాడు అని ఎంతో కష్టపడి ఉన్నదానిలోనే దాచి చదివించి చేతి కి అందివచ్చే టైం కు తమ కొడుకు ఇలా మంచానికి అతుక్కుపోవటం చూసి తట్టుకోలేకపోయారు.
ఒక నెల తర్వాత తన జీతం తెసుకుని ఆఫీసు నుండి నేరుగా కిరణ్ వాళ్ల ఇంటికి వెళ్ళాడు నిఖిల్.మంచం లో ఉన్న తన ఫ్రెండ్ ను చూసి తట్టుకోలేకపోయాడు నిఖిల్.తన జీతం లో సగం మొత్తం ఒక పదిహేను వేలును కిరణ్ తండ్రి కి ఇచ్చాడు."సారీ అంకుల్.వీడిని ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉంది.ఇదంతా నా వల్లనే జరిగింది అనిపిస్తోంది నాకు.నేను అనవసరం గా వీడిని పురికొల్పకపోతే వీడు byke రేస్ లో పాల్గొనేవాడే కాదు.మా అమ్మా వాళ్ళు ఎంత చెప్పినా మొండిగా వినలేదు నేను.ఈ శిక్ష ఏదో నాకే వేసుంటే బాగుండేది ఆ దేవుడు.అన్యాయం గా నా ఫ్రెండ్ బలి అయిపోయాడు.నా మూలం గా వాడి ఉద్యోగం పోయింది.మీరు ఇబ్బందులలో ఉంటారు అని నా జీతం లో సగం వాడికి ఇద్దాం అనుకుంటున్నాను.ఇక నుండి మందు తాగను,బైకే రేస్ లు చేయను నా ఫ్రెండ్ సాక్షి గా" అని కుమిలి కుమిలి ఏడ్చాడు నిఖిల్.అప్పటినుండి మందు,byke racelu మానేసి నలుగురికి ఉపయోగ పడే పనులు చేయటం మొదలుపెట్టాడు నిఖిల్.తన ఫ్రెండ్ కు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకున్నాడు.తమ కొడుకు లో వచ్చిన మార్పు ను చూసి ఎంతో సంతోషించారు నిఖిల్ తల్లిదండ్రులు.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|