Active Blogs | Popular Blogs | Recent Blogs కార్తీక మాసం అందునా శివ భక్తుడు మా వారు అందుకని భక్తీ గా ఎక్కువసేపు పూజ చేసుకుందాం అని ఈ మధ్యనే మొదలు పెట్టారు.దానికోసం పెందలాడే 6 .౩౦ కల్లా నిద్ర లేచి స్నానం చేసి ధావళి కట్టుకుని మరీ పూజ కు ఉపక్రమిస్తారు.6 .౩౦ ఐతే పెందలాడే ఏమిటి నా మొహం అంటారా..మరే మా వారికీ అదే పొద్దు పొద్దున్న మరీ.ఆయన రెడీ అయ్యి వచ్చేటప్పటికే నేను పూజ చేసేసుకుని ఆయన పూజ కు సిద్ధం చేసేస్తా.ఆయన మొదలుపెట్టి పెట్టగానే మా పనిమనిషి వస్తుంది.డమ డమ సౌండ్ చేసుకుంటూ గిన్నెలు విసిరేసుకుంటూ పనిచేస్తుంది.ఉండబట్టలేక నిన్ననే చెప్పారు కాస్త చిన్నగా తోమమ్మ పూజ చేసుకుంటున్నాను అని.అదే నా చేతి నుండి పొరపాటున గిన్నె జారి పడిందా అంతే కాస్త చూసుకుని చెయ్యి పని,,ఎందుకంత హడావుడి అని...అంతే గా మరీ. నేనేమో ఇంటి మనిషిని.ఇంటి మనిషి కి పనిమనిషి కి కొద్దిగా తేడా ఉంటుంది కదా ..ఇంటిమనిషి ఎన్ని అన్నా పట్టిచ్చుకోదు అదే పనిమనిషిని గట్టిగ గదిమితే రెండో రోజే మానేస్తుంది. అందుకని ఎంతో తెలివిగా మసలుకుంటారు పాపం మా వారు.అక్కడికి ఈ సౌండ్స్ భరించలేక తలుపు దగ్గరగా వేసే ఉంచుతాను..కరెక్ట్ గా అదే టైం లో మోగుతుంది నా cooker whistle...ఏమి చేస్తాం మరీ box తయారు చేయాలి గా...మళ్ళి లేట్ కాకూడదు,ఉడుకు ఉడుకు గా ఉండకుదు..మా cooker wistle దెబ్బకు మా పక్క పోర్షన్ వాళ్ళు కూడా లేస్తారు...అంత పెద్దగ చాలా సేపు వస్తుంది కుయ్య్యో మనుకుంటూ,,,,రోజు ఉండేదేగా అని ఒక సారి నా వైపు లూక్కేసి మళ్ళి పూజ లో మునుగుతారు .ఆ పూజ కూడా చిన్నగా చేసుకోకుండా పెద్ద పెద్దగ మంత్రాలు చదువుతారు...ఆ సౌండ్ కు నిద్రపోతున్న మా వాడు ఉలిక్కిపడి లేచి వస్తాడు ఆరున్నొక్క రాగం తీసుకుంటూ..కాసేపు సముదాయించి బుజ్జగించితే హే పాప కావాలి అనుకుంటూ తన డిమాండ్స్ చెప్తాడు.అదేలెండి మగధీర లో హే పాప పాట పెట్టాలి వాడికి సుప్రభాతం లాగా.మరి రోజు మొదలు అయింది అంటే వాడికి ఆ పాట,లేదా rhymes నో ఉండాల్సిందే..మా వారు కూడా తను డిగ్రీ చదివే వయసులో వాళ్ల నాన్నగారు పూజ చేసుకుంటుంటే ఈయన చిరంజీవి పాటలు పెట్టుకుని డాన్సులు చేసేవాళ్ళు ట ..అలాగే ఇప్పుడు మా వాడు రాంచరణ్ పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నాడు వాళ్ల నాన్న గారి లాగా..సరే ఈ పాటలు ఈ గోలల మధ్య లో ఫోన్లు,,వెళ్లి కాల్ ఆన్సర్ చేసే వరకు మోగుతూనే ఉంటుంది ట్రింగ్ ట్రింగ్ మనుకుంటూ ,ఈ లోగ టైం 7 .౩౦ అవనే అవుతుంది,,మళ్ళి లేచి హడావుడి గా రెడీ అయ్యి బయలుదేరాలిగా ఆఫీసులకు,,అందుకే తెల్లవారు ఝాముననే లేచి పూజ చేసుకోండి అని చెప్తా నేను,ప్రశాంత వాతావరణం లో చేసుకుంటే మనసు లగ్నం అవుతంది దేవుడి మీద..ఈ రణగొణ ధ్వని లో ఏమి ఉంటుంది..చికాకు తప్ప,,,,ఇంక రేపటి నుండి ఎవరు లేవకముందే పొద్దున్నే లేచి పూజ చేసుకుంటా, మీ గోల లేకుండా ఉంటుంది అని నసుగుతూ వెళ్ళిపోతారు ఆఫీసు కు...మరీ ఆ పొద్దు ఎప్పుడు వస్తుందా అని గత వారం రోజులు గా ఎదురు చూస్తూనే ఉన్నాను.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|